హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Wipro Recruitment 2021: విప్రోలో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

Wipro Recruitment 2021: విప్రోలో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Jobs in Wipro | ఇంజ‌నీరింగ్ చేసిన‌ విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology) దిగ్గజ కంపెనీల్లో ఒక్క‌టైన‌ విప్రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంజనీర్ ట్రైనీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చింది. ఈ పోస్టుల‌కు అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటి సర్వీస్ ప్రొవైడర్ విప్రో (Wipro) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లను గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ట్రైనీలుగా (జిఇటి) నియమించుకోవడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ (Recruitment Drive)ను ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఢిల్లీ నోయిడా క్యాంప‌స్‌లో జ‌రుగుతుంది. అభ్య‌ర్థుల‌ను రెండు మూడు రౌండ్‌ల ద్వారా ఎంపిక చేస్తారు. ప‌రీక్ష‌తో పాటు అభ్య‌ర్థి అన‌లిటికల్‌, టెక్నిక‌ల్ స్కిల్స్‌ (Technical Skills) ను ప‌రిశీలించి తుడి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్య‌ర్థి సిస్ట‌మ్ కాన్షిగ‌రేష‌న్ విభాగంలో ప‌ని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగికి ఐదు రోజులు వ‌ర్కింగ్ డేస్ ఇస్తున్న‌ట్టు సంస్థ తెలిపింది. ఈ ఏడాది విప్రో 16,000 నుంచి 17,000 రిక్రూట్ చేసుకొంటుంద‌ని అని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (chief financial officer) జతిన్ దలాల్ కొద్ది రోజుల క్రితం ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే విప్రో ఫ్రెష‌ర్స్‌కు పెద్ద‌పీట వేస్తోంది.

  అర్హ‌తలు..

  - BCA, B.SC -IT, B.Sc-CS, BE, B-tech మరియు MCA పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

  - ఫ్రెషర్లు, అలాగే 0- 1 సంవత్సరం పని అనుభవం ఉన్నవారికి కూడా అర్హ‌త ఉంది.

   Indian Navy Jobs: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో నేవీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం


  - అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు సర్వీస్ అగ్రిమెంట్‌ (Agreementపై సంతకం చేయాల్సి ఉంటుంది.

  - ఇంట‌ర్వ్యూకి వ‌చ్చే అభ్య‌ర్థి తప్పనిసరిగా టెస్టింగ్ కాన్సెప్ట్‌లు & SDLC గురించి తెలిసి ఉండాలి. స‌మ‌స్య ప‌రిష్కార సామ‌ర్థ్యం (Capacity), మెరుగైన‌ కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills) కలిగి ఉండాలి.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1: అర్హత ఉన్న గ్రాడ్యుయేట్లు వీలైనంత త్వరగా Wipro కెరీర్ యొక్క అధికారిక పోర్టల్ https://careers.wipro.com ని సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  Step 2: అనంత‌రం సంబంధి విభాగంలో ద‌ర‌ఖాస్తుఫాంపై క్లిక్ చేసి పూర్తి వివ‌రాలు అందించాలి.

  Step 3: అనంత‌రం ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న‌ కాంటాక్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ద్వారా సంస్థ‌ను సంప్ర‌దించాలి.

  ఇటీవల, కంపెనీ విప్రో ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 (NTH) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 30,000 మంది ఫ్రెషర్స్‌కి ఆఫర్ లెటర్స్ (Fresher Jobs) ఇవ్వనుంది విప్రో. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. మొత్తం 30,000 ఆఫర్ లెటర్స్ ఇస్తే వీరిలో 22,000 మంది ఫ్రెషర్స్ ఉద్యోగాల్లో చేరతారని విప్రో భావిస్తోంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Engineering, IT jobs, JOBS, Wipro

  ఉత్తమ కథలు