Wipro: సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విప్రో సంస్థ.. ఆ మహిళలకు ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం

(ప్రతీకాత్మక చిత్రం)

విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, ఇంకా ఇతర వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకుని మళ్ళీ తమ కెరీర్‌ను ప్రారంభించాలని చూస్తున్న మహిళల కోసం బిగిన్ ఎగైన్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్టు విప్రో తెలిపింది.

  • Share this:
తల్లిదండ్రుల సంరక్షణ, ప్రెగ్నెన్సీ లేదా ప్రయాణాల కారణంగా జాబ్స్ నుంచి విరామం తీసుకున్న మహిళలకు ప్రముఖ ఐటీ సంస్థ విప్రో గుడ్ న్యూస్ చెప్పింది. కెరీర్ నుంచి బ్రేక్ తీసుకున్న మహిళలకు ఉద్యోగాలు అందించేందుకు 'బిగిన్ ఎగైన్ (Begin Again)' అనే ఒక ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు విప్రో ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆరు నెలలు లేదా ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం విరామం తీసుకున్న విమెన్ ప్రొఫెషనల్స్‌కు భారతదేశంలోనే ఉద్యోగాలు కల్పించనుంది విప్రో కంపెనీ. ఇన్‌క్లూజన్ అండ్ డైవర్సిటీ కార్యక్రమంలో భాగంగా బిగిన్ ఎగైన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామని విప్రో వెల్లడించింది.

"ప్రతిభావంతులైన మహిళలు తమ సామర్థ్యాన్ని పరీక్షించే కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి విప్రో కార్యక్రమం వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పరిశ్రమ డిమాండ్‌లతో విరామం తీసుకున్న వారిని మళ్లీ తిరిగి ట్రాక్‌లోకి రావడానికి వీలు కల్పిస్తుంది." అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5.70 లక్షలు సంపాదించే ఛాన్స్..!

* విప్రో ఉద్యోగాల వివరాలు
ప్రస్తుతం విప్రో అందిస్తున్న ఉద్యోగ వివరణలు, అవసరమైన నైపుణ్యాలు, అర్హతను ఒకసారి చెక్ చేయడం ద్వారా మీకు తగిన జాబ్ రోల్ ను ఎంచుకోవచ్చు. మహిళా ఉద్యోగార్థులు తమకిష్టమైన జాబ్ రోల్ మొదటగా ఎంచుకుని ఆ తర్వాత ఫారమ్ నింపి దరఖాస్తు సబ్మిట్ చేయొచ్చు.

* ప్రోగ్రామ్‌లో ఏయే అంశాలు ఉంటాయి?
ఈ ప్రోగ్రాంలో పాల్గొనేవారికి స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అండ్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్‌లు, స్మూత్ ట్రాన్సిషన్ కొరకు ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్‌వర్క్, సందేహాలను తీర్చడానికి ఉపయోగపడే బడ్డీ ప్రోగ్రామ్ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఆసక్తిగల మహిళలు https://careers.wipro.com/begin-again లింక్ విజిట్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Deloitte: ఫ్రెషర్స్​కు డెలాయిట్ గుడ్​న్యూస్​... హైదరాబాద్​లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

"విప్రో జెండర్ న్యూట్రల్ పాలసీలు, అభ్యాసాలు, ప్రక్రియలకు భరోసా ఇవ్వడమే కాకుండా అన్ని రంగాల వారికి రెస్ట్ రూములు, లింగ పునర్వ్యవస్థీకరణ శస్త్రచికిత్స కోసం బీమా కవరేజీని పరిచయం చేసింది. తద్వారా జెండర్ ఈక్వాలిటీ పై అవగాహన కల్పించడానికి, పక్షపాతాలను నిర్మూలించడానికి LGBTQ+ సెన్సిటైజేషన్ సెషన్‌లపై వెంటనే దృష్టి పెట్టడానికి విప్రో నాకు సహాయపడింది" అని విప్రో లిమిటెడ్ & LGBTQ+ గ్లోబల్ లీడ్, హెచ్ఆర్ హెడ్ మెల్లిసా ఫెర్రియర్ అన్నారు.

విప్రో సెప్టెంబర్ 30, 2021 తో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ క్యాంపస్‌ల ద్వారా 8,100 మంది ఫ్రెషర్‌లను నియమించుకుంది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకుంటామని విప్రో సీఈఓ పేర్కొన్నారు.
Published by:Sambasiva Reddy
First published: