MEDICAL COURSES: నీట్​ స్కోర్​ లేకున్నా ఈ మెడికల్​ కోర్సుల్లో చేరొచ్చు.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

NEET 2021: నీట్​లో క్వాలిఫై కాలేక పోయినా వైద్య విద్యలో చేరాలని అనేక మంది విద్యార్థులు భావిస్తుంటారు. అయితే నీట్ లో క్వాలిఫై కాకపోయినా.. విద్యార్థులు ఈ మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు.

  • Share this:
కెరీర్​లో వృద్ధి, అపార ఉద్యోగ అవకాశాలు, సమాజంలో గౌరవం ఇలా ఎన్నో కారణాల రీత్యా వైద్య వృత్తిలోకి వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అయితే, వైద్య విద్య కోసం ఇంటర్మీడియట్​ నుంచే ప్రణాళిక ప్రకారం చదవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్​ ఎంట్రన్స్​ టెస్ట్ నీట్​లో క్వాలిఫై అయితేనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీటొస్తుంది. ఈ పరీక్షకు ఏటా లక్షలాది మంది పోటీపడుతుంటారు. గతేడాది 13,66,945 మంది నీట్​ పరీక్షకు హాజరవ్వగా.. 7,71,500 మంది క్వాలిఫై అయ్యారు. అంటే, పరీక్ష రాసిన వారిలో 56 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్​లో క్వాలిఫై కాకపోయినా వైద్య విద్యనభ్యసించాలనే కోరిక కొందరిలో బలంగా ఉంటుంది. అటువంటి వారు ప్రత్యామ్నాయ మెడికల్​ కోర్సుల వైపు చూడవచ్చు. ఆ కోర్సుల గురించి తెలుసుకుందాం.
IIT Kanpur: కెరీర్‌లో దూసుకెళ్లాలా? అయితే ఈ కోర్సులు మీకోసమే

నీట్​ స్కోర్​ లేకుండా చేయగలిగే కోర్సులు..
బీఎస్సీ నర్సింగ్ (నర్సింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్)

మెడికల్ సైన్స్ రంగంలో రాణించాలనుకునే వారికి బీఎస్సీ ఇన్ నర్సింగ్ చక్కటి కోర్సు. నీట్​ స్కోర్​ లేకుండానే ఈ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో సీటు సంపాదించవచ్చు. దేశంలో నర్సింగ్​ విద్యకు ప్రాధాన్యత పెరుగుతుంది. అపారమైన అవకాశాల దృష్ట్యా ఈ కోర్సులో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి స్టాఫ్ నర్స్, రిజిస్టర్డ్ నర్సు (ఆర్‌ఎన్), నర్స్ ఎడ్యుకేటర్, మెడికల్ కోడర్ మొదలైన ఉద్యోగాలు లభిస్తాయి.

బీఫార్మసీ (బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ)
బీఫార్మసీ నాలుగేళ్ల బ్యాచిలర్​ డిగ్రీ కోర్సు. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు ఫార్మసీ బేసిక్స్ బోధిస్తారు. ఫార్మసిస్ట్‌లు లేదా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కావాలనుకునే వారు 12 వ తరగతి తర్వాత బీఫార్మసీని ఎంచుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కెమికల్ టెక్నీషియన్, డ్రగ్ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

బిపిటి (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బిపిటి) అనేది 4.5 సంవత్సరాల అండర్​గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. కోర్సులో భాగంగా ఆరు నెలల పాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ చేయాలి. దీంతో ప్రాక్టికల్ నాలెడ్జ్​ పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హెల్త్ & ఫిట్‌నెస్ క్లినిక్​, ఫిజియోథెరపిస్ట్ మొదలైన ఉద్యోగాలు లభిస్తాయి.

ఇతరులు కోర్సులు
పై కోర్సులతో పాటు కొన్ని ఇతర మెడికల్​​ సంబంధిత కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్​ వెటర్నరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బిఎ) ఇన్​ ఫిజియాలజీ ఆనర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్​ బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్​ బయోమెడికల్ ఇంజనీరింగ్‌ వంటి ప్రత్యామ్నాయ కోర్సులను కూడా పరిశీలించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: