హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MSME Jobs : పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం..జీతం లక్షల్లో

MSME Jobs : పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం..జీతం లక్షల్లో

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MSME ministry Recruitment : మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం(MSME)ఎంటర్‌ప్రైజెస్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణావకాశం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

MSME ministry Recruitment 2022 : మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం(MSME)ఎంటర్‌ప్రైజెస్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణావకాశం. దీని కోసం (MSME Ministry Recruitment 2022)MSMEమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెవలప్‌మెంట్ కమీషనర్ కార్యాలయం యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ కన్సల్టెంట్ తో సహా అనేక పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను కోరింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు MSME అధికారిక వెబ్‌సైట్ msme.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31.


అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నేరుగా https://msme.gov.in/ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా MSME మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF, మీరు అధికారిక నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 7 పోస్టులు భర్తీ చేయబడతాయి.



MSME మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ముఖ్యమైన తేదీ


దరఖాస్తుకు చివరి తేదీ -ఆగస్టు 31


ఖాళీల వివరాలు


యంగ్ ప్రొఫెషనల్-02
కన్సల్టెంట్ గ్రేడ్ 1-02

కన్సల్టెంట్ గ్రేడ్ 2-01

సీనియర్ కన్సల్టెంట్-02


Jobs in Flipkart: ఫ్లిప్ కార్ట్ లో జాబ్స్ .. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో రూ.40 వేల వరకు వేతనం.. ఇలా రిజిస్టర్ చేసుకోండి


MSME మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అర్హత ప్రమాణాలు


యంగ్ ప్రొఫెషనల్ - సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ప్రీమియర్ విద్యా సంస్థల నుండి BE/B.Tech లేదా CS లేదా IT లేదా MCA డిగ్రీ. అలాగే సంబంధిత రంగంలో కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.


కన్సల్టెంట్ గ్రేడ్ 1- BE / B-Tech / ME / M-Tech / MBA (ఫైనాన్స్) / MA (ఎకనామిక్స్) / LLB/LLMతో పాటు సంబంధిత రంగంలో 05 సంవత్సరాల పని అనుభవం


కన్సల్టెంట్ గ్రేడ్ 2- సంబంధిత రంగంలో కనీసం 8 సంవత్సరాల పని అనుభవంతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి LLB.


సీనియర్ కన్సల్టెంట్ - ప్రభుత్వంలో కనీసం 15 సంవత్సరాల పని అనుభవం లేదా క్యాడర్‌లో కనీసం 6 సంవత్సరాల అనుభవంతో అండర్ సెక్రటరీ కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉన్న ఏదైనా రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్.

First published:

Tags: Central Govt Jobs, Govt Jobs 2022, Msme jobs

ఉత్తమ కథలు