Home /News /jobs /

WITH FREE COACHING FOR NEET UNDERPRIVILEGED STUDENTS LEARN TO DREAM UMG GH

NEET Coaching: నీట్ ఎగ్జామ్‌కు ఫ్రీ కోచింగ్.. పేద విద్యార్థుల కలలను సాకారం చేస్తున్న సంస్థ.. ఎక్కడ ఉందంటే..?

పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్

పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్షగా నీట్ నిర్వహిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో కోచింగ్ సంస్థలు నీట్‌కు రూ.లక్షల్లో ఫీజును వసూలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది పేద విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారి కోసం మహార?

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్షగా నీట్ నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పోటీ కూడా తీవ్రంగా ఉండడంతో కోచింగ్ సంస్థలు నీట్‌కు రూ.లక్షల్లో ఫీజును వసూలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది పేద విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారి కోసం మహారాష్ట్రలో ఉచిత నీట్ కోచింగ్ సెంటర్ ఒకటి పుట్టుకొచ్చింది. మహారాష్ట్రలోని కొంత మంది వైద్యులు, వైద్య విద్యార్థులు కలిసి 2015లో లిఫ్ట్ ఫర్ అప్‌లిఫ్ట్‌మెంట్ (LFU)పేరుతో కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. ఏటా 100 మందికిపైగా పేద విద్యార్థులు నీట్ క్లియర్ చేయడంలో ఎల్‌ఎఫ్‌యూ కీలక పాత్ర పోషిస్తుంది.

ఎల్‌ఎఫ్‌యూ కోచింగ్ సెంటర్ ఏర్పాటులో కీలక వ్యక్తి డాక్టర్ అతుల్ ధాకనే. ఆయన మాట్లాడుతూ.. ‘నేను 2015లో పూణేలోని బీజే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు, ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ స్కీమ్‌లో భాగంగా కోచింగ్ క్లాస్‌లో జువాలజీ చెప్పేవాడిని. మరోపక్క ఫీజుల భారం అధికంగా ఉండడంతో పేదరికం నేపథ్యం ఉన్న గ్రామీణ, గిరిజన, కరువు పీడిత ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు కోచింగ్‌ను పొందలేకపోతున్నారని గ్రహించాను. దీంతో 15 మంది వైద్య విద్యార్థులతో మాట్లాడాను. అందరం కలిసి ఎల్‌ఎఫ్‌యూ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాం.’ అని తెలిపారు.

ఇదీ చదవండి: ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. లైంగిక సంపర్కం ద్వారా కూడా మంకీ పాక్స్ .. WHO సంచలన విషయాలు..!


‘మొదట్లో కేవలం వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న గ్రామీణ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలనుకున్నాం. ఇందుకు పూణేలోని ఓ మున్సిపల్ స్కూల్ లో ఓ చిన్న గదిని తీసుకున్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సీఈటీ (CET) పరీక్షలో మా కోచింగ్ సెంటర్ నుంచి 36 మంది ఉత్తీర్ణత సాధించారు.’ అని ఆయన పేర్కొన్నారు. నీట్-2017లో లిఫ్ట్ ఫర్ అప్‌లిఫ్ట్‌మెంట్‌లో శిక్షణ పొందిన 11 మంది పేద విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారని ధాకనే చెప్పారు.

‘పూణే, ముంబై వంటి నగరాల్లో టాప్ నీట్ కోచింగ్ సెంటర్లు రూ. 3 లక్షల వరకు ఫీజును వసూలు చేస్తున్నాయి. ఎల్‌ఎఫ్‌యూ(LFU) మాత్రం ఉచితంగా కోచింగ్‌ను అందిస్తుంది. ఏటా 60 మంది విద్యార్థులు LFU కోచింగ్ కోసం నమోదు చేసుకుంటారు. 2022 జులైలో జరిగిన నీట్‌లో 48 మంది ఎల్‌ఎఫ్‌యూ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తరువాత LFU కోచింగ్ సెంటర్‌ను ముంబైకి 600 కి.మీల దూరంలో ఉన్న తూర్పు మహారాష్ట్రలోని గిరిజన మెల్‌ఘాట్ ప్రాంతానికి విస్తరించాం. అక్కడ మరొక కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. దానికి స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా ప్రారంభించిన గొప్ప గిరిజన తిరుగుబాటు ఉద్యమం పేరు `ఉల్గులన్’ (గొప్ప గందరగోళం) అని పేరు పెట్టాం.’ అని ధాకనే చెప్పుకొచ్చారు.



అయితే 2019 -నీట్‌లో మాల్‌ఘాట్ బ్యాచ్ విద్యార్థులు అశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయారు. దీంతో తరువాత ఏడాది విద్యార్థులను పూణేకు తరలించారు. దీంతో 16 మంది విద్యార్థులు నీట్ అర్హత సాధించారు. వారిలో ఎనిమిది మంది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇక 2020- నీట్‌కు 46 LFU విద్యార్థులు హాజరుకాగా, 26 మంది అర్హత సాధించారు. ఆ తరువాత కోచింగ్ సెంటర్‌ను మరాఠ్వాడాలోని ఉస్మానాబాద్‌కు విస్తరించారు.

‘2016 నుంచి 250 మంది విద్యార్థులకు కోచింగ్ అందించాం. వారిలో 130 మంది వైద్యులు కాబోతున్నారు. వారిలో 70 మంది ఎంబీబీఎస్ కోర్సులో చేరగా, మిగిలిన వారు బీఎఎంఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సులను అభ్యస్తున్నారు.’ అని ధాకనే ఎల్‌ఎఫ్ యూ విజయగాథను వివరించారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Free coaching, JOBS, NEET

తదుపరి వార్తలు