హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Wipro: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న ‘విప్రో’..

Jobs In Wipro: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న ‘విప్రో’..

Jobs In Wipro: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న ‘విప్రో’..

Jobs In Wipro: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐటీ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న ‘విప్రో’..

ఇటీవల కాలంలో ఐటీ కొలువులు భారీగా పెరుగుతున్నాయి. ఫ్రెషర్స్ వైపు ఈ కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇలా ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగాలను స్పష్టిస్తుండగా.. మరో వైపు రాజీనాలమాల పర్వం కూడా అలానే కొనసాగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల కాలంలో ఐటీ కొలువులు(IT Jobs) భారీగా పెరుగుతున్నాయి. ఫ్రెషర్స్(Freshers) వైపు ఈ కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇలా ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగాలను స్పష్టిస్తుండగా.. మరో వైపు రాజీనాలమాల పర్వం కూడా అలానే కొనసాగుతోంది. దేశంలో అతి పెద్ద టక్ దిగ్గజం అయిన విప్రో(Wipro) డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు సదవకాశాన్ని తీసుకొచ్చింది. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) ప్రోగ్రామ్ 2022 కింద.. ఉద్యోగులను నియమించుకోనుంది. అయితే 2021, 2022లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులుగా చెబుతున్నాయి.

BCA, BSc వంటి గ్రూపుల్లో డిగ్రీ పూర్తిచేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటున్నాయి. 10వ తరగతి పూర్తైన తర్వాత గ్రాడ్యుయేషన్ మధ్యలో గరిష్థంగా 3 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ అనుమతించబడుతుంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు గ్యాప్ వస్తే దానిని కంపెనీ పరిగణలోకి తీసుకోమని స్పష్టంగా తెలిపింది.

BEL Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీఈఎల్(BEL) మచిలీపట్నం యూనిట్ లో ఉద్యోగాలు ..


అసలు ఏంటి ఈ ప్రోగ్రాం..

డిగ్రీ పూర్తి చేయగానే చాలామందికి ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉంటుంది. ఇలా విదేశాకు వెళ్లాలనకునే వారికి ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన సంపాదనతో పాటు మరోపక్క చదువును కూడా కొనసాగించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. వీరు విప్రోలో ఉద్యోగం చేసుకుంటూనే దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ నుంచి M.Techలో ఉన్నత విద్యను పూర్తి చేసే అవకాశాన్ని విప్రో అందిస్తోంది.

అర్హత..

60 శాతం మార్కులతో BCA , B.Sc డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది.

జీతం విషయానికి వస్తే.. నెలకు రూ.15,488 చెల్లిస్తారు.

మొదటి సంవత్సరం స్టైఫండ్ కింద 15,000 + 488(ESI) + జాయినింగ్ బోనస్ రూ.75 వేలు ఇస్తారు.

రెండో సంవత్సరం స్టైఫండ్‌ - 17,000 + 553(ESI).

మూడో సంవత్సరం స్టిపెండ్ - 19,000 + 618(ESI) •

నాల్గవ సంవత్సరం నెలకు రూ. 23,000 చెల్లిస్తారు.

ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదా నియమించబడతారు. సదరు ఉద్యోగి పనితీరును బట్టి జీతం ఏడాదికి రూ.6,00,000 నుంచి ఉంటుంది.

FBO-FRO-FSO Posts: అటవీ శాఖలో ఉద్యోగాలు .. 1665 ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీపై కీలక అప్‌డేట్‌..


గడచిన మూడు నెలల కాలంలో విప్రో నిర్వహించిన ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్న వారు ఈ ప్రోగ్రామ్ కు అనర్హులని కంపెనీ తెలిపింది. మూడు నెలల గడిచిన వారు ఈ ప్రోగ్రామ్ కు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తు.. అర్హత ప్రమాణాలు.. పైన తెలిపిన విద్యార్హతలు కలిగిన వ్యక్తి ఎవరైన ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు 10 సెప్టెంబర్ 2022 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2 : కిందకు స్క్రోల్ చేస్తే.. అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఎంచుకోవాలి. అంత కంటే ముందు పైన ఇచ్చిన అర్హతలను చుదువుకోండి.

Step 3 : తర్వాత జాబ్ కు సంబంధించి పూర్తి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. వాటిని చదువుకొని అప్లై నౌ అనే ఆప్షన్ ను ఎంచుకుని దరఖాస్తును సమర్పించాలి.

Step 4 : దీనిలో మొదట ఈ మెయిల్ నమోదు చేయమని ఓ పాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిల్ ఇచ్చి తర్వాత బటన్ పై క్లిక్ చేసి.. తదుపరి ప్రాసెస్ ను పూర్తి చేయాలి.

First published:

Tags: Career and Courses, JOBS, Private Jobs, Software jobs, Wipro, Wipro Employees

ఉత్తమ కథలు