హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Constable Preparation: కానిస్టేబుల్ పరీక్ష ప్రిపరేషన్ టిప్స్.. ఈ ప్రణాళిక ఫాలో అయితే 60 మార్కులు తెచ్చుకోవచ్చు.

Constable Preparation: కానిస్టేబుల్ పరీక్ష ప్రిపరేషన్ టిప్స్.. ఈ ప్రణాళిక ఫాలో అయితే 60 మార్కులు తెచ్చుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ మూడవసారి రాష్ట్ర ప్రభుత్వం యువకులకు ఈ అవకాశం కల్పించిందని మహబూబ్ నగర్ జాగ్రఫీ ఉపాధ్యాయుడు శివాజీ అన్నాడు. కానిస్టేబుల్ పరీక్షలో విజయం ఎలా సాధించాలో అభ్యర్థులకు పలు సూచనలు ఇచ్చాడు. వాటి గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar (Mahabubnagar), India

(Syed Rafi, News 18, Mahabubnagar)

తెలంగాణ రాష్ట్రం(Telangana Government) ఏర్పడిన తర్వాత  కానిస్టేబుల్(Constable) నోటిఫికేషన్ వెలువడటం మూడో సారని హబూబ్ నగర్ జాగ్రఫీ ఉపాధ్యాయుడు శివాజీ అన్నాడు. రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఈ సారి మాత్రం నెగెటివ్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రశ్న పత్రాన్ని చూసి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 60 మార్కులు సాధించడానికి మంచి ప్రణాళికతో జవాబులు గుర్తించాలన్నారు. 60 మార్కులు(Marks) సాధించినట్లయితే క్వాలిఫై అయి.. తర్వాత ఈవెంట్స్ కు పిలుస్తారని పేర్కొన్నారు.  కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువగా హార్డ్ సబ్జెక్టు లైనా మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్లో అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ తోపాటు ప్యూర్ మ్యాథ్స్ చదవడంతో మంచి మార్కులు సాధించడం జరుగుతుందన్నారు.

Language Pandit Exams: లాంగ్వేజ్ పండిట్ ప‌రీక్ష‌ల‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏ స‌బ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉంటాయో తెలుసా..?


ముఖ్యంగా జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం చాలా మంచిదని అన్నారు. అందులో హిస్టరీ అనేది సోషల్ పార్ట్ గా మేజర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చాలా ఎక్కువ అంశాలు ప్రాధాన్యత తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిపై 40 మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. అందుకు హిస్టరీ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే బాగుంటుంది. మ్యాథ్స్ తో పాటు హిస్టరీ చాలా అవసరం.

దానితోపాటు జియోగ్రఫీ పై 15 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జియోగ్రఫీ అనగానే చాలా మటుకు అభ్యర్థులు భయాందోళనకు గురవుతారు. కానీ జియోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ తో పాటు ఈసారి ప్రిన్సిపాల్ జియోగ్రఫీ అనే కొత్త అంశం పెట్టడం జరిగిందన్నారు.

SGT Preparation Plan: ఎస్జీటీకి ఇలా ప్రీపేర్ అవ్వండి.. విజయం మీ సోంతం అయినట్లే..


యూనివర్సల్ జియోగ్రఫీలో ఉదాహరణకు భూమి యొక్క నిర్మాణము , సముద్ర శాస్త్రము వంటి వాటి గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అంతేకాక మనకున్న వాటిలో ఐదు మహాసముద్రాలు వాటి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు కానిస్టేబుల్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనవి పరీక్ష పత్రంలో ఇవి కీ రోల్ గా ఉంటాయి. ముఖ్యంగా దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు వివిధ కార్యక్రమాల గురించి బాగా అడుగుతారు. కాబట్టి వాటిలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు ఇంతసేపు మ్యాథమెటిక్స్ సైన్స్ హార్డ్ సబ్జెక్టులుగా అనుకొని వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు.


కానీ జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్ పై ఫోకస్ చేయడం వల్ల మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈసారి పరీక్ష పత్రంలో నెగిటివ్ మార్కింగ్ పెట్టారు కాబట్టి చాలా జాగ్రత్తగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది లేని పక్షంలో తప్పుగా సమాధానం ఇచ్చినట్లయితే మనకు వచ్చిన మార్కుల్లో కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు కరెక్ట్ జవాబులు మాత్రమే ఇవ్వండి. ఒకవేళ తెలవని పక్షంలో ఆ ప్రశ్నలు వదిలేయడం ఉత్తమం. ప్రశ్నా పత్రంలో ముందుగా వచ్చిన వాటిల్లో జవాబులు ఇచ్చి రాని వాటిని ఆలోచించి కరెక్ట్ గా సమాధానం ఇవ్వడం మంచిదని.. ఒకవేళ సమాధానం తెలువక పోతే సమాధానం ఇవ్వకుండా వదిలివేయడం మంచిదన్నారు. లేని పక్షంలో వచ్చిన మార్కులలో నెగిటివ్ మార్కింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

First published:

Tags: Career and Courses, Exam Tips, Exams, JOBS, Ts constable, Women constables

ఉత్తమ కథలు