Home /News /jobs /

XIAOMI INDIA ANNOUNCED GROW WITH MI INITIATIVE WITH RS 100 CRORES WILL CREATE EMPLOYMENT OPPORTUNITIES FOR OVER 10000 INDIANS SS

Grow With Mi: 10,000 ఉద్యోగాలు... రూ.100 కోట్ల ప్యాకేజీ... ఇండియాలో షావోమీ ప్లాన్స్

Grow With Mi: 10,000 ఉద్యోగాలు... రూ.100 కోట్ల ప్యాకేజీ... ఇండియాలో షావోమీ ప్లాన్స్ ఇవే
(Xiaomi Logo)

Grow With Mi: 10,000 ఉద్యోగాలు... రూ.100 కోట్ల ప్యాకేజీ... ఇండియాలో షావోమీ ప్లాన్స్ ఇవే (Xiaomi Logo)

Grow With Mi | షావోమీ ఇండియా గ్రో విత్ ఎంఐ కార్యక్రమాన్ని ప్రకటించింది. రెండేళ్లలో రూ.100 కోట్లతో వ్యాపారాన్ని విస్తరించబోతోంది.

    షావోమీ ఇండియా భవిష్యత్ ప్రణాళికల్ని ప్రకటించింది. కంపెనీ ఆఫ్‌లైన్ అమ్మకాలు పెంచుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది. ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లను రెట్టింపు చేయబోతోంది. 30,000 స్టోర్లకు పెంచుతామని ప్రకటించింది. అంతేకాదు ఎక్స్‌క్లూజీవ్ ఎంఐ స్టోర్లను రెండేళ్లలో రెట్టింపు చేసి 6,000 స్టోర్లకు చేరుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్లతో గ్రో విత్ ఎంఐ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా 10,000 మంది భారతీయులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం రీటైల్ పార్ట్‌నర్స్‌గా ఉన్నవారు కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, నిర్వహించేందుకు షావోమీ ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది.

    ప్రస్తుతం భారతదేశంలో షావోమీకి 15,000 రీటైల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 3,000 ఎక్స్‌క్లూజీవ్ ఎంఐ స్టోర్స్ ఉన్నాయి. ఈ ఎక్స్‌క్లూజీవ్ స్టోర్స్‌లో కేవలం ఎంఐ, రెడ్‌మీ ప్రొడక్ట్స్ మాత్రమే లభిస్తాయి. అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలకు షావోమీ స్టోర్స్ విస్తరించాలి. ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్నది షావోమీ లక్ష్యం. అది కూడా ఒకటి రెండేళ్లలో ఈ టార్గెట్ చేరుకోవాలని భావిస్తోంది. అంటే వచ్చే ఏడాది నాటికి 30,000 రీటైల్ టచ్ పాయింట్స్ ఏర్పాటు చేయనుంది. ఇక రెండేళ్లలో ఎంఐ ఎక్స్‌క్లూజీవ్ స్టోర్స్ 6,000 దాటనున్నాయి.

    Smartphone: ఛార్జింగ్ సరిపోవట్లేదా? భారీ బ్యాటరీతో ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Realme 8 Pro: కాసేపట్లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో సేల్... ధర రూ.14,999 నుంచి


    గ్రో విత్ ఎంఐ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ మార్కెట్‌లో అడుగు పెట్టాలని భావిస్తోంది షావోమీ. దీని ద్వారా 10,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. దీంతో పాటు ఎంఐ రీటైల్ అకాడమీ కూడా ఏర్పాటు చేయబోతోంది షావోమీ. ఈ అకాడమీ ద్వారా వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చేవారికి ప్రొడక్ట్ ట్రైనింగ్, సేల్స్ ట్రైనింగ్, కస్టమర్ మేనేజ్‌మెంట్, కస్టమర్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఇన్ స్టోర్ డిజైనింగ్, కస్టమర్ సర్వీస్, రీటైల్ ఎక్సెలెన్స్ లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది షావోమీ.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు