Home /News /jobs /

Jobs in Wipro: ఏడాదికి రూ.3,50,000 వేతనంతో విప్రోలో 30,000 ఫ్రెషర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Jobs in Wipro: ఏడాదికి రూ.3,50,000 వేతనంతో విప్రోలో 30,000 ఫ్రెషర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Jobs in Wipro: ఏడాదికి రూ.3,50,000 వేతనంతో విప్రోలో 30,000 ఫ్రెషర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Wipro: ఏడాదికి రూ.3,50,000 వేతనంతో విప్రోలో 30,000 ఫ్రెషర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Wipro | బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఫ్రెషర్ ఉద్యోగాల (Fresher Jobs) భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

  బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఫ్రెషర్స్‌ని నియమించేందుకు ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) నిర్వహిస్తోంది. ఫ్రెషర్స్ కోసం విప్రో నిర్వహిస్తున్న హైరింగ్ ప్రోగ్రామ్ ఇది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ (B Tech Jobs) చదువుతున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అంటే 2022 సంవత్సరంలో బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 30,000 మంది ఫ్రెషర్స్‌కి ఆఫర్ లెటర్స్ (Fresher Jobs) ఇవ్వనుంది విప్రో. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. మొత్తం 30,000 ఆఫర్ లెటర్స్ ఇస్తే వీరిలో 22,000 మంది ఫ్రెషర్స్ ఉద్యోగాల్లో చేరతారని విప్రో భావిస్తోంది. అభ్యర్థులు https://careers.wipro.com/elite లింక్‌లో రిజిస్టర్ చేయాలి.

  NIOT Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో 237 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు

  ఇప్పటికే విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగాలు ఇతర కంపెనీల నుంచి ఆఫర్స్ అందుకొని వెళ్తున్నారు. దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఈ సమస్య విప్రో సంస్థకు మాత్రమే కాదు అన్ని కంపెనీలకు ఉందని, ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు విప్రో చర్యలు తీసుకుంటుందని ఇటీవల విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ తీర్రి డెలపోర్టే తెలిపారు. అందులో భాగంగా విప్రో భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకోబోతోంది. ఏకంగా 30,000 ఫ్రెషర్స్‌ని నియమించుకోవాలని సన్నాహాలు చేస్తోంది. అందుకే లేటెస్ట్‌గా విప్రో ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది.

  Oil India Jobs 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 535 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  Wipro Fresher Hiring Programme: విప్రో ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాలివే...


  దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 23

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 15

  ఆన్‌లైన్ అసైన్‌మెంట్- 2021 సెప్టెంబర్ 25, 27

  రిజిస్ట్రేషన్ లింక్- https://careers.wipro.com/elite

  విద్యార్హతలు- కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్) చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు. 2022 లో కోర్సు పాస్ కావాలి. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ తప్ప ఇతర బ్రాంచ్‌లల్లో కోర్సు చేసుకున్నవారు అప్లై చేయాలి. 60 శాతం లేదా 6.0 CGPA లేదా యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం తత్సమాన మార్కులతో పాస్ కావాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ డిస్టెన్స్ లెర్నింగ్, కరస్పాండెన్స్ కోర్స్, పార్ట్ టైమ్ కోర్స్ చదివినవారికి అవకాశం లేదు. ఫుల్ టైమ్ కోర్సులు చదివే వారికే అవకాశం. టెన్త్, ఇంటర్‌లో 60 శాతం పైగా మార్కులు ఉండాలి.

  వయస్సు- 25 ఏళ్ల లోపు

  డెసిగ్నేషన్- ప్రాజెక్ట్ ఇంజనీర్

  వేతనం- ఏడాదికి రూ.3,50,000

  సర్వీస్ అగ్రిమెంట్- 12 నెలలు

  ఇతర ప్రమాణాలు- అసెస్‌మెంట్ దశలో ఒక బ్యాక్‌లాగ్ ఉంటే అనుమతి ఇస్తారు. అన్ని బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేస్తేనే ఆఫర్ లభిస్తుంది. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు, 2022 నాటికి గరిష్టంగా మూడేళ్లు ఎడ్యుకేషన్ గ్యాప్ అనుమతిస్తారు. గత ఆరు నెలల్లో విప్రో నిర్వహించిన ఇతర సెలెక్షన్ ప్రాసెస్‌లో పాల్గొనేవారికి అర్హులు కాదు. భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

  ఎంపిక ప్రక్రియ- ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్‌కు విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల టాలెంట్‌ను పరిశీలించిన తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆఫర్ లెటర్ లభిస్తుంది.

  ఆన్‌లైన్ అసెస్‌మెంట్- ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో మూడు సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 128 నిమిషాలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ (వర్బల్) ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి ఉంటాయి.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Job notification, JOBS, Wipro

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు