హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

WIPRO Recruitment: ఫ్రెషర్స్‌కు విప్రో గుడ్ న్యూస్.. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలిలా..

WIPRO Recruitment: ఫ్రెషర్స్‌కు విప్రో గుడ్ న్యూస్.. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో. వివిధ పోస్టుల కోసం గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ wipro.com ద్వారా అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ఫ్రెషర్స్‌కు(Freshers) గుడ్ న్యూస్ చెప్పింది సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో(Wipro). వివిధ పోస్టుల కోసం గ్రాడ్యుయేట్ల(Graduates) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ wipro.com ద్వారా అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, సర్వీస్ డెస్క్(Service Desk) అనలిస్ట్ అండ్ డెవలపర్(Developer) పోస్టులను విప్రో భర్తీ చేయనుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని విప్రో ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.

అర్హత ప్రమాణాలు

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుకు సంబంధిత గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసిన ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసిన వారు సర్వీస్ డెస్క్ అనలిస్ట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. డెవలపర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ పోస్ట్‌కు ఫ్రెషర్స్, అనుభవజ్ఞులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని విప్రో తెలిపింది.

Multibagger Stock: ఏడాదిలో 150 శాతం పెరిగిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం..!

దరఖాస్తు చేసుకొనే విధానం

స్టెప్ 1: విప్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అందులో కెరీర్ పేజీని ఓపెన్ చేయండి

స్టెప్ 2: సెర్చ్ బార్‌ను ఉపయోగిస్తూ జాబ్ పేరును టైప్ చేసి దాన్ని గుర్తించండి

స్టెప్ 3: మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్న జాబ్ టైటిల్‌పై క్లిక్ చేయండి. ఆపై అప్లై ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్ 4: మీ వివరాలను నమోదు చేస్తూ అప్లికేషన్‌ను పూరించండి.

స్టెప్ 5: భ్యవిషత్తు అవసరాల కోసం మీ అప్లికేషన్ ఫారంను సేవ్ చేయండి.

వివిధ పోస్టులను బట్టి జాబ్ లొకేషన్ మారుతూ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్ లొకేషన్ నోయిడా, సర్వీస్ డెస్క్ అనలిస్ట్ జాబ్ లొకేషన్ పూణే కాగా, చివరిది డెవలపర్ పోస్ట్ కోసం గురుగ్రామ్‌లో జాబ్ చేయాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థుల విధులు

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ ప్రధాన విధి.. కోడింగ్, ఆప్టిమల్ సాఫ్ట్‌వేర్ లేదా మాడ్యూల్ డెవలప్‌మెంట్‌ను నిర్దారించడం. ఇందు కోసం ఎంపికైన అభ్యర్థులు సాఫ్ట్‌వేర్ అవసరాలు, రూపకల్పనను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

Electric Vehicles: రెండేళ్లు ఆగండి.. ఎలక్ట్రిక్ వాహనాలపై మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

సర్వీస్ డెస్క్ అనలిస్ట్ పోస్ట్ కోసం ఎంపికైన అభ్యర్థులు.. ప్రైమరీ యూజర్లకు మద్దతుగా కస్టమర్ సేవలకు బాధ్యత వహిస్తారు. కాల్స్, పోర్టల్, ఇమెయిల్‌, చాట్‌ల రూపంలో క్లయింట్ల నుంచి వచ్చే అన్ని రకాల ప్రశ్నలకు వారు స్పందించాల్సి ఉంటుంది. అలాగే ఈవెంట్‌లు, సమస్యలు- వాటి పరిష్కారాలను కూడా లాగ్‌లలో రికార్డ్ చేయాలి. ఇక, డెవలపర్ పోస్ట్ కోసం, క్లయింట్ చివరలో అమలు చేయాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్‌లు లేదా అప్లికేషన్‌ల కోసం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను డిజైన్ చేయడం, పరీక్షించడం, నిర్వహించడం వంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.

First published:

Tags: Career and Courses, JOBS, Wipro, Wipro Employees

ఉత్తమ కథలు