దేశీయ టెక్ కంపెనీ విప్రో(Wipro) తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్(Good News) చెప్పింది. త్వరలోనే జీతాలు(Salaries) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు పంపిన ఈమెయిల్స్‌లో(Emails) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈనెల నుంచే ఉద్యోగుల జీతాల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు మెయిల్స్ అందాయి. రాబోయే కొన్ని రోజుల్లో మిగతా వారికి కూడా సమాచారం అందనుంది. మనీకంట్రోల్ రిపోర్ట్ ప్రకారం.. ఆగస్టులో విప్రో తన ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని తగ్గించింది. సీనియర్ లెవల్ ఉద్యోగులు ఈ త్రైమాసికంలో వారి వేరియబుల్ వేతనాన్ని పొందలేదు. అయితే జూనియర్ లెవల్ ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో(Variable Pay) 70 శాతం పొందడం గమనార్హం. ఆ సమయంలో విప్రో మార్జిన్‌లపై హిట్ కారణంగా వేరియబుల్ పేని చెల్లించడం లేదని, పనితీరు మెరుగుపడినప్పుడు, లాభాలు అందజేస్తామని ఉద్యోగులకు కంపెనీ చెప్పుకొచ్చింది. కాగా, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో విప్రో అపరేటింగ్ మార్జిన్ 15 శాతానికి తగ్గింది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.
విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గోవిల్ నుంచి ఉద్యోగులకు మెయిల్స్ అందాయి. ‘గత త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మనం విస్తృత కవరేజీని అందుకున్నాం. దీంతో జీతాలు పెంచాలని నిర్ణయించాం. ఇది మీ నిరంతర కృషికి ప్రతిబింబం. మా ప్రయత్నాలు ఫలిస్తున్నాయనడానికి మంచి సూచన.’ అని మెయిల్స్‌లో గోవిల్ పేర్కొన్నారు.
ఈసారి మూడు నెలల ఆలస్యంగా..
కాగా, మిడ్-మేనేజ్‌మెంట్ లెవల్ వరకు టాప్ పర్ఫార్మర్‌లకు త్రైమాసిక ప్రమోషన్‌లను రోల్ చేస్తున్నట్లు కంపెనీ ఇంతకు ముందే ప్రకటించింది. సెప్టెంబర్‌లో జీతాల పెంపు అనేది గత ప్రకటనలకు అనుగుణంగా ఉంది. గత జీతాల పెంపు 2021 జూన్ నుంచి అమల్లోకి రాగా, ఈసారి మాత్రం మూడు నెలలు ఆలస్యమైంది.
ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్...
సంస్థ ప్రాసెస్‌లను వేగవంతం చేయడానికి, సరళీకృతం చేయడానికి ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు చేపడుతున్నామని గోవిల్ తెలిపారు. ఇది తమ కార్యాచరణ సామర్థ్యాన్ని, చురుకుదనాన్ని పెంచడంతో పాటు మార్జిన్‌లను మెరుగుపరచడంలో సహాయపడనుందని పేర్కొన్నారు.
పనితీరు ఆధారంగా..
జీతాల పెంపు సైకిల్‌లో భాగంగా.. 96 శాతం మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు పెరగనున్నాయని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్స్‌లో విప్రో.. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. అయితే ఈ పెంపు ఎంతమేరకు ఉంటుందో విప్రో ప్రకటించలేదు.
300 మంది ఉద్యోగుల తొలగింపు..
తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 300 మందిని తొలగించినట్లు ఇటీవల విప్రో ప్రకటించింది. వారు మూన్ లైటింగ్‌కు పాల్పపడ్డారని అందుకే ఉద్యోగంలో నుంచి తీసేశామని పేర్కొంది. ఒకే సమయంలో ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఎవరైనా ఈ చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఉద్యోగులకు విప్రో హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Slaries, Software, Software developer, Wipro, Wipro Employees