తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగానే పీఎల్ (పాలిటెక్నిక్ ), డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్పీఎస్సీ తాజాగా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన దగ్గర నుంచి ఇంత వరకు జేఎల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా ఈ నోటిఫికేషన్ వెల్లడి కావడంతో.. నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు వచ్చే ఏడాది (2023) జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. 2023 జూన్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అర్హతలు, పోస్టుల వివరాలు, అప్లికేషన్ విధానం ఇలా ఉన్నాయి.
అర్హత వివరాలు ఇలా..
అరబిక్ , బోటనీ , బోటనీ (ఉర్దూ మీడియం), కెమిస్ట్రీ , కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం), కామర్స్ , కామర్స్ (ఉర్దూ మీడియం), ఎకనామిక్స్, ఎకనామిక్స్ (ఉర్దూ), ఇంగ్లీష్ , ఫ్రెంచ్, హిందీ, హిస్టరీ, హిస్టరీ (ఉర్దూ మీడియం), హిస్టరీ (మరీఠీ మీడియం), మ్యాథ్స్, మ్యాథ్స్ (ఉర్దూ మీడియం), ఫిజిక్స్ , ఫిజిక్స్(ఉర్దూ మీడియం), సాంస్క్రీట్(Sanskrit), తెలుగు , ఉర్దూ, జువాలజీ , జువాలజీ (ఉర్దూ మీడియం) వంటి విభాగాల్లో జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) సెకండ్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఏ ఆనర్స్ , బీఎస్సీ ఆనర్స్ లేదా బీకాం ఆనర్స్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
ఉర్దూ మీడియం, మారాఠీ భాషలకు సంబంధించి సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ/ మరాఠీ పదో తరగతి లో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష గా బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సివిక్స్ లో జూనియర్ లెక్చరర్స్..
సివిక్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 50 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. సివిక్స్ (ఉర్దూ మీడియం),సివిక్స్ (మారాఠీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ, మరాఠీ పదో తరగతి లో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష గా బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలిలా..
1. అరబిక్ - 02
2.బోటనీ - 113
3. బోటనీ (ఉర్దూ మీడియం)-15
4.కెమిస్ట్రీ - 113
5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19
6. సివిక్స్ - 56
7.సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16
8. సివిక్స్ (మారాఠీ) - 01
9. కామర్స్ - 50
10. కామర్స్ (ఉర్దూ మీడియం) - 07
11. ఎకనామిక్స్ - 81
12. ఎకనామిక్స్ (ఉర్దూ) - 15
13. ఇంగ్లీష్ - 81
14.ఫ్రెంచ్ - 02
15. హిందీ - 117
16. హిస్టరీ- 77
17. హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17
18. హిస్టరీ (మరీఠీ మీడియం) - 01
19. మ్యాథ్స్ - 154
20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09
21. ఫిజిక్స్ - 112
22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18
23. సాంస్క్రీట్(Sanskrit) - 10
24. తెలుగు - 60
25. ఉర్దూ - 28
26. జువాలజీ - 128
27. జువాలజీ (ఉర్దూ మీడియం) - 18
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్.. డిసెంబర్ 16 నుంచి అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల నుంచి టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మొన్న పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించి 247 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. నిన్న 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇలా వరుస నోటిఫికేషన్లతో తెలంగాణలోని నిరుద్యోగుల్లో ఆనందకోలాహలం కనపడుతోంంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Jobs in telangana, Telangana, Telangana government jobs, Telangana jobs, TSPSC