ఈ భూప్రపంచంపై అత్యంత సంపన్నుడిగా మాత్రమే కాదు అత్యంత ప్రభావశీల వ్యక్తిగా కూడా అవతరించారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్. రెండు రోజుల క్రితమే పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మస్క్ ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ, దాని భవిష్యత్తు వినియోగం గురించి బాగా మాట్లాడుతున్నారు. అలాగే అద్భుతమైన దూరదృష్టితో భవిష్యత్తు తరాలకు చక్కటి సలహాలు ఇవ్వడంలో ముందుంటున్నారు. ఈ క్రమంలో మస్క్ తాజాగా కెరీర్ అడ్వైస్ (Career Advice) కూడా ఇచ్చారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌పై (Artificial Intelligence) వరల్డ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మస్క్ భవిష్యత్తు ఉద్యోగాలపై (Feature Jobs) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన కెరీర్ (Career) చాలా సెక్యూర్‌గా మారుతుందని.. ఏఐ ఉద్యోగులకు (Employees) ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు కోసం యువత ఏఐ లేదా హ్యూమన్ ఇంటరాక్షన్ ను కెరీర్ గా ఎంచుకోవాలని సలహా ఇచ్చారు.
భవిష్యత్తులో వివిధ రంగాలలోని ఉద్యోగాలపై వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రభావం గురించి మస్క్ మాట్లాడుతూ.. సురక్షితమైన, ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉన్న వృత్తులను ప్రస్తావించారు. గురువారం (డిసెంబర్ 9) జరిగిన వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మస్క్ మాట్లాడుతూ, "ఉద్యోగాల అవసరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయంగా తగ్గించవచ్చు" అని అభిప్రాయపడ్డారు.
Jobs in TCS: డిగ్రీ పాస్ అయినవారికి లాస్ట్ ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు రేపటిలోగా అప్లై చేయండి
భవిష్యత్తులో టెక్నాలజీ వల్ల ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతారా? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అని మస్క్‌ను ప్రశ్నించినప్పుడు.. "ఏఐ సాఫ్ట్వేర్ లేదా ప్రోగ్రామ్ మెషీన్లను అభివృద్ధి చేసే వ్యక్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఢోకా ఉండదు" అని మస్క్ సమధానమిచ్చారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్‌వేర్‌ను కూడా స్వయంగా రాయగల స్థాయికి చేరుకున్నప్పుడు.. ఏఐ ఉద్యోగాలు కూడా మటుమాయమవుతాయని మస్క్ చెప్పుకొచ్చారు. ఏఐ టెక్నాలజీ వల్ల ఉద్యోగ సంక్షోభం ఏర్పడవచ్చని మస్క్ బాంబు పేల్చారు.
Jobs in TCS: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. టీసీఎస్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
సమీప భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఉత్పత్తి, పంపిణీ పనులన్నీ జరిగిపోవచ్చని మస్క్ అన్నారు. దీనివల్ల భవిష్యత్ సమాజాలలో హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది బాగా అవసరం కావచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల పార్టిసిపేషన్ లేదా ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఏదైనా వర్క్ చేస్తుంటే, అది మీ భవిష్యత్తును సెక్యూర్ గా ఉంచుతుందన్నారు. ఒకవేళ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జరిగినా.. ఆ ఉత్పత్తులను కొనుక్కునేలా ప్రోత్సహించడం ఒక్క మనుషులకే సాధ్యమవుతుంది. ఇలాంటప్పుడు కంపెనీలన్నీ కూడా హ్యూమన్ ఇంటరాక్షన్ పై ఆధారపడతాయి. అయితే హ్యూమన్ ఇంటరాక్షన్ కు సంబంధించిన ఫీల్డులో ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మస్క్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Artificial intelligence, CAREER, Career and Courses, IT jobs, Job notification, JOBS, Private Jobs