హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career In Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి భవిష్యత్.. భారీ వార్షిక ప్యాకేజీ..

Career In Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి భవిష్యత్.. భారీ వార్షిక ప్యాకేజీ..

Career In Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి భవిష్యత్.. భారీ వార్షిక ప్యాకేజీ.. (Image Credit : iStock)

Career In Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి భవిష్యత్.. భారీ వార్షిక ప్యాకేజీ.. (Image Credit : iStock)

Fashion Designing Career Tips: ప్రస్తుతం యవత ఫ్యాషన్ రంగంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రోజు ఉన్న ట్రెండ మరో రోజు ఉండటం లేదు. ఇలా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు రోజురోజుకు ట్రెండ్ మారుతోంది. మారుతున్న ఈ ట్రెండ్ ప్రకారం అందరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం యవత ఫ్యాషన్(Fashion) రంగంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రోజు ఉన్న ట్రెండ మరో రోజు ఉండటం లేదు. ఇలా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు రోజురోజుకు ట్రెండ్(Trend) మారుతోంది. మారుతున్న ఈ ట్రెండ్ ప్రకారం అందరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు(Celebrities) ఎలాంటి బట్టలు కొన్నా ఫ్యాషన్ ట్రెండ్ చూసుకుని కొంటారు. అటువంటి పరిస్థితిలో, ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నందు, ఫ్యాషన్ డిజైనర్లకు (Designers) మార్కెట్‌లో(Market)  డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అకడమిక్ రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్(Fashion Designing)  కూడా స్థానం సంపాదించుకుంది. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ఎంత దూసుకపోతోందో.. అదే విధంగా ఫ్యాషన్ రంగం కూడా అంతే వేగంగా పుంజుకుంటోంది.

నేడు UG మరియు PG స్థాయిలో అనేక ఫ్యాషన్ డిజైన్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతాయి. విద్యార్థులు ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమ, ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటి గురించి చాలా నేర్చుకుంటారు. మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్‌ను కెరీర్‌గా మార్చుకోవాలనుకుంటే.. ఈ వార్త మీకు ముఖ్యమైనది. దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం.

WIPRO: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జీతాల పెంపు.. ఎంత శాతం పెరుగుతాయంటే..

వయో పరిమితి..

ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేస్తున్న అభ్యర్థి కనీస వయోపరిమితి 19 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు .. ఆకర్షణీయమైన జీతం..

విద్యార్హత..

యూజీ స్థాయిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే యువత ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి(NIFT వంటి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి) విద్యార్థులు NID, DAT, UCEED కలిగి ఉండాలి.

ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సులు

ఫ్యాషన్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, బిఎస్సీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు చేయవచ్చు. వేర్వేరు ఇన్‌స్టిట్యూట్‌లలో వేర్వేరు కోర్సులు అందించబడతాయి. దీని వ్యవధి కూడా భిన్నంగా ఉంటుంది. ఈ కోర్సులు 1 నుండి 4 సంవత్సరాల వరకు ఉండవచ్చు.

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

ఈ కోర్సులను ఇక్కడ తెలిపిన కాలేజీల్లో చేయవచ్చు..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఢిల్లీ

అమిటీ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నోయిడా

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ముంబై

సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పూణే

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బెంగళూరు

పెరల్ అకాడమీ, ఢిల్లీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, చెన్నై

పెరల్ అకాడమీ, జైపూర్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పాట్నా

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్

NIFT-TIA కాలేజ్ ఆఫ్ నిట్‌వేర్ ఫ్యాషన్, ఢిల్లీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID), ఢిల్లీ

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT), ఢిల్లీ

పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ (PAF), ఢిల్లీ

సింబయాసిస్ సెంటర్ ఆఫ్ డిజైన్ (SID), మహారాష్ట్ర

నార్తర్న్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIIFT), పంజాబ్

BECIL Recruitment 2022: ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలో ఉద్యోగాలు.. SSC, Inter, Degree అర్హతలు..

ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి..

బోటిక్, డిపార్ట్‌మెంటల్ స్టోర్ లేదా లైఫ్‌స్టైల్, జరా, ఎంపోరియో అర్మానీ వంటి పెద్ద బ్రాండ్‌లలో ఉద్యోగం పొందొచ్చు. దీనితో పాటు భారతీ వాల్‌మార్ట్, కెరియన్, డిజైన్ ఎన్ డెకర్, ఫ్యాబిండియా, కార్లే ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ మెగా మొదలైన కంపెనీలలో అరవింద్ మిల్స్ ఉద్యోగాలు చేయవచ్చు. వీటిలో వార్షిక ఆదాయం రూ.6లక్షల నుంచి మొదలువుతుంది. అయితే అభ్యర్థి యొక్క స్కిల్ ను బట్టి ఈ వార్షిక ప్యాకేజీలో మార్పులు ఉంటాయి.

First published:

Tags: Career and Courses, Career in fashion, Central Government Jobs, Fashion designing, JOBS

ఉత్తమ కథలు