హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Alert : అభ్యర్థులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు..

TSPSC Alert : అభ్యర్థులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియాల్సి ఉండగా.. దీనిని వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలిలా..

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి ఇటీవల 581 పోస్టులకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్ట్ లు, దివ్యాంగ్, సీనియర్ సిటిజన్(Citizen) విభాగంలో వార్డెన్,మేట్రన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హాస్టల్ వెల్ ఫేర్ గ్రేడ్ 1 అండ్ 2, మాట్రాన్ గ్రేడ్ - 1 అండ్ 2, వార్డెన్ గ్రేడ్ 1 అండ్ 2, లేడీ సూపరింటెండెంట్, చిల్డ్రెన్ హోమ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 581 పోస్టులకు జనవరి 6, 2023 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 27, 2023 చివరి తేదీగా నోటిఫికేషన్ లో(Notification) పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా టీఎస్పీఎస్సీ ఓ వెబ్ నోటీస్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేషన్ కారణాలతో ఈ దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.  నేటితో (జనవరి 27) ముగియాల్సిన ఉన్న ఈ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 03, 2023 వరకు పెంచారు. ఈ మేరకు వెబ్ నోట్ ద్వారా టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు తెలిపింది.

దరఖాస్తు విధానం ఇలా..

-ముందుగా అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) నమోదు చేసుకొని ఉండాలి.

-తర్వాత అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

-ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

-తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ టీఎస్పీఎస్సీ ఐడీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయాలి.

-దీంతో పాటు.. క్యాప్షాను ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. విద్యార్హతకు సంబంధించి వివరాలను నమోదు చేయాలి.

-చివరగా వివరాలను సరిచూసుకొని సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫారమ్ ను కావాలంటే.. ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

వీటిలో కింద తెలిపిన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140, వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05, -లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19, మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03, వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03, మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీతో పాటు బీఎడ్ లేదా డీఎడ్ ఉండాలి.

First published:

Tags: JOBS, TSPSC

ఉత్తమ కథలు