హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Tanishka: మూడు కోచింగ్‌ సెంటర్ల ప్రకటనల్లో టాపర్‌ ఒకే అమ్మాయి.. అలా ఎందుకంటే..?

Tanishka: మూడు కోచింగ్‌ సెంటర్ల ప్రకటనల్లో టాపర్‌ ఒకే అమ్మాయి.. అలా ఎందుకంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tanishka: కోచింగ్‌ సెంటర్లు విద్యార్థులను చేర్చుకోవడానికి, తమ ప్రొడక్టులను సేల్‌ చేయడానికి అనుసరిస్తున్న మార్గాలు అన్నీ ఇన్నీ కావు. మోసగించడం నుంచి, ఆఫర్లను ప్రకటించడం వరకు అన్ని మార్గాలను ప్రయత్నిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కోచింగ్‌ సెంటర్లు (Coaching Centers) విద్యార్థుల (Students)ను చేర్చుకోవడానికి, తమ ప్రొడక్టులను సేల్‌ చేయడానికి అనుసరిస్తున్న మార్గాలు అన్నీ ఇన్నీ కావు. మోసగించడం నుంచి, ఆఫర్లను ప్రకటించడం వరకు అన్ని మార్గాలను ప్రయత్నిస్తున్నాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎనిమిదో తరగతి నుంచే ట్రాక్‌ చేస్తున్నట్లు కొందరు విద్యావేత్తలు తెలిపారు. అలాంటి వారిని తమ కోచించ్‌ సెంటర్లలో చేర్చుకోవడానికి పోటీ పడుతాయని వివరించారు. ఇలాంటి కారణాలతో ఒక విద్యార్థినిని రెండు, మూడు కోచింగ్‌ సెంటర్లు తమ విద్యార్థిగా ప్రకటించుకొనే పరిస్థితి వస్తోందని చెప్పారు.

ఉదాహరణకు.. 10వ తరగతి (10th Class) చదువుతున్న ఆరవ్ సెప్టెంబరు మొదటి వారంలో బుధవారం ఒక జాతీయ వార్తాపత్రిక ప్రధాన పేజీలో కోచింగ్ సెంటర్ యాడ్‌ చూశాడు. ఆ యాడ్‌లో మెడికల్ ప్రవేశ పరీక్షలో భారతదేశంలో మొదటి ర్యాంక్ సాధించిన తనిష్క తమ విద్యార్థినిగా కోచింగ్‌ సెంటర్‌ పేర్కొంది. ఆ యాడ్‌ను చూసిన ఆరవ్‌కు రెండు రోజుల క్రితమే తమ కోచింగ్‌ సెంటర్‌ యాడ్‌లో కూడా అదే యువతి ఫొటోను చూసినట్లు గుర్తు వచ్చింది.

మూడు కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థిని

దీంతో విషయం అర్థం కాక తనిష్క గురించి ఆన్‌లైన్‌లో ఆరవ్‌ సెర్చ్‌ చేశాడు. తనిష్క మూడు వేర్వేరు కోచింగ్‌ సంస్థలలో విద్యార్థిగా నమోదై ఉందని కనుగొన్నాడు. అయితే ఆరవ్ డాక్టర్‌ కావాలని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి అవకాశాలను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

మెరుగైన ఫలితాల కోసం ఒకటి కంటే ఎక్కువ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాలని భావించాడు. అందుకు తండ్రిని కూడా ఒప్పించాడు. కారణం తనిష్క కూడా మూడు కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకొంది. ఈ అంశంపై ఆరవ్‌ తండ్రి కొంత రీసెర్చ్‌ చేశారు. నమోదైన ప్రతి కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఏదో ఒక ప్రొడక్టులను తనిష్క పొంది ఉందని ఆరవ్‌ తండ్రి గుర్తించారు.

దీనిపై ఒక కోచింగ్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ.. తనిష్క తమ వద్ద టెస్ట్ సిరీస్‌ తీసుకొని, ఆమె తమ విద్యార్థిగా మారిందని చెప్పారు. మరో కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా.. తనిష్క కంటెంట్ తీసుకుందని, అందుకు తమ విద్యార్థుల జాబితాలో చేరిందని తెలిపింది. ప్రతి బ్యానర్, బిల్‌బోర్డ్‌లో తనిష్కను క్లాస్‌రూమ్ స్టూడెంట్‌గా ప్రచారం చేశారు. దీంతో ఆరవ్ తండ్రి ఆమె క్లాస్ తీసుకున్న లొకేషన్‌ను గుర్తించగలిగారు.

ఎన్నో మోసాలు

దేశవ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అడ్మిషన్ల సీజన్ ప్రారంభమైన వెంటనే మిలియన్ల మంది విద్యార్థులను సంప్రదిస్తాయి. ఇందుకు సాధారణంగా ఒక డేటాబేస్‌ను నిర్వహిస్తుంటాయి. ఎనిమిదవ తరగతిలో పిల్లలను ట్రాక్ చేయడం ప్రారంభిస్తాయి. ఇలా తమ కార్యక్రమాలను, ఇతర ఆఫర్లను ఎలా, ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తాయి.

ఒక విద్యావేత్త మాట్లాడుతూ.. మెడికల్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చాలా మంది దరఖాస్తుదారులు టైర్ 2, అంతకంటే తక్కువ పట్టణాల నుంచి వస్తారని చెప్పారు. 2018లో అత్యధిక సంఖ్యలో పరీక్ష రాసేవారిలో న్యూ ఢిల్లీ తర్వాత పాట్నా రెండవ స్థానంలో ఉంది, కోటా నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పారు. అనేక కోచింగ్ సెంటర్ల నుంచి ప్రొడక్టులను కొనుగోలు చేసేలా అటువంటి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేయడం చాలా సులభం అని తెలిపారు.

ఇది కూడా చదవండి : పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 వరకు జీతం..!

లంచం కూడా ఇస్తున్న కోచింగ్‌ సెంటర్లు

కోర్సులు కొనమని కొందరు మాయమాటలు చెబుతుంటే, మరికొందరు లంచం ఇచ్చి ఆ పని చేస్తున్నారన్నారు. అనేక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు దేశవ్యాప్తంగా మంచి పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటాయి. వారు కోచింగ్ తరగతులకు దరఖాస్తు చేయడం ప్రారంభించక ముందే వారిని వెంబడించడం ప్రారంభిస్తారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కొన్ని కోచింగ్ సెంటర్లలోకి ప్రవేశించడానికి, తప్పనిసరిగా ప్రవేశ పరీక్షలకు హాజరు కావాలి. ప్రవేశ పరీక్ష ఫలితాలు వివిధ కేంద్రాల మధ్య అంతర్గతంగా భాగస్వామ్యం అవుతాయని, దాని ఆధారంగా టాపర్ల జాబితాను తయారు చేస్తాయని కొందరు విద్యావేత్తలు తెలిపారు.

ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత టాపర్ సెంటర్‌లో చేరితే, వారికి మరొక కోచింగ్ సెంటర్ తమ ఆఫర్‌లలో కనీసం ఒకదానిని విక్రయిస్తుంది. అయినప్పటికీ ఈ కేంద్రాలు విద్యార్థిని తమ ఆఫర్లను కొనుగోలు చేయడానికి ఒప్పించలేకపోతే, కొన్ని లక్షల రూపాయల నుంచి, ఖరీదైన కార్ల వరకు ఆఫర్‌ చేస్తారు. ఒక సందర్భంలో ఒక విద్యార్థి అన్నయ్యను మూడు నెలల పాటు కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్స్ మేనేజర్‌గా పని చేయమని కోరి, 'గిఫ్ట్' మొత్తాన్ని అతనికి జీతం బోనస్‌గా బదిలీ చేశారని ఓ బ్రాండ్ మేనేజర్ తెలిపారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజుగా చెల్లిస్తారని, అలాంటి బహుమతులు తీసుకోవడం పర్వాలేదని వారు భావిస్తున్నారని విద్యావేత్త తెలిపారు.

బలవంతం చేస్తున్న కొందరు

అడ్మిషన్లకు ముందు లేదా ఫలితాల తర్వాత ఇవన్నీ జరుగుతాయని భావిస్తూ పొరపాటు. విద్యా సంవత్సరంలో విద్యార్థులు వారి సంబంధిత కేంద్రాలలో అనేక మాక్ పరీక్షలకు హాజరవుతారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు పంచుకున్నట్లే, ఈ పరీక్షల ఫలితాలను కూడా వివిధ కేంద్రాలు పంచుకుంటాయి. ఏ విద్యార్థులు IIT-JEE పరీక్షలు లేదా NEETలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందో తెలుసుకుంటారు. ఈ కేంద్రాలు విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెడతాయి. వారికి లంచం ఇవ్వడానికి లేదా ఆఫర్లను కొనుగోలు చేసేలా బలవంతం చేస్తాయి.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET, Tenth class

ఉత్తమ కథలు