హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC NDA Exam: ఎన్​డీఏ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించాల్సిందే.. కేంద్రానికి సుప్రీంకోర్డు ఆదేశం

UPSC NDA Exam: ఎన్​డీఏ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించాల్సిందే.. కేంద్రానికి సుప్రీంకోర్డు ఆదేశం

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

త్రివిధ దళాల్లో ఆఫీసర్ (Officer)​ స్థాయి పోస్టుల భర్తీకి నిర్వహించే ఎన్​డీఏ (NDA) పరీక్షలో ఇంతకాలం పురుష అభ్యర్థులనే అర్హులుగా పేర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 14న జరగనున్న ఎన్‌డీఏ పరీక్ష(Exam) కు మహిళా అభ్యర్థులను అనుమతించాల్సిందేనని సుప్రీం కేంద్రానికి స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...

త్రివిధ దళాల్లో ఆఫీసర్​ స్థాయి పోస్టుల భర్తీకి నిర్వహించే ఎన్​డీఏ (NDA) పరీక్షలో ఇంతకాలం పురుష అభ్యర్థులనే అర్హులుగా పేర్కొంటూ వస్తున్నారు. అయితే అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా రాణిస్తున్న మహిళలకు త్రివిధ దళాల్లో అవకాశం కల్పించకపోవడం మహిళా వివక్షకు గురిచేయడమే అంటూ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది.  ఈ పిటిషన్​పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. త్రివిధ దళాల్లో మహిళలకు సైతం అవకాశం కల్పించాలని తీర్పునిచ్చింది. 2021 ఎన్​డీఏ నోటిఫికేషన్​ (Notification) నుంచే దీన్ని అమలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

ఈ ఏడాది నుంచి దీన్ని అమలు చేయడం కష్టమని, వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేస్తామని, అందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఎన్​డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశం, ఆపై వారికి శిక్షణ సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, దీనికి మరింత సమయం కావాలని పిటిషన్​లో పేర్కొంది.

Amazon Jobs: అమెజాన్ లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు..


దీంతోపాటు ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఎత్తు, బరువు తదితర అర్హతా ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. శిక్షణకు కరిక్యులమ్ (Curriculum) రూపొందించేందుకు నిపుణులతో అధ్యయన బృందాన్ని నియమించామని వివరించింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన ఈ పిటిషన్​ను స్వీకరించేందుకు సుప్రీం నిరాకరించింది.

మహిళా అభ్యర్థుల ప్రవేశాన్ని వాయిదా వేయలేమని, వారి శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఒకవేళ, మీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటే, మహిళా అభ్యర్థులు ఒక సంవత్సరం నష్టపోతారని, అదే జరిగితే ఎన్​డీఏలో మహిళల ప్రవేశాలు 2023 వరకు ఆలస్యం అవుతాయని పేర్కొంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయాలని, నవంబర్ 14న జరగనున్న ఎన్‌డీఏ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించాల్సిందేనని సుప్రీం (Supreme) కేంద్రానికి స్పష్టం చేసింది.

దీనికి అవసరమైన మార్పులను పరిశీలించడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు సూచించింది. ఎన్​డీఏలో ఎంపికైన మహిళా అభ్యర్థుల కోసం ఏడాది పాటు ఇచ్చే ఫిట్​నెస్​ ట్రైనింగ్​ (Fitness Training) , వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మహిళలకు ఆశలు కలిగించిన తర్వాత, వారిని ఇప్పుడు నిరాశపరచలేమని పేర్కొంది.

First published:

Tags: Central Government, Defence Ministry, Exams, Supreme Court, UPSC, Women

ఉత్తమ కథలు