హోమ్ /వార్తలు /jobs /

Jobs In Wipro: BCA, BSc గ్రాడ్యుయేట్లకు విప్రో గుడ్​న్యూస్​.. నెలకు రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..

Jobs In Wipro: BCA, BSc గ్రాడ్యుయేట్లకు విప్రో గుడ్​న్యూస్​.. నెలకు రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..

భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఫ్రెషర్స్​కు (Freshers) గుడ్​న్యూస్​ చెప్పింది. 'వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2.0' కింద బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc) గ్రాడ్యుయేట్ల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...

  భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఫ్రెషర్స్​కు (Freshers) గుడ్​న్యూస్​ చెప్పింది. 'వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2.0' కింద బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc) గ్రాడ్యుయేట్ల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు www.careers.wipro.com/wilp వెబ్​సైట్​ని సందర్శించి, ‘అప్లై నౌ’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన అన్ని వివరాలను పూరించి అప్లికేషన్​ సబ్​మిట్​ చేయాలి.

  ప్రోగ్రాం విద్యార్హతలు..

  బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (బీసీఏ) లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్- (బీఎస్సీ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ వంటి స్ట్రీమ్​లలో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారే దరఖాస్తుకు అర్హులు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన ఫ్రెష్​ గ్రాడ్యుయేట్లకు మాత్రమే రిక్రూట్​మెంట్​లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

  Working Professional: వర్కింగ్​ ప్రొఫెషనల్స్​కు గుడ్​న్యూస్.. 8 నెలల సమయంలోనే ..

  ఇతర అర్హతలు..

  అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. బిజినెస్ మ్యాథ్స్ & అప్లైడ్ మ్యాథ్స్ కోర్ సబ్జెక్టులను మ్యాథమెటిక్స్‌గా పరిగణలోకి తీసుకోరు. 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య గరిష్ఠంగా 3 సంవత్సరాల ఎడ్యుకేషన్​ గ్యాప్​ ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, గ్రాడ్యుయేషన్‌లో గ్యాప్​ ఉంటే దరఖాస్తుకు అనర్హులు. గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో రెగ్యులర్​ విధానంలో పది, ఇంటర్​, గ్రాడ్యుయేషన్​ను పూర్తి చేసి ఉండాలి. ఇంటర్వ్యూ స్టేజ్​ వరకు గరిష్టంగా 1 బ్యాక్​లాగ్​ను అనుమతిస్తారు. ఉద్యోగంలో చేరేలోపు దాన్ని క్లియర్​ చేసుకోవాల్సి ఉంటుంది.

  NIOT Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో 237 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు

  జీతం ఎంత?

  ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ.23,000 స్టైఫండ్ లభిస్తుంది.

  సెలక్షన్​ ప్రాసెస్​..

  అభ్యర్థులకు ముందుగా ఆన్‌లైన్ అసెస్‌మెంట్ టెస్ట్​ (80 నిమిషాలు) నిర్వహిస్తారు. దీన్ని క్లియర్​ చేసిన వారికి ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. వెర్బల్, ఎనలిటికల్, క్వాంటిటేటివ్​ సెక్షన్లలో ప్రతి సెక్షన్​ నుంచి 20 ప్రశ్నలొస్తాయి. ప్రతి సెక్షన్​కు 20 మార్కులు కేటాయించారు. ఆప్టిట్యూడ్​ టెస్ట్​ను క్లియర్​ చేసిన వారికి రిటన్​ కమ్యూనికేషన్ టెస్ట్ (20 నిమిషాలు) నిర్వహిస్తారు. అయితే, ఆన్​లైన్​ అసెస్​మెంట్​లో ఎంపికైన తర్వాత, అభ్యర్థులు బిజినెస్​ డిస్కషన్​ రౌండ్​లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మూడు రౌండ్​లను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆఫర్​ లెటర్​ అందజేస్తారు.

  First published:

  ఉత్తమ కథలు