WIPRO LAUNCHES BEGIN AGAIN PROGRAM FOR WOMEN IT PROFESSIONALS WHO HAVE TAKEN A CAREER GAP AND INVITING APPLICATIONS PRV GH
Wipro: విప్రో బిగిన్ ఎగైన్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. కెరీర్ గ్యాప్ ఉన్న మహిళలకు చక్కటి అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. కెరీర్ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు తిరిగి తమ కెరీర్‌ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారి కోసం ‘బిగిన్ ఎగైన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) మహిళలకు (women) గుడ్‌న్యూస్ చెప్పింది. కెరీర్ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు (Women IT Experts) తిరిగి తమ కెరీర్‌ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారి కోసం ‘బిగిన్ ఎగైన్’ (begin Again) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విప్రో ఇన్‌క్లూజన్ అండ్ డైవర్సిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ (Wipro Inclusion and Diversity Initiative Program) కింద కెరీర్ గ్యాప్ ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్ విరామం పొందిన మహిళా నిపుణులు (Women Experts) మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు (Apply) చేసుకోవచ్చని తెలిపింది.
విప్రో ‘బిగిన్ ఎగైన్’ (Begin again) ప్రోగ్రామ్‌పై చేసిన ట్వీట్లో పలు విషయాలు పంచుకుంది. “బిగిన్ ఎగైన్ అనేది మహిళల కోసం మొదటిసారిగా ప్రత్యేకంగా మేము ప్రారంభించిన ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ (I&D) ప్రోగ్రామ్. కెరీర్ గ్యాప్ తర్వాత తిరిగి వారి కెరీర్‌ను ప్రారంభించాలని చూస్తున్న మహిళల (women) కోసం దీన్ని ఆవిష్కరించాం. విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఏర్పడిన కెరీర్ గ్యాప్ (career gap)కు పుల్‌స్టాప్ పెట్టడానికి సదావకాశాన్నిస్తోంది. ఈ చొరవ ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్ అవకాశాలు మెరుగుపర్చేందుకు వీలు కల్పిస్తుంది. తిరిగి తమ కెరీర్‌ను ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం (Opportunity) కల్పిస్తుంది" అని పేర్కొంది.
ముందు ప్రోగ్రామ్‌కు అర్హులైన వారు జాబ్ రోల్ (Job role) ఎంచుకోవాలి. విప్రో కెరీర్ పేజీలో ఉద్యోగ వివరణలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, ఖాళీలు, అర్హతను అన్వేషించండి. తద్వారా, మీ స్కిల్‌కు తగ్గట్లు సరైన జాబ్ రోల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫారమ్ నింపండి. విప్రో (Wipro)లో ఖాళీల వివరాలను కనుగొన్న తర్వాత మీ అర్హత, స్కిల్‌కు తగ్గ పొజిషన్‌కు దరఖాస్తు చేసుకోండి. మీ అర్హత, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వివరాలను సంస్థతో పంచుకోవడానికి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
2021 డిసెంబర్ త్రైమాసికంలో 2,969 కోట్ల లాభం..
విప్రో సర్వీసెస్ మేజర్ విప్రో లిమిటెడ్ (Wipro Services Major Wipro Limited) డిసెంబర్ 2021 త్రైమాసికంలో రూ. 2,969 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. గతేడాదితో సమానమైన లాభాలు ఆర్జించింది. ఇక, ఓమిక్రాన్ వేరియంట్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రానున్న నాలుగు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తెలిపారు. ‘‘COVID-19 మహమ్మారి కారణంగా ఐటీ కంపెనీలన్నీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానంలో పనిచేస్తున్నాయి. అయితే, పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నాం.” అని అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.