హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Companies: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఏం జరిగిందంటే..

IT Companies: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IT Companies ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కువగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చిందంటే.. ఇక ఆ జాబ్ చేతిలో ఉన్నట్లే. అయితే టెక్ కంపెనీలు ఇలా ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా.. ఫ్రెషర్లకు మొండి చేయి చూపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రైవేట్ ఉద్యోగాల్లో(Private Job) ఎక్కువగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చిందంటే.. ఇక ఆ జాబ్(Job) చేతిలో ఉన్నట్లే. అయితే టెక్ కంపెనీలు ఇలా ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా.. ఫ్రెషర్లకు మొండి చేయి చూపిస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలైన విప్రో(Wipro), ఇన్ఫోసిస్(Infosys), టెక్ మహీంద్రాలో(Tech Mahindra) ఇటువంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ టెక్ కంపెనీలు అనుభవం లేని అభ్యర్థులను నియమించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు ఫ్రెషర్లు ముందుగా అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు(Offer Letters) ఇచ్చారు. కానీ తరువాత నియామక ప్రక్రియ రద్దు చేశామని మెయిల్స్ పంపిస్తున్నారు. దీంతో ఆఫర్ లెటర్లు పొందిన ఫ్రెష్ టెక్కీలు ఆయోమయంలో పడ్డారు.

ఇలా ఒక్కరి పరిస్థితి కాదు.. వందలాది మందికి ఇలానే ఐటీ కంపెనీలు లెటర్లు ఇష్యూ అయ్యాయి. ఈ అభ్యర్థులు చేరడానికి మొదట 3-4 నెలల ఆలస్యం జరిగింది. ఈ అభ్యర్థుల చేరికను కంపెనీలు వాయిదా వేసి చివరకు వారి ఆఫర్ లెటర్లు రద్దు చేసినట్లు కంపెనీలు సమాచారం అందిస్తున్నాయి. ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో నెలల ఆలస్యం తర్వాత విప్రో, ఇన్ఫోసిస్ మరియు టెక్ మహీంద్రా అనేక మంది అభ్యర్థుల ఆఫర్ లెటర్‌లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Jobs In District Courts: జిల్లా కోర్టుల్లో 7692 ఉద్యోగాలు .. AP, Telangana అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.. వివరాలిలా..

3-4 నెలల క్రితమే టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ అనంతరం వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చారు. దీని తర్వాత అభ్యర్థులు తమ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ కోసం వేచి చూశారు. కానీ ఈ కంపెనీలు 3-4 నెలల పాటు అభ్యర్థులను ఇలా వెయిటింగ్ చేయించి తరువాత వారి ఆఫర్ లెటర్లను రద్దు చేశాయి. దీంతో అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అనేక రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేసుకుని ఎంపికయ్యామని చివరికి కంపెనీలు ఇలా మోసం చేయటం సరికాదని వాపోతున్నారు. వేచి ఉండమని చెప్పి నెలలు గడిచిన తర్వాత నిరాకరించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Expensive Schools: ఆ పాఠశాలలో వార్షిక ఫీజు రూ. కోటిన్నర.. ఒక్క విద్యార్థికి 4 గురు ఉపాధ్యాయులు.. ఖరీదైన పాఠశాలలు ఇవే..

మీరు మా విద్యార్హత ప్రమాణాలను పూర్తి చేయడం లేదని, అందువల్ల మీ ఆఫర్ లెటర్‌లు రద్దు చేయబడుతున్నాయని పేర్కొంటూ ఈ కంపెనీల నుండి అభ్యర్థులకు మెయిల్స్ వచ్చాయి. ఇంతకు ముందు కూడా ఐటీ సంస్థలు ఉద్యోగుల నియామకంలో జాప్యం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల కారణంగా, చాలా కంపెనీలు నియామకాలను స్తంభింపజేశాయి. గూగుల్ , ఫేస్‌బుక్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా కొత్త నియామకాలను నిలిపివేశాయి.

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఇదే కారణం..

ఐటీ రంగం మందగమనంతో పాటు.. ప్రపంచం, దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచిన విధానంతో స్టార్టప్ కంపెనీలకు నిధుల ప్రవాహం బాగా తగ్గింది. నిధుల కొరత ఐటీ రంగంలో స్టార్టప్‌లపై ఎక్కువ ప్రభావం పడింది. వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఈ రంగంపై ప్రతి కూల ప్రభావం పడింది. అందుకే భారతీయ ఐటీ కంపెనీలు కొత్త రిక్రూట్ మెంట్ లను వాయిదా వేస్తూ వస్తున్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Freshers, It companies, IT Employees, JOBS, Software, Software developer

ఉత్తమ కథలు