హోమ్ /వార్తలు /jobs /

Work From Home Vs WFO: ఆఫీసులకు రమ్మంటే జాబ్స్ వదిలేస్తున్న ఎంప్లాయిస్.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..

Work From Home Vs WFO: ఆఫీసులకు రమ్మంటే జాబ్స్ వదిలేస్తున్న ఎంప్లాయిస్.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..

వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటైన ఎంప్లాయిస్ (Employes) ఇప్పుడు ఆఫీసులకు తిరిగి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ రిక్రూట్‌మెంట్ సంస్థ చేసిన సర్వేలో ఏ ఎంప్లాయిస్ నోట విన్నా... వర్క్ ఫ్రమ్ హోమే ముద్దు ఆఫీస్ వద్దు అనే మాట వినిపించింది.

ఇంకా చదవండి ...

  కరోనా (Corona) మహమ్మారి విజృంభించిన తర్వాత ప్రజలు వర్క్ విషయంలో కంఫర్టబుల్ గా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత చూపించారు. ఈ మహమ్మారి వ్యాప్తి సమయంలో దాదాపు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) చేశారు. అలా వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటైన ఎంప్లాయిస్ (Employes) ఇప్పుడు ఆఫీసులకు తిరిగి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ రిక్రూట్‌మెంట్ సంస్థ చేసిన సర్వేలో ఏ ఎంప్లాయిస్ నోట విన్నా... వర్క్ ఫ్రమ్ హోమే ముద్దు ఆఫీస్ వద్దు అనే మాట వినిపించింది. ఈ సర్వేలో వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా లేక హయ్యర్ శాలరీస్ కావాలా అని అడిగితే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపారు. అంతేకాదు, ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు ఇవ్వకపోతే.. ఆ జాబ్ మానేసేందుకు కూడా వెనుకాడబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు.

  తాజాగా రిక్రూట్‌మెంట్, స్టాఫింగ్ సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ (CIEL HR) సర్వీసెస్ నిర్వహించిన ఒక సర్వేలో 620 కంపెనీల నుంచి దాదాపు 2,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో ప్రతి 10 మంది ఉద్యోగులలో కనీసం ఆరుగురు.. ఆఫీస్ లో వర్క్ చేయడం కంటే రాజీనామా చేయడానికే తాము సిద్ధంగా ఉన్నామని సమాధానమిచ్చారు. సర్వే ఫలితాల ప్రకారం, దాదాపు ప్రతి 10 మందిలో ఆరుగురు ఉద్యోగులు హై శాలరీలు ఇచ్చే వర్క్ ఎట్ ఆఫీస్ జాబ్స్ (Work At Office) పై ఏ మాత్రం ఆసక్తి కనబర్చలేదు. అలా హై-పెయిడ్ జాబ్ కంటే తాము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని వీరు కుండబద్దలు కొట్టారు. ఐటీ, ఔట్‌సోర్సింగ్, టెక్ స్టార్టప్‌లు, కన్సల్టింగ్.. ఇలా అన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగులందరి నుంచి ఇలాంటి సమాధానాలే వినిపిస్తున్నాయి.

  CBSE 12th CLASS: సీబీఎస్‌ఈ 12వ తరగతి టర్మ్1 ఫలితాలపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఇలా ఫిర్యాదు చేయండి..

  ప్రజలు ఇంటి నుంచి పనిని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వర్క్ మోడల్ లో పని సామర్థ్యాలను ప్రభావితం చేయకుండా వర్క్-లైఫ్ బెటర్ గా బ్యాలెన్స్ చేయడం సులభమవుతుంది. సర్వేలో పాల్గొన్న 620 కంపెనీల ఉద్యోగుల్లో 40 శాతం పూర్తిగా ఇంటి నుండి పని చేస్తున్నారు. అయితే 26 శాతం హైబ్రిడ్ మోడ్‌లో వర్క్ చేస్తున్నారు. మిగిలిన కంపెనీల ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేస్తున్నారు.

  రిమోట్ వర్కింగ్ ఆప్షన్స్

  ఎంప్లాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నందున, కరోనా సమయంలో రిమోట్ వర్కింగ్‌ను ప్రారంభించాయి చాలా సంస్థలు. అయితే ఇప్పుడు ఈ వర్క్ మోడల్ ను కనీసం ఒక ఎంపికగానైనా కొనసాగించాలని సంస్థలు యోచిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఒక ఆప్షన్ తో కరోనా సమయంలో 'ఎజైల్ వర్కింగ్ మోడల్స్' పాలసీని టాటా స్టీల్ సంస్థ తీసుకొచ్చింది.

  ఈ పాలసీలో ఉద్యోగులు ఒక నిర్దిష్ట సమయం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ పాలసీని కొనసాగించాలని టాటా కంపెనీ యోచిస్తోంది. మరోవైపు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ హైబ్రిడ్‌ మోడ్‌లోకి మారుతోంది. దీని ప్రకారం 25 శాతం మంది ఉద్యోగులు, కనీసం 25 నిమిషాలపాటు ఆఫీస్ లో వర్క్ చేస్తే చాలు. ఇంకా ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో అడుగులు వేస్తున్నాయి.

  First published:

  ఉత్తమ కథలు