Work From Home కోసం 377 శాతం పెరిగిన డిమాండ్...ఆఫీసుకు నో...ఇంట్లోనే ఎస్..

53 శాతం మంది ఉద్యోగులు తాము ఆఫీసు నుంచి దూరంగా పనిచేసే అవకాశం కల్పిస్తే, జీతం కోత విధించిన పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

news18-telugu
Updated: May 25, 2020, 8:55 PM IST
Work From Home కోసం 377 శాతం పెరిగిన డిమాండ్...ఆఫీసుకు నో...ఇంట్లోనే ఎస్..
ప(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వర్క్ ఫ్రం హోం ప్రస్తుతం ప్రపంచంలోని టెక్ కంపెనీలు జపిస్తున్న మంత్రం. ఇప్పటికే కరోనా దెబ్బతో ఎంప్లాయిస్ అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలపై ఆసక్తికరమైన అధ్యయనం ఒకటి వెలువరించింద. అందులో ఫిబ్రవరి నుండి మే వరకు దేశంలో 'రిమోట్ వర్క్' (ఆఫ్-సైట్ ఆఫీస్ వర్క్) ఉద్యోగాల శోధన 377% పెరిగిందని ఒక నివేదిక తెలిపింది. ఉద్యోగార్ధులు ఇప్పుడు రిమోట్‌గా పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని, అంటే కార్యాలయానికి దూరంగా ఉన్నారని నివేదిక పేర్కొంది. 'రిమోట్' అంటే ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల గురించి సెర్చ్ చేయడం పెరిగిందని జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి నుండి మే 2020 వరకు రిమోట్ పనుల కోసం అన్వేషించే వారి సంఖ్య 377 శాతం పెరిగింది. అదేవిధంగా, ఇంటి నుండి పని కోసం ఉద్యోగాల అన్వేషణలో 168 శాతం పెరుగుదల ఉంది.

మునుపటి అధ్యయనాలు కూడా 83 శాతం మంది ఉద్యోగార్ధులు రిమోట్ వర్క్ పాలసీ గురించి వెతికారు. అంతే కాదు, 53 శాతం మంది ఉద్యోగులు తాము ఆఫీసు నుంచి దూరంగా పనిచేసే అవకాశం కల్పిస్తే, జీతం కోత విధించిన పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Published by: Krishna Adithya
First published: May 25, 2020, 8:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading