హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Board Exams: వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీబీఎస్‌ఈ రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లు నిర్వహిస్తుందా..?పూర్తి వివరాలిలా..

CBSE Board Exams: వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీబీఎస్‌ఈ రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లు నిర్వహిస్తుందా..?పూర్తి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం రెండు బోర్డ్ ఎగ్జామ్‌లను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెండు బోర్డు పరీక్షలను నిర్వహించడం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని, రానున్న సంవత్సరానికి CBSE వార్షిక పరీక్షా విధానానికి తిరిగి వెళ్ళవచ్చని సమాచారం.

ఇంకా చదవండి ...

కరోనా(Corona) కాలంలో ఆయా బోర్డుల పరీక్ష విధానంలో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. దాదాపు రెండేళ్లు చాలా బోర్డులు(Boards) పరీక్షలు(Exams) నిర్వహించకుండానే.. అంతర్గత మూల్యాంకనాల ఆధారంగా ఫలితాలను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లోనే ఈ ఏడాది సీబీఎస్‌ఈ(CBSE) రెండు బోర్డ్‌ పరీక్షలను నిర్వహించింది. దీనిపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే జాతీయ విద్యావిధానం(Education Policy) మేరకు రెండు బోర్డు పరీక్షలను నిర్వహిస్తోందా? రానున్న ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) ఎలాంటి పరీక్ష విధానాన్ని అనుసరిస్తుందనే దానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE- Central Board Of Secondary Education) ఈ సంవత్సరం రెండు బోర్డ్ ఎగ్జామ్‌లను నిర్వహిస్తోంది. సీబీఎస్‌ఈ ఈ ఏడాది నిర్వహిస్తున్న రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లను రద్దు చేయాలని విద్యార్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు బోర్డు పరీక్షలను నిర్వహించడం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని, రానున్న సంవత్సరానికి CBSE వార్షిక పరీక్షా విధానానికి తిరిగి వెళ్ళవచ్చని సమాచారం.

Smartphones Under 10K: రూ.10వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..


2022-23 బ్యాచ్‌కి సంబంధించి CBSE 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు సాధారణ అభ్యాసం ప్రకారం కేవలం ఒక పరీక్ష మాత్రమే ఉండవచ్చు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా టర్మ్ 1, టర్మ్ 2 అనే రెండు బోర్డు పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. గత సంవత్సరం CBSE కరోనా మూడో వేవ్‌ ప్రభావంతో బోర్డ్‌ పరీక్షలను నిర్వహించలేకపోయింది. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి ఏర్పడినట్లయితే విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని భావించి.. ఫలితాలను ప్రకటించడానికి వీలుగా బోర్డు టర్మ్ 1 స్కోర్, అంతర్గత మూల్యాంకనాన్ని ఉపయోగించింది. అయితే కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షలు, అలాగే ఇంటర్నల్‌లు కలిపి తుది ఫలితాలను ప్రకటించనుంది.

జాతీయ విద్యా విధానం (NEP- National Educational Policy) 2022 రెండు బోర్డు పరీక్షలను నిర్వహించాలని సూచించింది. విద్యార్థులు తమ స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి రెండోది నిర్వహించవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) రెండు బోర్డ్‌ పరీక్షలను నిర్వహించడంతో తొలుత జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు భావించారు.

TS TET 2022: టెట్ కు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్.. ఈ వివరాలను తప్పక తెలుసుకోండి

మీడియా నివేదికలను పరిశీలిస్తే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రెండు విడతలుగా నిర్వహించిన పరీక్షలను కేవలం "వన్-టైమ్ ఫార్ములా"గా స్వీకరించింది. అంతేకాకుండా ఇప్పుడు వార్షిక పరీక్షా విధానాన్ని తిరిగి అమలు చేయనుంది. కానీ వచ్చే ఏడాది సిలబస్ కట్-ఆఫ్ కొనసాగుతుంది. అంటే బోర్డు తగ్గించిన సిలబస్ ఆధారంగా పరీక్షలను నిర్వహించడం కొనసాగిస్తుంది. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల సిలబస్ 2020లో 30 శాతం తగ్గించారు.


బోర్డు పరీక్ష ఓ సారి నిర్వహించిన తర్వాత.. విద్యార్థులు మెరుగైన మార్కుల కోసం మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని జాతీయ విద్యా విధానం సూచించినట్లయితే.. ఫలితాలు విడుదలైన తర్వాత.. సెంట్రల్ బోర్డ్ విద్యార్థులను మరోసారి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించే అవకాశం ఉంది. అయితే ఈ విధానం అమలు చేస్తారా? లేదా? అనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CBSE, Students

ఉత్తమ కథలు