హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

చిన్నారుల తెలివిని చదువుతో కొలవొద్దు.. మీ పిల్లలను ఇలా ప్రోత్సహించండి..

చిన్నారుల తెలివిని చదువుతో కొలవొద్దు.. మీ పిల్లలను ఇలా ప్రోత్సహించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులలో కొలవడం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి శైలి ఒక్కోలా ఉంటుంది. కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పాటును అందించవచ్చు.

ఇంకా చదవండి ...

పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులలో కొలవడం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి శైలి ఒక్కోలా ఉంటుంది. వారిలో కచ్చితంగా సొంత ప్రతిభ ఉంటుంది. అందుకే ఏ ఇద్దరు పిల్లలనూ పోల్చి చూడకూడదు. కానీ పెద్దవాళ్లు ఈ విషయాలను ఎంతమేరకు అర్థం చేసుకుంటున్నారనేది అసలు సమస్య. తల్లిదండ్రలు తమ ఆలోచనలను, లక్ష్యాలను పిల్లలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు. మార్కులు తక్కువగా వచ్చాయనో, టీచర్లు ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేయలేదనో వారిని శిక్షించకూడదు. చిన్న వయసులోనే ఇలా చేయడం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు. 21వ శతాబ్ధంలో తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలి. ఒక వ్యక్తి విజయం, వైఫల్యాన్ని నిర్దేశించేందుకు ఎలాంటి ప్రమాణాలు లేవని పెద్దవాళ్లు గుర్తించాలి. కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పాటును అందించవచ్చు.

మానసిక ఆరోగ్యం ముఖ్యం

చదువులు పిల్లల తెలివితేటలను నిర్ధారించలేవని తల్లిదండ్రులు గుర్తించాలి. ఆటపాటలు, జీవిత నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు వంటివి ర్యాంకుల కంటే విలువైనవి. మన విద్యావ్యవస్థలో ఇలాంటి విషయాల గురించి ఎవరూ చెప్పరు. ఎంత సేపటికీ పరీక్షలు, మార్కులు, ర్యాంకులతో విద్యార్థులపై ఒత్తిడి పెడతారు. దాన్ని తల్లిదండ్రులు సరిదిద్దాలి. మీ పిల్లవాడు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని కోరుకోవడానికి బదులుగా, జీవితంలో సంతృప్తినిచ్చే వృత్తిలో వారు స్థిరపడాలని కోరుకోవాలి. ఈ దిశగా వారిని ముందు నుంచి ప్రోత్సహించాలి.

పిల్లల ఆసక్తులను గుర్తించాలి

భవిష్యత్తులో పిల్లలు స్థిరపడటానికి ర్యాంకులు సాధించడం ఒక్కటే మార్గమని చాలామంది పెద్దవాళ్లు భావిస్తుంటారు. కానీ ఇది మంచి ఆలోచన కాదు. జీవితంలో మంచి స్థానానికి చేరుకోవడానికి ఆఫ్‌బీట్ కోర్సులు, నైపుణ్యాలు, వృత్తులకు సంబంధించిన కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి ఆరా తీయండి. పిల్లల అభిరుచులు, ఆసక్తులకు సరిపోయే ఏదో ఒక కోర్సులో చేర్పించండి.

ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దు

విజయం అంటే మంచి మార్కులు, ర్యాంకులు సాధించడమే అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే, వారు పెద్దయ్యాక అదే భావనతో ఉంటారు. ఎక్కడ మంచి ర్యాంకు రాదేమోనని భయపడతారు. మంచి మార్కులు పొందడానికి ఒక విధమైన ఒత్తిడితో కూరుకుపోతారు. దీంతో వారిలో ఆందోళన కూడా పెరుగుతుంది. మీరు చెప్పినట్లుగా మంచి మార్కులు, ర్యాంకులు రాకపోతే.. పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అంతటితో ఆగకుండా జీవితంలోని ప్రతీ దశలో ఇతరులతో పోల్చుకుంటూ కుంగుబాటులో కూరుకుపోయే ప్రభావం కూడా ఉంది.


మార్కులు తెలివితేటలకు ప్రామాణికం కాదు

పిల్లల తెలివితేటలను మార్కులతో కొలవకూడదు. కారణాలు ఏవైనా ఒక్కోసారి వారికి మంచి మార్కులు రాకపోవచ్చు. అంత మాత్రాన వారికి తెలివి లేనట్టు భావించకూడదు. పాఠాలు నేర్చుకుని, పరీక్షలు రాసి మార్కులు రాసినంత మాత్రన పిల్లలు ఎక్కువ తెలివిగలవారిని భావించడమూ సమంజసం కాదు. ఇవి వారికి కేవలం విద్యలో ప్రావీణ్యం ఉందనడానికి మాత్రమే సరిపోతాయి. కానీ వారి శక్తి సామర్థ్యాలను కొలవలేవు. అందుకే పిల్లలను మార్కులు, ర్యాంకుల కోసం పీడించకూడదు.

చదువుకు, నైపుణ్యాలకు సంబంధం లేదు

ఈ ప్రపంచంలో విద్యకంటే ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. విభిన్న వ్యక్తులతో వ్యవహరించే పద్ధతులు, పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యాలు వంటివి పుస్తకాల్లో ఉండవు. పిల్లలకు ఇలాంటి నైపుణ్యాలు లేకపోతే, వారి చదువంతా వృథా అయినట్లే. ఇలాంటి సాఫ్ట్‌ స్కిల్స్‌, జీవన నైపుణ్యాలకు మార్కులతో సంబంధం లేదు. ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు. అందుకే భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో తల్లిదండ్రులు వారికి నేర్పించాలి.

First published:

Tags: Children, EDUCATION, Parenting

ఉత్తమ కథలు