ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒక్కటైన ఇన్ఫోసిస్. కానీ ఇప్పుడు అది కొత్త రూల్ తీసుకొచ్చింది. తమ సంస్థలో పని చేసి, రాజీనామా చేసిన ఉద్యోగులు.. తర్వాత ఇతర ఐటీ సంస్థల్లో పని చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరో ఐటీ దిగ్గజం విప్రో అందుకు భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నది. 2.43 లక్షల మందికి పైగా సేవలందిస్తున్న విప్రోలో గత ఆర్థిక సంవత్సరం వలసలు (అట్రిక్షన్ – Attrition ) 23.8 శాతం నమోదైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నూతన ప్రమోషన్ వ్యూహాన్ని అమలులోకి తేవాలని విప్రో నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి ఫ్రెషర్స్‌తోపాటు ప్రతి ఉద్యోగి పనితీరుపై సమీక్ష తర్వాత వారి ప్రతిభను బట్టి ప్రమోషన్ కల్పించనున్నది.
TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్.. అర్హతలు.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు
తాజా ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 50 వేలు, హెచ్‌సీఎల్ టెక్ 45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయి. ఇన్ఫోసిస్‌లో గతేడాది చివరి త్రైమాసికం (2021-22)లో అత్యధికంగా 27.7 శాతం అట్రిక్షన్ నమోదైతే.. టీసీఎస్‌లో 17.4 శాతం ఉంది. ఇక విప్రోలో గత 12 నెలల్లో అట్రిక్షన్లు 23.8 శాతం కాగా, గతేడాది డిసెంబర్ నాటికి 22.7 శాతం. ఆదాయం పరంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో ప్రధాన ఐటీ సంస్థలు. ఈ నాలుగు సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 2.20 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
ఇన్పోసిస్ ఈ తాజా రూల్ ఉద్యోగులకు కాస్త ఇబ్బంది కలిగించనుంది ఒకవేళ వారు పని చేసే క్లయింట్లు.. ఇన్ఫోసిస్ క్లయింట్లయితే, ఒక ఆరు నెలల పాటు `నేమ్డ్ కాంపిటీటర్ల`తో మాజీ ఉద్యోగులు పని చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేకించి దేశంలోని టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం, యాక్స్చెంజర్ సంస్థల్లో పని చేయొద్దని తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా విప్రో నిర్ణయం తీసుకోవడం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT jobs, Wipro, Wipro Employees