హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career In Management: మేనేజ్ మెంట్ (MBA, PGDM)లో ఉద్యోగ అవకాశాలు.. PGDM కోర్సు వివరాలిలా..

Career In Management: మేనేజ్ మెంట్ (MBA, PGDM)లో ఉద్యోగ అవకాశాలు.. PGDM కోర్సు వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Career In Management: దేశంలో చాలా మంది మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌ను కొనసాగించాలని ఆకాంక్షిస్తారు. అందుకోసం కొందరు ఎంబీఏ చేస్తారు. కానీ మీరు MBA చేయలేకపోతే.. PGDM కోర్సు చేయవచ్చు. అయితే PGDM అంటే ఏమిటి..? దాని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసకోబోతున్నాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలో చాలా మంది మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌ను(Management Career) కొనసాగించాలని ఆకాంక్షిస్తారు. అందుకోసం కొందరు ఎంబీఏ(MBA) చేస్తారు. కానీ మీరు MBA చేయలేకపోతే.. PGDM కోర్సు చేయవచ్చు. అయితే PGDM అంటే ఏమిటి..? దాని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసకోబోతున్నాం. పీజీడీఎం కోర్సును పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(Post Graduate Diploma In Management) అంటారు. మార్కెట్(Market) మరియు పరిశ్రమల ప్రస్తుత పోకడలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా PGDM కోర్సులు రూపొందించబబడింది. తద్వారా వారు తమ కెరీర్‌లో మెరుగైన రీతిలో మేనేజ్‌మెంట్ చేయగలరు.


Earn Money In Education Field: డిగ్రీ, బీఈడీ చేసి ఖాళీగా ఉంటున్నారా.. ఈ కెరీర్ ఆప్షన్స్ మీ కోసమే..


PGDM అనేది మేనేజ్‌మెంట్ విద్యార్థులలో బాగా ప్రాచుర్యం పొందిన కోర్సు. కానీ, మేనేజ్‌మెంట్ విద్యార్థులే కాకుండా, ఇతర స్ట్రీమ్‌లకు కూడా చాలా స్కోప్ ఉంది. పీజీడీఎం విద్యార్థులు ఏడాదికి సగటున రూ.7 నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. PGDM అభ్యసించే విద్యార్థులు మంచి నాయకత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి.PGDM ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు. ఈ కోర్సును ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)కి అనుబంధంగా ఉన్న ప్రొఫెషనల్ బాడీస్ నిర్వహిస్తుంది. PGDMలో ప్రవేశానికి గ్రాడ్యుయేషన్ అవసరం. ఏదైనా విభాగంలోని విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఏదైనా సంస్థలో PGDMను అభ్యసించడానికి, కామన్ అడ్మిషన్ టెస్ట్, మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఎన్‌రోల్‌మెంట్ టెస్ట్ మరియు ICFAI బిజినెస్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి ప్రవేశ పరీక్షలను క్లియర్ చేయాలి.


Attendant Cum Technician Posts: అటెండెంట్-కమ్-టెక్నీషియన్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా..


ఈ కోర్సుల నుండి PGDM చేయొచ్చు..


1. మార్కెటింగ్


2. ఫైనాన్స్


3. సేల్స్ మేనేజర్


4. హ్యూమన్ రిసోర్స్ మేనేజర్


5. బిజినెస్ అనలిటిక్స్


6. విదేశీ వాణిజ్యం


7. లాజిస్టిక్స్ మరియు సప్లై మేనేజ్‌మెంట్


8. ఈవెంట్ మేనేజ్‌మెంట్


9. కార్యకలాపాల నిర్వహణ


10. రిటైల్


Job Notification: పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..


ఈ కోర్సును అందిస్తున్న అత్యుత్తమ సంస్థలు ఇవే..


1. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, జంషెడ్‌పూర్, జార్ఖండ్


2. గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, చెన్నై, తమిళనాడు


3. సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, లవ్లీ, పూణే, మహారాష్ట్ర


4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెంగళూరు


5. ITM-గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఖర్ఘరి, నవీ ముంబై, మహారాష్ట్ర


6. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్


7. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ముంబై, మహారాష్ట్ర


8. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీ


9. లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, చెన్నై, తమిళనాడు


10. ISBR బిజినెస్ స్కూల్, బెంగళూరు, కర్ణాటక

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Mba, Pgdm, Private Jobs, Students, Telangana government jobs

ఉత్తమ కథలు