WORK FROM HOME EMPLOYEES DO NOT WANT TO COME TO THE OFFICE THEY ACCUSTOMED TO WORK FROM HOME EVK
Work From Home: ఆఫీసుకు రావాలనుకోవడం లేదు.. "వర్క్ ఫ్రం హోం"కు అలవాటు పడ్డ ఉద్యోగులు
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా తరువాత వర్క్ ఫ్రం హోం కల్చర్ అన్ని కంపెనీలలో పెరిగింది. ఇప్పుడు తిరిగి కంపెనీలకు రావడానికి చాలా మంది ఉద్యోగులు ఆసక్తి కనబర్చడం లేదు. దీనిపై పలు ఆలోచన చేస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులలో మార్పుకు కారణాలు విశ్లేషిస్తున్నారు.
కరోనా (Corona) తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యమైంది వర్క్ ఫ్రం హోం కల్చర్. కరోనాకు ముందు వర్క్ ఫ్రం హోం. కరోనా సమయంలో చాలా కంపెనీలు రిమోట్ వర్కింగ్ (Remote Working) అవకాశాన్ని కల్పించాయి. ఇప్పుడు తిరిగీ కంపెనీలకు రావడానికి చాలా మంది ఉద్యోగులు ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో యజమాని ఉద్యోగిపై పూర్తి హక్కును కలిగి ఉండేవాడని, ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం (Work From Home) కారణంగా ఉద్యోగికి తన పని వాతావరణాన్ని నియంత్రించుకొనే అవకాశం లభించిందని మెర్సెర్ మెట్ల్ (Mercer Mettl) సీఈఓ సిద్ధార్థ గుప్త అన్నారు. . పనితోపాటు జీవితాన్ని వారికి ఇష్టపూర్వకంగా నియంత్రించుకొవాలనే భావన వారిలో పెరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంను డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.
గతంలో కాకుండా ఉద్యోగులు కార్యాలయాలకు దూరంగా ఉన్నా.. పనికి దగ్గరగా ఉన్నారని గెట్వర్క్ (GetWork) వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ వీర్వాల్ అన్నారు. ఉద్యోగులు పనిని ఆస్వాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితి కారణాలపై InCruiter సహ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల అభిప్రాయం మారడానికి ప్రధాన కారణం ఆరోగ్య కరమైన కుటుంబ సమయం ఉండడమేని న్నారు. వారు ఇప్పుడు ఇంటి భోజనం, వినోదం ఆస్వాదిస్తున్నారిని అన్నారు. అంతే కాకుండా స్థానికేతరులకు ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నరారు. దీంతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంను వదలడం లేదని వ్యాఖ్యానించారు. ప్రయాణాలతో సమయం వృధాకాకుండా ఉండడతో వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటున్నారని అగర్వాల్ అన్నారు. కంపెనీలకు ఉత్పాదకత పెరిగిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చాలా మంది రిమోట్ వర్కింగ్ మోడల్‌ను ఇష్టపడుతున్నారు. అయితే చాలా మంది హైబ్రిడ్ మోడ్‌కు వ్యతిరేకంగా లేరని కూడా లేరు. హైబ్రిడ్ అనేది ఆన్లైన్, ఆఫ్‌లైన్ పని కలయిక. చాలా వర్క్‌ప్లేస్‌లు కూడా హైబ్రిడ్ మోడల్‌ను ఎంచుకుంటున్నాయి.
ఇది ఉద్యోగులు మరియు యజమానులకు మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగులు హైబ్రిడ్ సెటప్‌లో ఉన్నప్పటికీ, కార్యాలయానికి తిరిగి రావడానికి తమ సుముఖతను వ్యక్తం చేశారు.
అయితే వర్క్ ఫ్రం హోంకు సంబంధించి రవాణా, లాగ్ ఆఫ్ చేసే సమయం అంశాలపై కంపెనీలు దృష్టి పెడితే మెరుగైన ఉత్పాదకత సాధించవ్చని InCruiter సహ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీలు, ఉద్యోగులు ఇద్దరిలో మార్పు అవసరం అని ఆయన అభిప్రాయ పడ్డారు. సుదీర్ఘకాలం ఉత్పాదనకు హైబ్రీడ్ మోడల్ ఉపయోగపడుతుందని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.