హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SGT Preparation Tips: ఇలాంటి ప్రణాళికతో ప్రిపేర్ అయితే.. చదివింది అస్సలు మర్చిపోరు..

SGT Preparation Tips: ఇలాంటి ప్రణాళికతో ప్రిపేర్ అయితే.. చదివింది అస్సలు మర్చిపోరు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SGT Preparation Tips: తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రిపరేషన్ లో మెళకువలను తెలుసుకోవాలని.. ప్రణాళికా బద్ధంగా చదివితే కలువు కొట్టడం పెద్ద కష్టమేమి కాదని ఎస్జీటీగా పని చేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు సలహాలు, సూచలను ఇచ్చాడు. వాటి గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

(P. Mahender, News 18, Nizamabad)

ఎస్‌జీటి కోసం ప్రిపేర్(sgt preparation) అయ్యేవారు ఎలా చదవాలి.. ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి.. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాలు ముందు తెసులుకోవాలని సుద్ద‌ాల శ్రీనివాస్ ఎస్‌జీటి, జ‌గీత్యాల్(Jagityal) చెబుతున్నారు. ఎస్‌జీటి లో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఆఫ్ మార్కు ఉంటుంది. మొత్తం 80 మార్కుల పేపర్.. మరో 20 మార్కులు టెట్ లో(TET) వచ్చిన ర్యాంకు నుంచి కేటాయిస్తారు. ఈ 160 ప్రశ్నల నుంచి ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనేది ముందుగా తెలుసుకుందాం.  తెలుగు.. ఇంగ్లీష్..  మ్యాథ్స్..  సోషల్..  సైన్స్ ఇలా ఐదు సబ్జెక్టుల నుంచి మనకు కాంటెంట్(Content) రూపంలో  45 మార్కులు వస్తాయి. మెథ‌డాల‌జీ నుంచి 15 మార్కులు వ‌స్తాయి. తెలుగు కంటెంట్ నుంచి 9 మార్కులు, మరో మూడు మార్కులు మెథడాలజీ నుంచి వస్తాయి.

Google Job Vacancy 2022: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. అయితే ఇదిగో Google మీ కోసం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది..


Mathematics కంటెంట్ నుంచి 9 మార్కులు మ్యాథమెటిక్స్ మెథడాలజీ నుంచి 3 మార్కులు.. సైన్స్ కంటెంట్ నుంచి 9 మార్కులు వస్తాయి. సైన్స్ మెథడాలజీ నుంచి మూడు మార్కులు.. సోషల్ కంటెంట్ నుంచి 9 మార్కులు సోషల్, మెథడాలజీ నుంచి 3 మార్కులు ఇలా మొత్తం 60 మార్కులు వ‌స్తాయి.. ఇంకొక 20 మార్కులు ప్ర‌స్పేక్టీవ్ నుంచి వస్తాయి.. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ మధ్య జరిగిన సంఘటనలు గురించి వ‌స్తాయి.. ఇలా మొత్తం 80 మార్కులకు కోష‌న్స్ వ‌స్తాయి..  కంటెంట్ కోసం మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ చదవాలి..  మెథడాలజీ కొసం మెథడాలజీ గురించి పూర్తిగా చదవాలి.. ప్ర‌స్పేక్టీవ్ అంటే ఓన్లీ తెలుగు అకాడమీ చదివితే సరిపోదు..  బయట మెటీరియల్.. లేదా బుక్ స్టాల్ లో దొరికే మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు.

కరెంట్ అఫైర్స్ కోసం డైలీ న్యూస్ పేపర్ చదవడం మంచిది..  ఒక సబ్జెక్టును చదివేటప్పుడు ఒకసారి కాకుండా పదేపదే చదివితే ఆ స‌బ్జేక్ట్ పై ప‌ట్టు సాదిస్తారు. ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటే.. దానిని కనీసం ఆరు సార్లు చదివితే ఎక్కువ రోజులు గుర్తుండిపోతాయి. తాను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా క్యాంపస్ లో ఉండే బుక్స్ చదవడంతోనే ఎస్జీటీ సాధించినట్లు చెప్పారు. బుక్స్ ఎక్కువ సార్లు చదవడం.. అలాగే మోడల టెస్టులు ఎక్కువగా రాయడం ద్వారా.. సమాధానలు ఎక్కువ కాలం గుర్తుంటాయని తెలిపారు. అన్నింటికీ సంబంధించి మోడల్ పేపర్లు తీసుకొని .. ఇంట‌ర్ నెట్ లో మోడల్ ఒఎంఆర్ షీట్స్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిదనన్నారు.


IBPS Reasoning Tips: ఐబీపీఎస్ రీజనింగ్ ప్రిపరేషన్.. ఈ టిప్స్ పాటిస్తే బ్యాంక్ జాబ్ మీ జేబులో ఉన్నట్లే..


ఎగ్జామ్లో క్వశ్చన్ ఏవిధంగా వ‌స్తాయి.. ఆన్సర్ ఎలా చేయాలి.. అనే విషయాలు మనకు తెలుస్తుంది.. ఇలా చేయడంతో మనము 160 క్వశ్చన్ ల లో ఎన్ని క్వ‌ష‌న్స్ కు ఆన్స‌ర్ చేయ‌గ‌ల‌మో తెలుస్తుంది.. ఎన్ని మార్కులు వస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు.. ఎంత కాంపిటేషన్ ఉన్నా..  మనపై మనకు నమ్మకం తో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం కాంపిటీషన్లో ఉండగలుగుతాం.. ప్రతిరోజూ 10 నుంచి 12 గంటలు ప్రిపేర్ అవుతూ.. ప్రతి రోజూ ఒక మూడు గంటలు ప‌రీక్ష రాసుకుంటే మన త‌ప్పులు తెలుస్తాయాన్నారు. ఇలా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపరేషన్ పై దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించారు.

First published:

Tags: Aim teacher, Career and Courses, JOBS, Preparation, Teacher jobs

ఉత్తమ కథలు