మహిళలు పురుషులతో సమానంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. కేవలం ఉద్యోగార్ధులుగానే కాకుండా ఉపాధి సృష్టికర్తలుగా మారి ఎంతో మందికి జాబ్స్ కల్పిస్తున్నారు. మహిళలు ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచిస్తారన్న విషయం తెలిసిందే. ఇంటి పనులను చక్కబెడుతూనే ఉద్యోగాలు చేస్తుంటారు. వ్యాపారంలో వారు ఎదగడానికి ఇది ఎంతగానో సహకరిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, కరోనాతో అనేక మంది జీవనోపాధి కోల్పోవడంతో ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉద్యోగాలు వెతికేవారితో పాటు చిన్న స్టార్టప్ పెట్టుకోవాలనుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారి కోసం కొన్ని స్టార్టప్ ఐడియాలు. వీటికి భారీ పెట్టుబడులు లేదా ఆఫీస్ స్పేస్ అవసరం లేదు. వీటిని ఆన్లైన్లోనే ప్రారంభించవచ్చు. మీకు వీటిలో నైపుణ్యం ఉంటే చాలు, ఎక్కువ పెట్టుబడి లేకుండానే.. ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించవచ్చు. మహిళల కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్టార్టప్ ఐడియాలపై ఓలుక్కేయండి.
కరోనాతో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. దీంతో, యోగా పరిశ్రమ వృద్ధి చెందుతోంది. చాలా మంది శారీరక ఆరోగ్యానికి సమయం కేటాయించటానికి వారి రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. యోగా పట్ల ఉన్న అభిరుచిని లాభదాయకమైన మార్కెట్‌గా మార్చుకొని ఆరోగ్యం, సంపదపై దృష్టి పెట్టవచ్చు. కరోనాతో ఆన్లైన్ శిక్షణకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో మీరు ఆన్లైన్ యోగా క్లాసులు నిర్వహిస్తూ... మంచి రాబడిని పొందవచ్చు. అందువల్లే, ఈ మధ్య కాలంలో యోగా స్టూడియోలు డిజిటల్ వేదికలుగా మారుతున్నాయి. దీనికి పెట్టుబడి కూడా అవసరం లేదు. కేవలం మీకున్న యోగా నైపుణ్యాలతో మంచి రాబడి ఆర్జించవచ్చు.
Work From Home Jobs: ఆన్లైన్లో డబ్బు సంపాదించండి ఇలా
Work From Home Jobs: నెలకు రూ.30,000 సంపాదించండి... వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవే
ఇమేజ్ కన్సల్టెన్సీ బిజినెస్ భారతదేశంలోని ట్రెండింగ్ వ్యాపారాల్లో ఒకటి. నైపుణ్యం కలిగిన ఇమేజ్ కన్సల్టెంట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇది వేల కోట్ల విలువైన బిజినెస్‌గా మారింది. ఇమేజ్ కన్సల్టెంట్‌గా మారి, ఇంటి నుండి పని చేస్తూ.. మంచి ఆదాయం సంపాదించవచ్చు. మీరు ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకోవడం, వారిని హ్యాండిల్ చేయడం ద్వారా మంచి రాబడిని ఆర్జించవచ్చు. రోజూ కొద్ది సేపు పనిచేస్తూ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది.
సృజనాత్మకత, నైపుణ్యం కలిగి ఉన్న మహిళలకు ఇది ఉత్తమమైన వ్యాపార ఆలోచన. గ్రాఫిక్ డిజైనర్ల అవసరం దాదాపు అన్ని రంగాల్లో ఉంటుంది. వ్యాపార వృద్ధిలో వీరు కీలక పాత్ర వహిస్తారు. బ్రోచర్లు, బిజినెస్ కార్డులు, కరపత్రాలు, బ్యానర్లు వంటి మార్కెటింగ్ అవసరాలకు ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్లు అవసరం. ఒక సంస్థకు కావాల్సిన లోగో డిజైన్, టీ-షర్టు డిజైన్, వెబ్సైట్ వంటి వాటిని రూపొందించడంలో వీరు అవసరం ఉంటుంది.
Work From Home Jobs: మీకు ఈ 6 స్కిల్స్ ఉన్నాయా? ఇంటి నుంచే జాబ్ చేయొచ్చు
Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా
మహిళలు ఆర్థిక ప్రణాళికల్లో ముందుంటారు. అంతేకాక మెరుగైన ఆర్థిక సలహాలు ఇవ్వడంలో వారిది అందవేసిన చేయి. ఇదే నైపుణ్యాన్ని వృత్తిగా చేసుకొని.. గణనీయమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటికి పరిష్కారాలు, ఉద్యోగ పురోగతి, ఇంటి పని, ఆఫీసు పని చక్కదిద్దడం, రిటైర్మెంట్ సేవింగ్స్‌పై అవగాహన కల్పించడం, పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించడం వంటి సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు. మహిళల సలహాలు కేవలం మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఉపయోగపడతాయి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సలహా ఇవ్వడం ద్వారా మీ వృత్తిని ప్రారంభించండి. ఆ తర్వాత సలహాల కొరకు నెమ్మదిగా రుసుము వసూలు చేయడం ప్రారంభించండి.
పిల్లలు, యువకులు, వ్యాపారులు, వైద్యులు, ప్రయాణాలకు ఆసక్తి చూపే వ్యక్తులు విదేశీ భాషలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్ల మీరు విదేశీ బాషలు నేర్చుకున్నట్లైతే, దాన్నే వ్యాపారంగా మలుచుకొని మంచి రాబడిని ఆర్జించవచ్చు. ఆన్లైన్ తరగతుల ద్వారా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుతం, ఆన్లైన్ క్లాసులు వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. స్కైప్, జూమ్, గూగుల్ హ్యాంగ్అవుట్, ఇతర ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ల ద్వారా క్లాసులు నిర్వహిస్తూ మంచి ఆదాయాన్ని రాబట్టవచ్చు.
అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు ఆన్లైన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా కస్టమర్లను సులభంగా చేరుకోగలమని భావిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలు సొంత వెబ్సైట్లను కలిగి ఉండాలని యోచిస్తున్నాయి. ఎందుకంటే, తమ వస్తువులు, సేవలను ప్రకటించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని చేరుకోవచ్చు. మీరు కూడా మీ సొంత బ్లాగింగ్ సంస్థను ప్రారంభించాలనుకుంటే మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఫ్రీలాన్స్ బ్లాగర్, ఘోస్ట్ బ్లాగర్, అఫిలియేట్ మార్కెటర్, అడ్వర్టైజ్మెంట్ బ్లాగర్, ఆన్లైన్ కోర్సు క్రియేటర్, బిజినెస్ బ్లాగర్, సోషల్ మీడియా బ్లాగర్‌గా పనిచేస్తూ ఆన్లైన్లో డబ్బు సంపాదించవచ్చు.
ఆన్లైన్ ట్యూటర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఒకరకంగా కరోనా దీనికి ఉపయోగపడిందనే చెప్పాలి. అందువల్ల, ఇది పర్సనల్ ట్యూటర్లకు, శిక్షణా సంస్థలకు భారీ వ్యాపార అవకాశంగా చెప్పవచ్చు పెరుగుతున్న ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫాంలు ఈ పరిశ్రమ అభివృద్ధికి ఊతమిస్తున్నాయి.
మీరు కళలు, సంగీతం లేదా నృత్యంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులైన కళాకారులైతే.. మీ నైపుణ్యాన్ని ఆదాయ వనరుగా మలుచుకోండి. పిల్లలు, పెద్దలకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం ఆర్జించవచ్చు.
పెరుగుతున్న ఒత్తిడి, సమస్యల కారణంగా లైఫ్ కోచ్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. కోచ్‌గా ఇతరుల సమస్యలకు పరిష్కారాలను చూపించవచ్చు. లైఫ్ కోచ్‌గా పనిచేస్తూ.. డబ్బు ఆర్జించడంతో పాటు వేలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు.
చాలా మంది మహిళలు తమకున్న వంట నైపుణ్యాలతో మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. తమ ఇళ్లలోనే కేకులు, స్వీట్లు, కుకీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. సాధారణ రిటైల్ బేకరీలను తమ ఫ్రాంచైజీలుగా విస్తరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, BUSINESS NEWS, CAREER, JOBS, Online business, Small business, Startups, Women