తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన... రెండు ఒకేసారి..

మే 12 నుంచి 30 వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్న ఆయన..ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. ప్

news18-telugu
Updated: June 12, 2020, 7:37 PM IST
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన... రెండు ఒకేసారి..
తెలంగాణ ఇంటర్ బోర్డు లోగో
  • Share this:
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెలలోనే ఇంటర్ పరీక్షా ఫలితాలను ప్రకటించే అవకాశముందని వెల్లడించింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. మే 12 నుంచి 30 వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్న ఆయన..ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. ప్రస్తుతం జవాబు పత్రాల స్కానింగ్, మార్కులు అప్‌లోడింగ్, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఉమర్ జలీల్ పేర్కొన్నారు.


ఈ మొత్తం ప్రక్రియ జూన్15 నాటికి పూర్తవుతుందని.. ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కాగా, శుక్రవారం సాయంత్రం ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. సాయంత్రం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 12, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading