హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Interview: మొదటి ఆధార్ కార్డ్ ఎవరికి ఇచ్చారు? సివిల్స్ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి

UPSC Interview: మొదటి ఆధార్ కార్డ్ ఎవరికి ఇచ్చారు? సివిల్స్ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి

UPSC Interview: మొదటి ఆధార్ కార్డ్ ఎవరికి ఇచ్చారు? సివిల్స్ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి
(ప్రతీకాత్మక చిత్రం)

UPSC Interview: మొదటి ఆధార్ కార్డ్ ఎవరికి ఇచ్చారు? సివిల్స్ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి (ప్రతీకాత్మక చిత్రం)

UPSC Interview | సివిల్స్ క్రాక్ చేయడం నిరుద్యోగుల కల. అయితే ఈ కల నెరవేర్చుకోవడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ (Civils Prelims) పాస్ కావడమే కష్టం అంటే ఇంటర్వ్యూ (Civils Interview) దాటడమంటే చాలా టాలెంట్ ఉండాలి. మరి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు.. ముందు ఇంటర్వ్యూలు ఎలా సాగుతాయో తెలుసుకోవాలని భావిస్తుంటారు. సివిల్స్ ఇంటర్వ్యూలో (Civils Interview) అడిగే ప్రశ్నలు చాలా క్లిష్టంగా, ట్రిక్కీగా ఉంటాయి. యూపీఎస్‌సీ (UPSC) బోర్డు మెంబర్స్ ఊహకందని ప్రశ్నలు వేసి సివిల్స్ అభ్యర్థుల పర్సనాలిటీ, మేధోశక్తిని పరిశీలిస్తారు. అలాగే వారి నైతికతను టెస్ట్ చేసేందుకు కూడా తగిన ప్రశ్నలు సంధిస్తారు. అభ్యర్థులు హాల్లో అడుగుపెట్టిన సమయం నుంచి వారి ప్రతి కదలికను పరిశీలిస్తారు. సాధారణ ప్రశ్నలను సైతం మెలికలు తిప్పి మరీ అడుగుతారు. ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్ రాసిన తరువాత ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్‌లకు హాజరవుతుంటారు అభ్యర్థులు. ఈ పర్సనాలిటీ టెస్ట్‌లో సమాధానాలను బట్టి అభ్యర్థి అసలైన వ్యక్తిత్వం ఏంటనేది ప్యానెల్ సభ్యులు విశ్లేషించగలరు. అయితే సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగే కొన్ని గమ్మత్తయిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

సివిల్స్ అభ్యర్థి కుమార్ కేశవ్ అసలైన యూపీఎస్‌సీ ఇంటర్వ్యూ హాజరయ్యే ముందు మాక్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో అతను చాలా ట్రిక్కీ ప్రశ్నలను ఫేస్ చేశారు. ఆ తరువాత యూపీఎస్‌సీ 2020లో ఆల్ ఇండియా ర్యాంక్ 491 సాధించిన కేశవ్, అప్పటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో చాలా తెలివిగా.. ప్యానెల్ సభ్యులు ఫిదా అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు. "ఒక మహిళ ఓ నిరుద్యోగ వ్యక్తిని వివాహం చేసుకోవడంపై మీ ఆలోచనలు ఏంటి?" అని ఇంటర్వ్యూ ప్యానెల్ కేశవ్ ని ప్రశ్నించింది.

IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు కేశవ్ నిశితంగా ఆలోచించారు. తర్వాత సమాధానమిస్తూ “నిరుద్యోగ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది అమ్మాయి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. నిరుద్యోగిని పెళ్లి చేసుకోవాలని భావించడం ఆమె వ్యక్తిగతం. ఆమె తన జీవితాన్ని నిరుద్యోగ వ్యక్తితో గడపగలనని అనుకుంటే.. అతన్ని పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది. బహుశా, ఆ వ్యక్తి పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు లేదా స్టార్టప్‌ని నిర్మిస్తూ ఉండొచ్చు. అప్పటికే ఇంకా ఉద్యోగం సంపాదించలేకపోవచ్చు" అని కేశవ్ చెప్పారు.

ఈ ప్రశ్నను మరింత ట్విస్ట్ చేయాలని ప్యానెల్ నిర్ణయించింది. తరువాత ఇలా ప్రశ్నించింది. “ఒకవేళ అమ్మాయి బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించాలని.. పురుషుడు ఇంట్లోనే ఉండి పనులు చేయాలని వారిద్దరూ నిర్ణయించుకుంటే మీరు ఏమి చెబుతారు?” అని ప్యానెల్ చిక్కు ప్రశ్న వేసింది.

Job Notifications: నిరుద్యోగులకు అలర్ట్... ఈ 7,411 ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2 రోజులే గడువు

ఈ ప్రశ్న విన్న తర్వాత కూడా కేశవ్ తనలోని చెక్కుచెదరని కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించారు. అలాగే తన విశ్లేషణాత్మక సామర్ధ్యాన్ని ఉపయోగించి సమాధానం ఇచ్చారు. కేశవ్ ఆన్సర్ చెబుతూ.. "జంట ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే నాకు ఎటువంటి సమస్య లేదు. దానితో నాకు ఎలాంటి సమస్య కనిపించడం లేదు. స్త్రీ సంపాదించాలి, పురుషుడు ఇంట్లో ఉండాలి అని ఎవరైనా వ్యక్తిగతంగా భావిస్తే, వారు అలానే చెయ్యొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పాటిస్తున్నాం." అని అన్నారు.

మరిన్ని గమ్మత్తయిన ప్రశ్నలు

ప్రశ్న: సంవత్సరానికి ఎన్ని నిమిషాలు ఉంటాయి?

ప్రశ్న: భూమిపై అత్యంత గట్టి పదార్థం ఏది?

ప్రశ్న: 6 రోజుల పాటు ఊపిరిని బిగబట్టగల జంతువు పేరు చెప్పండి?

ప్రశ్న: ఐపీ ఫుల్ ఫామ్ ఏంటి?

ప్రశ్న: మన జాతీయ గీతం ఏంటి?

ప్రశ్న: భారతదేశంలో సగం మహారాష్ట్రలో, సగం గుజరాత్‌లో ఉన్న రైల్వే స్టేషన్ ఏది?

ప్రశ్న: భారతదేశంలో ఆధార్ కార్డు పొందిన మొదటి వ్యక్తి పేరు చెప్పండి?

DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 116 పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

కొద్ది రోజుల క్రితం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా దాని ప్రవేశ పరీక్షలో ఒక ట్రిక్కీ ప్రశ్నను అడిగింది. “ఒక కాంబినేషన్ లాక్‌లో మూడు డయల్‌లు ఉంటాయి. ప్రతి డయల్‌లో ఎనిమిది అక్షరాలు ఉంటాయి. వన్, హూ టు, బాబ్(bob), యాడ్, ఔల్(owl), ఫాబ్, డెన్, మియా, టాట్ - ఈ కాంబినేషన్లు ఉపయోగించారని తెలిసింది. విన్, డెబ్, హ్యాట్, మెన్, బాడ్ - ఈ ఆప్షన్స్ లో ఈ కాంబినేషన్ లాక్‌లో ఉపయోగించడం సాధ్యం కానిది ఏది?" అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రశ్నించింది.

యూపీఎస్‌సీ 2020కి సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ 24న ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 761 మంది అభ్యర్థులు వివిధ విభాగాలు, ప్రొఫైల్‌లలోని స్థానాలకు ఎంపికయ్యారు. బిహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన శుభం కుమార్ ఈ ఏడాది యూపీఎస్‌సీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు.

First published:

Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, JOBS, UPSC

ఉత్తమ కథలు