Home /News /jobs /

Wipro Recruitment: విప్రో కొత్త రిక్రూట్‌మెంట్.. ఎనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Wipro Recruitment: విప్రో కొత్త రిక్రూట్‌మెంట్.. ఎనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత ఐటీ దిగ్గజం విప్రో కొత్త రిక్రూట్‌మెంట్ ( (Wipro recruitment)) ప్రక్రియను ప్రారంభించింది. నోయిడా క్యాంపస్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం సంస్థ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. అర్హులైన అభ్యర్థుల నుంచి విప్రో దరఖాస్తులను ఆహ్వానించింది

ఇంకా చదవండి ...
భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియ (Recruitment drive)ను ప్రారంభించింది. నోయిడా క్యాంపస్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల (Engineering graduates) కోసం సంస్థ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. అర్హులైన అభ్యర్థుల నుంచి విప్రో దరఖాస్తులను (applications) ఆహ్వానించింది. ఎనలిస్ట్ - కాన్ఫిగరేషన్ పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. రిక్రూట్‌మెంట్‌ (Wipro recruitment)కు ముందు ప్రాజెక్ట్ వర్క్ (project works) కోసం స్పష్టమైన విశ్లేషణ, టెస్ట్ ప్లాన్లు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను ఎవరు అందించగలరో సంస్థ (company) పరీక్షిస్తుంది. ఎంపిక చేసిన అభ్యర్థులు సిస్టమ్ కాన్ఫిగరేషన్ అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని విప్రో తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు వారంలో ఐదు రోజుల పాటు పని ఉంటుంది.

* విప్రో రిక్రూట్‌మెంట్‌కు ఎవరు అర్హులు?

విప్రో తాజా ఉద్యోగాలకు (for jobs) BCA, B.SC -IT, B.Sc-CS, BE, B-tech, MCA పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వరకు పని అనుభవం (One year experience) ఉన్న వారితో పాటు ఫ్రెషర్లు (freshers) కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు సర్వీస్ అగ్రిమెంట్‌ (service agreement)పై సంతకం చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు టెస్టింగ్ కాన్సెప్ట్‌లు, SDLC గురించి బాగా తెలిసి ఉండాలి. దీంతోపాటు అద్భుతమైన ట్రబుల్ షూటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

* ఎలా దరఖాస్తు చేయాలి?

విప్రోలో ఎనలిస్ట్ (Analyst) ఉద్యోగానికి అర్హత ఉన్న గ్రాడ్యుయేట్లు Wipro కెరీర్ అధికారిక పోర్టల్ https://careers.wipro.com ద్వారా అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. సంబంధిత ఖాళీల కోసం అప్లికేషన్ లింక్‌ (application link)పై క్లిక్ చేసి, అవసరమైన అన్ని వివరాలను పూరించాలి. తరువాత అప్లికేషన్‌ను మరోసారి చెక్ చేసుకొని ధ్రువీకరించుకున్న తరువాత సబ్‌మిట్ చేయాలి. అనంతరం అభ్యర్థులను సంప్రదించిన తరువాత నియామక ప్రక్రియ వివరాలను విప్రో పంచుకుంటుంది. ఎంపికైన అభ్యర్థులు విప్రో నొయిడా (Noida) కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

* ముగిసిన ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ రిజిస్ట్రేషన్

ఇటీవల విప్రో కంపెనీ మరో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ( (Wipro recruitment)) చేపట్టింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 (NTH) కోసం ఓపెన్ చేసిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (registration) ప్రక్రియను కంపెనీ తాజాగా మూసివేసింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ కోసం 2021 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ల నుంచి ఉత్తమ అభ్యర్థులను (best candidate) రిక్రూట్ చేయడానికి ఎలైట్ NTH- 2021 డ్రైవ్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్, టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M. Tech డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అర్హులుగా సంస్థ పేర్కొంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Information Technology, JOBS, Latest news, Wipro

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు