మరో నాలుగు రోజుల్లో తెలంగాణ పోలీస్(Telangana Police) అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు మొదలు కాబోతున్నాయి. డిసెంబర్ 8 నుంచి జనవరి 03 వరకు ఈ ప్రాసెస్ మొత్తం 12 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం అభ్యర్థులు ఈవెంట్స్ లో గట్టెక్కేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. కొంతమంది అలవోకగా.. రన్నింగ్ లో మెరిట్(Merit) సాధిస్తుంటే.. మరి కొంత మంది క్వాలిఫై కావడానికి కష్టంగా మారింది. దీంతో అభ్యర్థులు ఉదయం 5 గంటలకే గ్రౌండ్స్ లో దర్శనమిస్తున్నారు. అయితే గ్రౌండ్ లో రన్నింగ్ ప్రాక్టీస్(Running Practice) చేసే సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పరిగెడితే తర్వాత రోజు నుంచి ఆ అభ్యర్థి కాళ్ల నొప్పులతో.. ఇబ్బందికి గురవుతాడు. అంతే కాకుండా.. నిర్ణీత సమయంలో ఈవెంట్స్ ను కూడా పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఇక్కడ చెప్పే కొన్ని విషయాలు పాటిస్తే.. రన్నింగ్ లో అర్హత సాధించడంతో పాటు.. మెరిట్ కూడా సాధించే అవకాశం ఉంటుంది. ఆ విషయాలను తెలుసుకుందాం.
400 మీటర్ల ట్రాక్ లో మొత్తం రెండు Curves ఉంటాయి. ఒక్కో Curve 120 మీటర్లు ఉంటుంది. రెండు Curves కలిపి మొత్తం 240 మీటర్లు ఉంటుంది. ముందుగా అభ్యర్థులు Curves దగ్గర ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తాలి. తర్వాత కాస్త స్పీడ్ ను తగ్గించుకుంటూ వెళ్తే.. మీరు 1600/800 మీటర్ల పరుగును తక్కువ సమయంలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ఇక పురుష అభ్యర్థులు 100 మార్కుల స్కోర్ సాధించాలంటే.. ఆ 400 మీటర్ల ట్రాక్ ను నాలుగు భాగాలు చేసుకోవాలి. మొదటి రౌండ్ లో 1.10 నిమిషాల లోపు 400 మీటర్ల పరుగును పూర్తి చేయాలి. రెండో రౌండ్ నిమిషం 05 సెకన్లలో.. మూడో రౌండ్ నిమిషం.. నాలుగో రౌండ్ 54 సెకన్లలో పూర్తి చేయగలిగితే.. మీరు 100 మార్కులు సాధించినట్లే. దీనిని ప్రతీ రౌండ్ ను స్టాప్ వాచ్ లో ల్యాప్స్ మాదిరిగా సమయాన్ని లెక్కించాల్సి ఉంటుంది. అప్పుడే అభ్యర్థికి ఒక క్లారిటీ ఉంటుంది.
అదే మహిళా అభ్యర్థులు అయితే.. మొదటి రౌండ్ నిమిషం 35 సెకన్లలో పూర్తి చేయాలి. రెండో రౌండ్ ను 89 సెకన్లో పూర్తి చేయాలి. ఇలా చేస్తే మహిళలకు 100 మార్కులు కేటాయిస్తారు.
కేవలం అర్హత మాత్రమే సాధించాలంటే.. పురుష అభ్యర్థులు నాలుగు రౌండ్లను ఈ క్రింది విధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అందులో మొదటి రౌండ్ 115 సెకన్లో (నిమిషం 55 సెకన్లు) పూర్తి చేయాలి. రెండో రౌండ్ 110 సెకన్లో మూడో రౌండ్ 105 సెకన్లలో, నాలుగో రౌండ్ 104 సెకన్లో పూర్తి చేయాలి. ఈ రకంగా నాలుగు రౌండ్స్ ను పూర్తి చేస్తే.. 55 మార్కులు సాధించడంతో పాటు.. ఈవెంట్ కు అర్హత సాధించవచ్చు.
మహిళా అభ్యర్థులు మొదటి రౌండ్ 2.45 నిమిషాల్లో మొదటి రౌండ్.. రెండో రౌండ్ 2.34 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇలా చేస్తే 55 మార్కులు సాధించడంతో పాటు.. ఈవెంట్ కు అర్హత సాధించవచ్చు.
పరుగులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
1. రన్నింగ్ లో లాంగ్ స్టెప్స్ వేస్తూ వెళ్లాలి.
2. ఊపిరి పీల్చుకునే సమయంలో ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకుంటూ.. నోటితో గాలిని వదులుతూ ఉండాలి.
3.ముందు వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ.. మీ పరుగును పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, Telangana jobs, Tslprb