ఇంటర్ (Inter)లో సైన్స్ స్ట్రీమ్ సెలక్ట్ చేసుకున్న విద్యార్థులు డిగ్రీ (Degree)లో చేరేందుకు కొన్ని మంచి ఆప్షన్స్ ఉంటాయి. కెరీర్ (Career) గోల్ ఆధారంగా తమకు నచ్చిన కోర్సులను స్టూడెంట్స్ సెలక్ట్ చేసుకుంటారు. అయితే BSc లేదా BSలో ఏది బెస్ట్ అనే దానిపై కన్ఫ్యూషన్లో ఉంటారు చాలామంది విద్యార్థులు. ఈ రెండూ సైన్స్ డిగ్రీ కోర్సులే కావడంతో వీటిపై కొంత గందరగోళం ఉంటుంది. అందుకే వీటిలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ తెలుసుకొని.. కెరీర్‌కు తగిన ఆప్షన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
BSc మూడేళ్ల డిగ్రీ అయితే, BS నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సు . బీఎస్‌లో పరిశోధనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే BS, MS రెండింటినీ కలిపి కోర్సులు అందుబాటులో ఉంటాయి. బీఎస్సీ(BSc)లో బీఎస్సీ జనరల్, బీఎస్సీ ఆనర్స్ అనే రెండు విభాగాలు ఉంటాయి. ఈ రెండు కోర్సుల సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. లెర్నింగ్ స్టైల్, ప్రొఫెషనల్ గోల్స్ విషయంలో మాత్రం తేడాలుంటాయి.
* కొత్త విధానంతో ప్రయోజనాలు
2020లో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఆ తర్వాత యూజీసీ(UGC) ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆనర్స్‌లో బీఎస్సీ, బీఏ (BSc, BA) కోర్సులు నాలుగు సంవత్సరాల UG ప్రోగ్రామ్స్‌గా మారాయని తెలిపారు బెంగళూరులోని విద్యా శిల్ప్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ విజయన్ ఇమ్మాన్యుయేల్.
జనరల్ బీఎస్సీ (BSc) డిగ్రీ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘బీఎస్సీ(BSc) మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు. ఈ కోర్సులో ఉండే అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన వారికి డిగ్రీని ప్రదానం చేస్తారు. ఇది మూడేళ్ల తర్వాత ఇచ్చే డిగ్రీ’ అని చెప్పారు. బీఎస్సీ ఆనర్స్ డిగ్రీలాంటివి 'స్పెషలైజేషన్' కోర్సులు. బీఎస్సీ ఆనర్స్లాగే బీఎస్సీ ఆనర్స్ రీసెర్చ్ విభాగం కూడా ఒకటి ఉంది. రీసెర్చ్‌లోకి వెళ్లాలనుకునే వారికి ఇది మరింత సహకరిస్తుంది. ఈ రీసెర్చ్ డిగ్రీతో పీహెచ్డికి అర్హులు అవుతారని విజయన్ చెప్పారు.
ఇది కూడా చదవండి : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు .. పూర్తి వివరాలిలా..
* ఏది బెస్ట్ కోర్సు..?
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఒక విద్యార్థి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో చేరాక స్సెషలైజేషన్లను మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు విజయన్. ఒక విద్యార్థి బీఎస్సీ ప్రోగ్రాంలో చేరితే, మొదటి ఏడాది చివరి నాటికి స్పెషలైజేషన్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
రెండు లేక మూడో సంవత్సరం చదువుతున్న బీఎస్సీ ఆనర్స్ విద్యార్థులు, ఆ తర్వాత బీఎస్సీ ఆనర్స్ రీసెర్చ్ విభాగంలోకి మారొచ్చు. దీనిలో ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులు ఏ కోర్సును ఎంచుకోవాలి అనేది వారి కెరీర్ ఆప్షన్‌కు సంబంధించిన అర్హత, ఆసక్తిపై ఆధారపడి ఉండాలని చెబుతున్నారు విజయన్. ఈ రెండింటి ఆధారంగా ప్రోగ్రాంలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Career opportunities, Degree students, EDUCATION, Intermediate, JOBS