హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

PF account: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా? తెలుసుకోండి

PF account: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా? తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగం మారడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం వంటివి చేసినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలన్స్ కి ఏమవుతుంది? దానికి వడ్డీ వస్తూనే ఉంటుందా? ఈ వడ్డీపై ట్యాక్స్ పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.. 

చాలామంది ఉద్యోగాలు మారిన తర్వాత తమ పాత బ్యాలన్స్ ని కొత్త అకౌంట్ తో యాడ్ చేయడం మర్చిపోతారు. ఆ మొత్తానికి ఇంట్రస్ట్ వస్తుందిలే అనుకుంటారు. అందుకే దాన్ని ట్రాన్స్ ఫర్ చేయడం కానీ విత్ డ్రా చేయడం కానీ చేయరు. దాన్ని అలాగే ఈపీఎఫ్ అకౌంట్లోనే ఉంచుతారు. కానీ ఇలా చేయడం సరైన పద్ధతేనా? ఉద్యోగం మారడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం వంటివి చేసినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలన్స్ కి ఏమవుతుంది? దానికి వడ్డీ వస్తూనే ఉంటుందా? ఈ వడ్డీపై ట్యాక్స్ పడుతుందా? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.. మీ అకౌంట్ ఇన్ ఆపరేటివ్ కాకుండా ఉంటే మీ ఈపీఎఫ్ అకౌంట్ లో ఉన్న మొత్తానికి వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఇది మీరు 58 సంవత్సరాల వయసు వరకు జమ అవుతూనే ఉంటుంది. ఇందులో అసలు మొత్తానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ దీనిపై వచ్చిన వడ్డీ మొత్తానికి మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీరు ఆ మొత్తాన్ని ఎప్పుడు విత్ డ్రా చేసుకున్నా వర్తిస్తుంది.


మీరు ఉద్యోగానికి రాజీనామా చేయడం, రిటైర్ కావడం, ఉద్యోగం పూర్తిగా మానేయడం వంటి కారణాలేవైనా మీరు మీ బ్యాలన్స్ ని విత్ డ్రా చేసుకునే వీలుంటుంది. అయితే మీరు రిటైర్ అయిన తర్వాత అంటే 58 సంవత్సరాల తర్వాత 36 నెలల్లోపు విత్ డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ అలా చేసుకోలేకపోతే మీ అకౌంట్ ఇన్ ఆపరేటివ్ గా మారిపోతుంది. దీని తర్వాత మీకు ఎలాంటి వడ్డీ లభించదు. ఏ వ్యక్తి అయినా సరే ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి వారికి అర్హత ఉంటుంది.

మీ పీఎఫ్ అకౌంట్ ఇన్ ఆపరేటివ్ గా మారేందుకు గల కారణాలు

- 55 సంవత్సరాల పైన ఉన్న ఉద్యోగి రిటైర్ అవ్వడం

- ఉద్యోగి వేరే దేశానికి శాశ్వతంగా తరలి వెళ్లిపోవడం

-ఉద్యోగి మరణించడం

-ఉద్యోగి రిటైర్ అయినా 36 నెలల వరకు ఈపీఎఫ్ విత్ డ్రాయల్ కోసం అప్లై చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల మీ అకౌంట్ ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది.దీని తర్వాత మీ అకౌంట్ లో వడ్డీ మొత్తం జమ అవ్వదు. ఇలాంటి సందర్భాల్లో దాన్ని వెంటనే తీసుకోవడం మంచిది. వెంటనే తీసుకునేటప్పుడు వడ్డీ మొత్తానికి మాత్రం మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసలు మొత్తానికి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీరు పని చేసిన గడువు ఐదు సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే అసలు మొత్తానికి కూడా పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఒక వేళ ఒక వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పని చేసి ఉంటే ఒకవేళ వారు బ్యాలన్స్ ట్రాన్స్ ఫర్ చేసుకుంటేనే వారి సర్వీస్ ని కంటిన్యూయస్ గా పరిగణిస్తారు. ఒకవేళ ట్రాన్స్ ఫర్ చేసుకోలేకపోతే ఆ సమయాన్ని లెక్కించరు. అందుకే మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వెంటనే మీ ఈపీఎఫ్ బ్యాలన్స్ ని ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగం పూర్తిగా మానేయడం లేదా రిటైర్ అవ్వడం వంటి సందర్భాల్లో వీలైనంత తొందరగా ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడం కూడా మంచిది.

First published:

Tags: Employees Provident Fund Organisation, EPFO

ఉత్తమ కథలు