WHEN WILL CBSE DECLARE TERM 1 RESULTS WILL CBSE CANCEL TERM 2 BOARD EXAMS CHECK HERE GH VB
CBSE: సీబీఎస్ఈ టర్మ్-1 ఫలితాలెప్పుడు..? టర్మ్-2 ఎగ్జామ్స్ జరుగుతాయా..? పూర్తి వివరాలిలా..
ప్రతీకాత్మకచిత్రం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12 తరగతుల టర్మ్-1 పరీక్షలు ముగిసి నెల రోజులు దాటింది. కానీ ఫలితాలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. వీటి కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12 తరగతుల టర్మ్-1 పరీక్షలు ముగిసి నెల రోజులు దాటింది. కానీ ఫలితాలు(Results) మాత్రం ఇంకా విడుదల కాలేదు. వీటి కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అదీగాక ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటననూ సీబీఎస్ఈ(CBSE exams) జారీచేయక పోవడం గమనార్హం. జనవరి 15 లోగా ఎగ్జామ్(Exam) రిజల్ట్స్ వస్తాయని వార్తలు వచ్చినప్పటికీ అవి విడుదల కాలేదు. మరోవైపు టర్మ్-2 పరీక్షల షెడ్యూల్‌పై విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారు.ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. టర్మ్-2 పరీక్షలను(term-2 exams) మార్చి-ఏప్రిల్ నెలల్లో సీబీఎస్ఈ నిర్వహించాల్సి ఉంది. అంటే పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థులకు కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలున్నాయి. ఈ క్రమంలో టర్మ్-1 ఫలితాల ప్రకటన ఎప్పుడు? కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో అసలు టర్మ్-2 పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టర్మ్-1 రిజల్ట్స్ చెకింగ్ ఎలా..?
సీబీఎస్ఈ టర్మ్-1 ఫలితాల ప్రకటన అనంతరం.. బోర్డు అధికారిక వెబ్సైట్ cbse.nic.in, cbseresults.nic వెబ్సైట్లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. SMS ద్వారా కూడా విద్యార్థుల మార్కులను పొందవచ్చు. మొబైల్ యాప్, డిజిలాకర్ యాప్, ఉమాంగ్ యాప్ నుంచి సైతం రిజల్ట్స్ చెక్ చేసుకునే వెసులుబాటును అందిస్తోంది సీబీఎస్ఈ.
కొత్త విధానం..
ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు పరీక్షలను CBSE రెండు టర్మ్‌లుగా విభజించింది. టర్మ్-1 పరీక్షలు నవంబర్-డిసెంబర్లో ముగిశాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మార్చి-ఏప్రిల్‌లో టర్మ్-2 పరీక్షలు జరగాల్సి ఉంది. టర్మ్-1లో పాసైన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తుంది బోర్డు. టర్మ్-2 రిజల్ట్స్ అధారంగా 10, 12 తరగతుల తుది ఫలితాలను ప్రకటిస్తుంది.
టర్మ్-2 పరీక్షలు రద్దేనా?
కరోనా థర్డ్‌వేవ్(Third wave in india) విజృంభణతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్లైన్ తరగతులు జరుగుతున్నప్పటికీ.. విద్యార్థుల ఆసక్తి అంతంతమాత్రమే. ఇక చాలామందికి ఇంటర్నెట్, ఫోన్, ల్యాప్‌టాప్ అందుబాటులో లేని పరిస్థితి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. రాబోయే CBSE టర్మ్-2 బోర్డు పరీక్షలను రద్దు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక ట్విట్టర్లో ట్రెడింగ్ చేస్తున్నారు కూడా!
అయితే బోర్డు మాత్రం.. టర్మ్-2 పరీక్షల నమూనా పత్రాలను విడుదల చేసింది. అంటే ఎగ్జామ్స్(term-2 exams Schedule) జరిగితీరుతాయని పరోక్షంగా సూచించింది. ప్రస్తుతం కొవిడ్ కేసులు నియంత్రణలో ఉన్నాయని, 15-18 సంవత్సరాల వారికి టీకాల పంపిణీ సైతం వేగంగా జరుగుతోందని బోర్డు భావిస్తోంది. అందువల్ల పరీక్షలు నిర్వహించాలనే యోచనలో సీబీఎస్ఈ ఉన్నట్లు సమాచారం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.