హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Software Jobs: ఉద్యోగుల సంఖ్యను 10వేలకు పెంచుకోనున్న సంస్థ.. 2500 వరకు ఉద్యోగాలు ఖాళీ..

Software Jobs: ఉద్యోగుల సంఖ్యను 10వేలకు పెంచుకోనున్న సంస్థ.. 2500 వరకు ఉద్యోగాలు ఖాళీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Software Jobs: వచ్చే ఏడాది జనవరి నాటికి సేల్స్‌ఫోర్స్(Sales Force) ఇండియా తన ఉద్యోగుల సంఖ్యను 10,000కు పెంచుకోనుంది. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 7,500 మందికి పైగా ఉంది. కంపెనీ ఛైర్‌పర్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అరుంధతీ భట్టాచార్య ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వచ్చే ఏడాది జనవరి నాటికి సేల్స్‌ఫోర్స్(Sales Force) ఇండియా తన ఉద్యోగుల సంఖ్యను 10,000కు పెంచుకోనుంది. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 7,500 మందికి పైగా ఉంది. కంపెనీ ఛైర్‌పర్సన్(Chairperson), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అరుంధతీ భట్టాచార్య(Arundhati Bhattacharya) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం క్లౌడ్(Cloud) ఆధారిత సర్వీస్ ప్రొవైడర్(Service Provider) అయిన సేల్స్‌ఫోర్స్(Sales Force) భారతదేశంలోని ముంబై, హైదరాబాద్(Hyderabad), బెంగళూరు, పూణే(Pune), గురుగ్రామ్, జైపూర్(Jaipur) వంటి ఆరు నగరాల్లో కార్యాలయాలను కలిగి ఉంది. భట్టాచార్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముందుగా భారతదేశంలోని సేల్స్‌ఫోర్స్ ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, తయారీ, మరియు సామాజిక సేవల రంగాలపై దృష్టి పెడుతుందన్నారు. ప్రస్తుతం తమ వర్క్‌ఫోర్స్ 7,500 కంటే ఎక్కువగా ఉందన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మా శ్రామిక శక్తి దాదాపు 10,000 వరకు ఉంటుందన్నారు. మా ఆర్థిక సంవత్సరం జనవరి 2023తో ముగుస్తుందని పేర్కొన్నారు. COVID-19 మహమ్మారి సమయంలో వేగంగా పెరిగిన శ్రామికశక్తి సేల్స్‌ఫోర్స్ భారతదేశంలో తన శ్రామిక శక్తిని వేగంగా పెంచుకుంది.

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు .. ఆకర్షణీయమైన జీతం..

జర్మనీ..

ఏప్రిల్ 2020లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,500 కాగా, ఇప్పుడు 7,500కి పెరిగింది. మహమ్మారి తర్వాత సౌకర్యవంతమైన హైబ్రిడ్ పని సంస్కృతి గురించి భట్టాచార్య ఇలా అన్నారు. తాము మరింత ఎక్కువ మంది ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Study Abroad: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా..? విభిన్న ప్రత్యేకతలున్న ఈ దేశాలపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న తమ కంపెనీ ఉద్యోగులందరి ఆఫీస్ కు రప్పిస్తామన్నారు. కార్యాలయంలో పని చేయడం వల్ల ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం పెరుగుతుందన్నారు. అంతే కాకుండా.. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పడు కొత్త విషయాలను , కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ యువత ముందుకు సాగాలన్నారు. భారతీయ యువత ఇప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇది సాఫ్ట్‌వేర్‌గా ఒక సర్వీస్ (సాస్) కంపెనీలు మరియు క్లౌడ్ ఆధారిత కంపెనీలు ఉపయోగించే నిర్దిష్ట సాంకేతికతను నేర్చుకోవడంలో వారికి సహాయపడుతుందన్నారు.

WIPRO: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జీతాల పెంపు.. ఎంత శాతం పెరుగుతాయంటే..

ముఖ్యంగా అనలిటిక్స్ , ఇంటిగ్రేషన్ వంటి నైపుణ్యాలకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉందని భట్టాచార్య ఉద్ఘాటించారు. వీటిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్‌ను స్వీకరించే వ్యక్తుల సామర్థ్యం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)ని వేగవంతం చేయబోతోందని భట్టాచార్య తెలిపారు. సేల్స్​ఫోర్స్​కు ఉత్తర అమెరికాలో మొత్తం 19 కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో శాన్​ఫ్రాన్సిస్కోలో ఇటీవల పూర్తయిన సేల్స్​ఫోర్స్​ టవర్ ఒకటి. మొత్తం 1,070 అడుగుల ఎత్తైన ఈ టవర్​ను నిర్మించటానికి 1.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది కంపెనీ. ఈ ఆఫీసులో డెస్క్‌ల వరుసలకు బదులుగా బ్రేక్‌అవుట్ ప్రదేశాలతో "కమ్యూనిటీ హబ్‌లు" లను రూపకల్పన చేస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IT Employees, JOBS, Software jobs

ఉత్తమ కథలు