ప్రభుత్వ ఉద్యోగం కోసం రెజ్యూమెలో అబద్ధం... ఆమెను జైలుకు పంపిన అధికారులు

నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా... చివరకు అదే జరిగింది. ఆమె రెజ్యూమెలో వెల్లడించిన విద్యార్హతలు, వర్క్ హిస్టరీ అసత్యమని తేలిపోయింది.

news18-telugu
Updated: December 5, 2019, 11:52 AM IST
ప్రభుత్వ ఉద్యోగం కోసం రెజ్యూమెలో అబద్ధం... ఆమెను జైలుకు పంపిన అధికారులు
ప్రభుత్వ ఉద్యోగం కోసం రెజ్యూమెలో అబద్ధం... ఆమెను జైలుకు పంపిన అధికారులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా రెజ్యూమెలో అబద్ధాలు ఉండకూడదని కెరీర్ ఎక్స్‌పర్ట్స్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ ఉద్యోగం కోసం అబద్ధాలతో రెజ్యూమె ప్రిపేర్ చేసి ఇబ్బందుల్లో పడుతుంటారు. ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఏకంగా జైలుపాలైంది. ఆమె పేరు వెరోనికా హిల్దా థెరియాల్ట్. వయస్సు 46 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తన రెజ్యూమెలో అసత్యాలు రాసింది. ఆమె దరఖాస్తు చేసింది చిన్నాచితకా ఉద్యోగానికి కాదు. ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి ఉద్యోగం అది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీమియర్ అండ్ కేబినెట్‌లో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉద్యోగం. వార్షిక జీతం ఎంతో తెలుసా? కోటీ 32 లక్షల రూపాయలు. అంటే నెలకు రూ.11 లక్షల పైనే. ఇంత భారీ జీతం ఉన్న ఉద్యోగాన్ని పొందేందుకు ఈ తప్పు చేసింది వెరోనికా. తన విద్యార్హతలు, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి రెజ్యూమెలో అన్నీ అబద్ధాలు చెప్పింది. ఆ ఉద్యోగాన్ని సంపాదించింది.

కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా... చివరకు అదే జరిగింది. ఆమె రెజ్యూమెలో వెల్లడించిన విద్యార్హతలు, వర్క్ హిస్టరీ అసత్యమని తేలిపోయింది. సౌత్ ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీమియర్ అండ్ కేబినెట్ ఉన్నతాధికారులు ఏకంగా కేసు పెట్టారు. మోసపూరితంగా ఉద్యోగం సంపాదించడం, దాని ద్వారా భారీగా జీతం పొందడం, దాంతో పాటు సున్నితమైన సమాచారాన్ని పొందడం లాంటి తప్పులకు పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి మైఖేల్ బోయ్లాన్ అభిప్రాయపడ్డారు. రెజ్యూమెలో ఉన్న విద్యార్హతలు, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వివరాలను తప్పని తేల్చారు. 2012 నుంచి 2014 మధ్య 2 కంపెనీల్లో పనిచేసినట్టు, 2014 లో అవార్డు పొందినట్టు తప్పుడు వివరాలు వెల్లడించినట్టు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఈ తప్పులు చేసినట్టు తేల్చారు. దీంతో కోర్టు ఆమెకు 25 నెలల జైలు శిక్ష విధించింది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Indian Air Force Jobs: పెళ్లికానివారికి ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో శిక్షణGovt Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ రిలీజ్

Railway Jobs: రైల్వే జాబ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్... ఎందుకో తెలుసా?
First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>