Home /News /jobs /

WHAT IS THE PROCESS OF RECRUITING IN TOP COMPANIES WHAT RECRUITERS OBSERVES IN RESUMES HERE ARE INTERESTING DETAILS GH SK

Recruiting Process: టాప్ కంపెనీల్లో రిక్రూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రెజ్యూమ్‌లో గమనించే అంశాలేవి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Recruiting Process: టాప్ కంపెనీలు తమ కేటగిరీలు/ప్రొడక్డులను ముందుకు తీసుకెళ్లే అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. అలాంటి సంస్థల్లో బాధ్యతలను చేపట్టడానికి.. మునుపటి కంపెనీలో స్కేల్‌కు ఎలా సహాయం చేశారు? వ్యూహం ఏమిటి? అది ఎందుకు విజయవంతమైందో వివరించాలి.

ఇంకా చదవండి ...
Recruiting Process:  కంపెనీలు ప్రధానంగా రెండు రకాల అవసరాల కోసం ఉద్యోగులను నియమించుకుంటాయి. ఒకటి కొత్తదాన్ని నిర్మించడం(To Build Something New) కోసం, రెండోది అప్పటికే అభివృద్ది చెందిన బిజినెస్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లడం(To Scale Something Which Has Worked) కోసం నియామకాలను చేపడతాయి. ఈ అవసరాల కోసమే కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తాయి.

NEET PG: త్వరలో నీట్ పీజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్.. మెడికల్ సీటు కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే

* కొత్తదాన్ని నిర్మించడం కోసం
2021-22 కాలం ల్యాండ్‌మార్క్‌ ఎరా లాంటిది. కంపెనీలు తాము సెలక్ట్‌ చేసిన ట్యాలెంట్‌ స్థానికంగా ఉండాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నాయి. దీంతో హైరింగ్‌ మేనేజర్‌లు అభ్యర్థులను ఎలా చూస్తారు, షార్ట్‌లిస్ట్ చేస్తారు, రిజక్ట్‌ చేస్తారనేది మారింది. ఇప్పుడు కొత్తదాన్ని కనుగొనడానికి డెవలపర్‌లను వెతకడం భారతీయ, విదేశీ కంపెనీలలో సర్వసాధారణంగా మారింది. ఇందులో ప్రయోజనం ఏమిటంటే, కార్యాలయానికి సమీపంలో ఉన్న మంచి గృహాలను సెలక్ట్‌ చేసుకోవడం, ఇతర అప్రధానమైన విషయాల గురించి ఆలోచించడం కంటే సమస్యపై పని చేయడానికి ఉద్యోగులను ప్రేరేపించగలరు. ఇంటర్వ్యూ విధానం కూడా ఫిజికల్ నుండి వీడియో కాల్‌కి మారింది. ప్రపంచం అనుకూలిస్తున్న కొద్దీ, అనేక కార్యాలయాలు రిమోట్‌గా మారడం చూశాం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కలిగిస్తుంది. కంపెనీలు అభ్యర్థులను ఎలా అంచనా వేస్తాయి?

కొత్త ఉద్యోగులను కోరుకునే కంపెనీలు ఎల్లప్పుడూ రెజ్యూమ్, సదరు వ్యక్తి డెవలప్‌ చేసే ప్రాజెక్ట్‌లు, GitHub రిపాజిటరీలు, కమ్యూనిటీ, ఓపెన్ సోర్స్ కార్యక్రమాలకు ఎలా సహకరిస్తారనే దాని కోసం వెతుకుతాయి. కాబట్టి డెవలపర్‌లను నియమించుకోవాలని చూస్తున్న Amazon, Uber మొదలైన అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలని చూస్తున్నవారు.. మీ మునుపటి ప్రాజెక్ట్‌ల వివరాలను అందజేయడానికి సిద్ధంగా ఉండాలి. చాలా ప్రముఖ కంపెనీలు మేనేజిరియల్‌ రోల్‌ కోసం మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌ కోసం చూస్తాయి. అవతలి వ్యక్తికి చేసిన ప్రాజెక్టులను అర్థమయ్యేలా వివరిస్తే.. అభ్యర్థి గురించి కంపెనీ మేనేజర్‌లకు పూర్తి అవగాహన వస్తుంది.* ఎస్టాబ్లిష్డ్‌ బిజినెస్‌ను ఇంకా డెవలప్‌ చేయడానికి..
ఇక్కడే సంస్థలు ఇప్పటికే స్కేలింగ్ ప్రక్రియలో భాగమైన అభ్యర్థుల కోసం చూస్తాయి. వృద్ధిని వివరించిన విధంగానే స్కేల్‌ను నిర్వచించవచ్చు. ఉదాహరణకు.. ఒక కంపెనీని సంవత్సరానికి 1 మిలియన్ ట్రేడ్‌ల నుంచి సంవత్సరానికి 10 మిలియన్ ట్రాన్సాక్షన్‌ల వరకు తీసుకెళ్లడం లేదా ఒక్కో వినియోగదారుకు 10-15 సైన్-అప్‌లకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను రూపొందించారా? ఈ రెండు ఉదాహరణలు బిజినెస్‌ డెవలప్‌ చేయడంలో అభ్యర్థి సామర్థ్యాన్ని చూపుతాయి.

Swiggy, Myntra, Uber వంటి కంపెనీలు తమ కేటగిరీలు/ప్రొడక్డులను ముందుకు తీసుకెళ్లే అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. అలాంటి సంస్థల్లో బాధ్యతలను చేపట్టడానికి.. మునుపటి కంపెనీలో స్కేల్‌కు ఎలా సహాయం చేశారు? వ్యూహం ఏమిటి? అది ఎందుకు విజయవంతమైందో వివరించాలి.

AP Jobs: ఏపీలో ఈ నెల 11న మరో భారీ జాబ్ మేళా.. అరబిందో ఫార్మాలో 475 జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

* స్టాటిస్టికల్‌ అనాలసిస్‌
కొంత డేటాను పరిశీలిస్తే.. ఇన్‌స్టా హైర్ (Instahyre) ప్లాట్‌ఫామ్ 8000+ కంపెనీలతో పని చేసింది. వాటిలో దాదాపు 87 శాతం ఇంటర్నెట్‌ కంపెనీలు, ప్రొడక్ట్‌ రిలేటెడ్‌ జాబ్స్‌ కోసం ఉద్యోగులను హైర్‌ చేసుకుంటాయి. ఇంజినీరింగ్, ప్రొడక్ట్‌ మేనేజర్లు, ఇంజినీరింగ్ మేనేజర్లు, డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లు, సేల్స్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజర్లు వంటి హోదాలు ఉన్నాయి. ఇన్‌స్టా హైర్ 5 నెలల్లో 2398 రిక్రూటర్లతో ఇంటర్వ్యూలు నిర్వహించింది. రిక్రూటర్‌లు రెజ్యూమ్‌ని ఎలా చూస్తారు? అనేదానిపై అవగాహన పెంచుకోవడం ప్రాథమిక లక్ష్యంగా పేర్కొంది. రిక్రూటర్‌లకు అభ్యర్థి మల్టిపుల్‌ స్కిల్స్‌ను అంచనా వేయడానికి తగినంత సమయం ఉండదు. కానీ రెజ్యూమ్‌లను ఎలా అంచనా వేస్తారో తెలుసుకోండి.. అంటూ ఈ ఇంటర్వ్యూలపై ఇన్‌స్టా హైర్ స్పందించింది.

- అభ్యర్థులు సిమిలర్‌ కంపెనీలో పని చేశారా? లేదా? అనేది రిక్రూటర్లు చూస్తారు. 48 శాతం రిక్రూటర్లు ఇలాంటి నేపథ్యం ఉన్న అభ్యర్థులను ఇష్టపడతారు.

- స్కేల్, టెక్నాలజీ సపోర్ట్‌గా స్టాటిస్టిక్స్‌ ఎవరు పేర్కొన్నారు? రిక్రూటర్లు ఎల్లప్పుడూ స్టాటిస్టిక్స్‌ కోసం రెజ్యూమ్ చూస్తారు.

- Github/bitbucket లింక్‌లను కలిగి ఉన్నవారు, వాటిల్లో యాక్టివ్‌గా ఉన్నవారు. ప్రధానంగా వినియోగదారు-ఆధారిత కంపెనీలు అటువంటి ఉద్యోగులను ఎక్కువగా కోరుకుంటాయి.

- కెరీర్ గ్రోత్, అభ్యర్థి ఎలాంటి పని చేయడానికి ఇష్టపడతారు అనేది చూస్తారు. 37 శాతం రిక్రూటర్లు అభ్యర్థి అభిరుచి, కెరీర్ పురోగతిని పరిశీలిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: IT jobs, JOBS, Recruitment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు