Home /News /jobs /

WIPRO PLANS TO HIRE 30000 FRESHERS IN NEXT FINANCIAL YEAR HERE FULL DETAILS NS

Wipro Fresher Jobs: ఫ్రెషర్లకు విప్రో గుడ్ న్యూస్.. 30 వేల జాబ్స్.. భర్తీ ఎప్పుడో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐటీ ఫ్రెషర్లకు ఐటీ దిగ్గజం విప్రో (WIPRO) శుభవార్త చెప్పింది. రానున్న ఫైనాన్షియల్ ఇయర్ లో 30 వేల మంది ఫ్రెషర్లను (Freshers) నూతనంగా నియమించుకోనున్నట్లు విప్రో వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఐటీ జాబ్ (IT Job) నేటి యువతకు కల. రెండు పదుల వయస్సులో ఐదు అంకెల జీతం అందించే ఈ ఉద్యోగం (Job) కోసం డిగ్రీ పట్టా అందుకోగానే యువత వేట మొదలు పెడుతూ ఉంటారు. మహా నగరాలకు చేరి Resume చేత పట్టుకుని ఉద్యోగం కోసం కుస్తీ పడుతుంటారు. అయితే ఈ కరోనా (Corona) మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఐటీ నియాకాల వేగం తగ్గింది. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఈ పరిణామంతో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఐటీ ఫ్రెషర్లకు ఐటీ దిగ్గజం విప్రో (Wipro) శుభవార్త చెప్పింది. రానున్న ఫైనాన్షియల్ ఇయర్ లో 30 వేల మంది ఫ్రెషర్లను నూతనంగా నియమించుకోనున్నట్లు విప్రో వెల్లడించింది. ఈ మేరకు బుధవారం సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ ఓమిక్రాన్ వేరియెంట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తమ సంస్థ చలా అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు.
    TCS Smart Hiring 2022: డిగ్రీ పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా.. పూర్తి వివరాలివే

    ఈ నేపథ్యంలో రానున్న నాలుగు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కంపెనీ ఉద్యోగుల్లో 90 శాతం మంది ఇప్పటికే మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇది తమకు ఉపశమనం కలిగించే అంశమన్నారు. 65 శాతం మంది తమ ఉద్యోగులు సెకండ్ డోస్ వ్యాక్సిన్ సైతం తీసుకున్నట్లు వివరించారు.
    T Jobs In 2022 Year : 2022లో IT Job మీ లక్ష్యమా.. వీటిని నేర్చుకుంటే మీ కల నెరవేరినట్లే.. ఈ వివరాలను తప్పక తెలుసుకోండి

    అయితే రెండు డోసుల టీకాలు వేసుకున్న ఉద్యోగులను హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా కార్యాలయానికి తిరిగి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కానీ ఈ సమయంలోనే ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి పెరిగిందన్నారు. తమ ఉద్యోగుల భద్రత, క్లయింట్ ప్రియారిటీస్ ను పరిగణలోకి తీసుకుని రానున్న 4 వారాలు కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2,969 కోట్లుగా నమోదైనట్లు ఆయన వివరించారు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Information Technology, Private Jobs, Software developer, Wipro

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు