హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Top Professional Courses: ఆన్​లైన్​ కోర్సులకు పెరిగిన డిమాండ్​... భారతీయులు ఎంచుకున్న టాప్ 10 ప్రొఫెషనల్ కోర్సులివే

Top Professional Courses: ఆన్​లైన్​ కోర్సులకు పెరిగిన డిమాండ్​... భారతీయులు ఎంచుకున్న టాప్ 10 ప్రొఫెషనల్ కోర్సులివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Top Professional Courses 2021 | కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ కోర్సులకు (Online Courses) డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ స్కిల్స్ పెంచుకోవడం కోసం ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నారు. మరి 2021 లో భారతీయులు ఎంచుకున్న టాప్ 10 ప్రొఫెషనల్ కోర్సులు ఏవో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ఈ ఏడాది ముగియడానికి ఇంకొన్ని రోజులే ఉంది. మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2021 ఏడాది కోవిడ్ కారణంగా మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. దీంతో నైపుణ్యాలు లేని వారిని కంపెనీలు వదులుకున్నాయి. అందుకే, ఆన్​లైన్​ ద్వారా నైపుణ్యాలు (Skills) పెంచుకునేందుకు ఐటీ నిపుణులు ఎక్కువ శ్రద్ద కనబర్చారు. మరోవైపు, స్కిల్​ డెవలప్​ చేసుకోవాలనుకునే వారి కోసం కొన్ని టాప్​ ఎంఎన్​సీ కంపెనీలు అనేక సర్టిఫికెట్​​ కోర్సులు ప్రారంభించాయి. భారత్​లో ఈ ఆన్​లైన్​ ప్రొఫెషనల్ కోర్సులకు భారీ డిమాండ్​ ఏర్పడింది. అత్యధిక మంది గూగుల్, ఐబీఎమ్​ అందించే ప్రోగ్రామ్‌ల వైపు మొగ్గు చూపారు. ప్రముఖ ఆన్​లైన్​ ట్రైనింగ్ సంస్థ కోర్సెరా నివేదిక ప్రకారం, 2021లో భారతీయుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 ప్రొఫెషనల్ సర్టిఫికెట్‌ కోర్సులపై ఓలుక్కేద్దాం.

గూగుల్ డేటా అనలిటిక్స్ కోర్సు


సెర్చింజన్​ దిగ్గజం గూగుల్​ ఈ ఏడాది కొత్త ప్రోగ్రామ్​తో ముందుకొచ్చింది. డేటా అనలిటిక్స్​ ఆన్​లైన్​ ప్రోగ్రామ్​ ప్రారంభించింది. స్ప్రెడ్‌షీట్‌లు, SQL, R ప్రోగ్రామింగ్‌లను ఉపయోగించి డేటా అనాలసిస్​ ఎలా చేయాలనే దానిపై ఈ కోర్సును ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లు, ప్రెజెంటేషన్లు, సాధారణంగా ఉపయోగించే విజువలైజేషన్ ప్లాట్‌ఫారమ్‌ల సహాయంతో ఈ కోర్సును డిజైన్​ చేసింది.

SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో 1,226 ఎస్‌బీఐ బ్యాంక్ జాబ్స్... త్వరలో ముగియనున్న గడువు

గూగుల్ యూఎక్స్​ డిజైన్


ఈ ఏడాది గూగుల్ యూక్స్​ డిజైన్​ అనే మరో కోర్సును కూడా ఆఫర్​ చేసింది. పరిశోధన అధ్యయనాలను ప్లాన్ చేయడం, ఇంటర్వ్యూలు, వినియోగ అధ్యయనాలు నిర్వహించడం, పరిశోధన ఫలితాలను సంశ్లేషణ చేయడం వంటి యూఎక్స్​ రిసెర్చ్​ టాపిక్స్​పై పట్టు సాధించేలా ఈ కోర్సును రూపొందించింది. యూఎక్స్​ డిజైన్​లో కెరీర్​ గ్రోత్ కోరుకునే వారి కోసం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సును నేర్చుకునేందకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

గూగుల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు


సెర్చింజన్​ దిగ్గజం గూగుల్​ ప్రాజెక్ట్ మేనేజ్​మెంట్​ కోర్సును కూడా ఆఫర్​ చేస్తోంది. టీమ్​ లీడర్లు లేదా ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం దీన్ని స్పెషల్​గా డిజైన్​ చేసింది. జూనియర్ లేదా అసోసియేట్ డేటా అనలిస్టులకు ప్రాజెక్ట్ మేనేజ్​మెంట్​ పట్ల అవగాహన కల్పించడమే​ ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ సర్టిఫికేట్‌ కోర్సును ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో 140 గంటల కంటే ఎక్కువ లెర్నింగ్, వందలాది ప్రాక్టీస్ -ఆధారిత అసెస్‌మెంట్లు ఉంటాయి. ఎవరైనా ఈ కోర్సును ఉచితంగా నేర్చుకోవచ్చు.

గూగుల్​ ఐటీ సపోర్ట్ కోర్సు


గూగుల్ ఆఫర్​ చేస్తున్న ఐటీ సపోర్ట్ కోర్సు మొత్తం ఆరు నెలల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సులో మీరు కంప్యూటర్ అసెంబ్లీ, వైర్‌లెస్ నెట్‌వర్కింగ్, ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేయడం, కస్టమర్ సేవతో సహా రోజువారీ ఐటీ సపోర్ట్ పనుల గురించి నేర్చుకుంటారు. సమస్యలను గుర్తించడం దగ్గరి నుండి ట్రబుల్​ షూటింగ్, డీబగ్గింగ్ వరకు ఎండ్-టు-ఎండ్ కస్టమర్ సపోర్ట్‌ను ఎలా అందించాలో కూడా నేర్చుకుంటారు. వారానికి 10 గంటల పాటు క్లాసులు ఉంటాయి.

Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఐబీఎమ్​ డేటా సైన్స్ కోర్సు


డేటా సైన్స్ లేదా మెషిన్ లెర్నింగ్‌లో కెరీర్‌ను ఎంచుకునే వారి కోసం ఐబీఎమ్ డేటా సైన్స్​ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సుపై ఆసక్తి ఉన్న ఎవరికైనా దీనిలో జాయిన్​ అవ్వొచ్చు. తద్వారా డేటా సైన్స్​ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ కోర్సును కంప్యూటర్ సైన్స్ లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై ఎటువంటి పరిజ్ఞానం లేని వారు కూడా నేర్చుకోవచ్చు. ఐబీఎం ఉచితంగానే ఈ కోర్సును ఆఫర్​ చేస్తోంది.

ఫేస్​బుక్​ సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్సు


ప్రముఖ డిజిటెల్ మార్కెటింగ్ సంస్థ ఆప్ట్లీతో కలిసి ఫేస్​బుక్​ ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఎంట్రీ-లెవల్ రోల్స్​ కోసం చూసే వారికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సు ద్వారా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఈ కోర్సు ద్వారా కేవలం ఐదు నెలల్లో బిగినర్స్ నుండి ప్రొఫెషనల్​గా మారవచ్చు. ఈ కోర్సులో చేరేందుకు ఎలాంటి డిగ్రీ లేదా అనుభవం అవసరం లేదు. మీరు ఉచితంగానే కోర్సును నేర్చుకోవచ్చు.

ఐబీఎం డేటా అనలిస్ట్ కోర్సు


డేటా అనలిటిక్స్​పై ఆసక్తి ఉన్న వారెవరైనా ఐబీఎం డేటా అనలిస్ట్ కోర్సు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా, నైపుణ్యాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా విజయవంతంగా డేటా అనలిస్ట్​గా కెరీర్​ ప్రారంభించవచ్చు. ఎక్సెల్, SQL, పైథాన్, జూపిటర్ నోట్‌బుక్‌లు, కాగ్నోస్ అనలిటిక్స్‌తో సహా వివిధ డేటా సోర్స్‌లు, ప్రాజెక్ట్ ఇమేజెస్​, డేటా అనలిటిక్స్​ టూల్స్​ ద్వారా సులభంగా ఈ కోర్సు నేర్చుకోవచ్చు. కోర్సులో భాగంగా ఎక్సెల్‌లో వివిధ చార్ట్‌లు, ప్లాట్‌లను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవచ్చు. ఐబీఎం ఈ కోర్సును ఉచితంగానే ఆఫర్​ చేస్తోంది.

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 300 జాబ్స్... బీటెక్ అర్హత

ఐబీఎం సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సు


సైబర్‌ సెక్యూరిటీలో కెరీర్​ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. సైబర్​ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్​కు అవసరమయ్యే అన్ని టెక్నికల్​ స్కిల్స్​ ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్, ఇన్‌సిడెంట్ రెస్పాన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్, పెనెట్రేషన్ టెస్టింగ్, వల్నరబిలిటీ అసెస్‌మెంట్‌తో సహా కాన్సెప్ట్‌లను ఈ కోర్సు మీకు పరిచయం చేస్తుంది. మీరు ఈ కోర్సు ద్వారా నేటి సైబర్‌ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్‌లో అనేక కొత్త అంశాలను నేర్చుకోవచ్చు. ఐబీఎం ఈ కోర్సును ఉచితంగానే ఆఫర్​ చేస్తోంది.

ఐబీఎం ఫుల్​ స్టాక్ క్లౌడ్ డెవలపర్ కోర్సు


ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సు మిమ్మల్ని ఫుల్-స్టాక్ క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్‌గా తీర్చిదిద్దుతుంది. మీ కెరీర్‌ని కిక్‌స్టార్ట్ చేయడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐబీఎం ప్రొఫెషనల్స్​చే ఈ కోర్సును డిజైన్​ చేసింది. దీని ద్వారా మీరు మీ స్వంత క్లౌడ్-ఆధారిత అప్లికేషన్‌లను రూపొందించడం నేర్చుకుంటారు. అంతేకాదు, ఈ కోర్సు ద్వారా హెచ్​టీఎంఎల్​, సీఎస్​ఎస్​, జీవా స్క్రిప్ట్, రియాక్ట్, బూట్​ స్ట్రాప్​ వంటి ఫ్రంట్-ఎండ్ డెవలప్‌మెంట్ లాంగ్వేజ్​లు, టూల్స్‌పై పట్టు సాధిస్తారు. ఐబీఎం ఈ కోర్సును ఉచితంగానే ఆఫర్​ చేస్తోంది.

సేల్స్‌ఫోర్స్ సేల్స్ ఆపరేషన్స్ ప్రొఫెషనల్ కోర్సు


ఈ సర్టిఫికేట్ కోర్సు మీకు సేల్స్‌ఫోర్స్‌లోని బేసిక్​ స్కిల్స్​ నేర్చిస్తుంది. సేల్స్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ సహా వివిధ రకాల ఎంట్రీ-లెవల్ సేల్స్ రోల్స్​కు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. దీన్ని ఫ్రెషర్స్​ కోసం ప్రత్యేకంగా డిజైన్​ చేసింది. ఈ కోర్సు ద్వారా మీరు CRM బేసిక్​ టాపిక్స్​తో పాటు సేల్స్‌ఫోర్స్‌లో అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా సేల్స్‌ఫోర్స్ డేటాను ఎలా నిర్వహించాలో కూడా తెలుసుకుంటారు.

First published:

Tags: Career and Courses, Google, IBM, Online classes, Online Education, Year Ender

ఉత్తమ కథలు