Home /News /jobs /

COVID-19 Online Courses: కరోనా పుట్టుక నుంచి చికిత్స వరకు... అన్ని అంశాలపై ఆన్​లైన్ కోర్సులు

COVID-19 Online Courses: కరోనా పుట్టుక నుంచి చికిత్స వరకు... అన్ని అంశాలపై ఆన్​లైన్ కోర్సులు

COVID-19 Online Courses: కరోనా పుట్టుక నుంచి చికిత్స వరకు... అన్ని అంశాలపై ఆన్​లైన్ కోర్సులు
(ప్రతీకాత్మక చిత్రం)

COVID-19 Online Courses: కరోనా పుట్టుక నుంచి చికిత్స వరకు... అన్ని అంశాలపై ఆన్​లైన్ కోర్సులు (ప్రతీకాత్మక చిత్రం)

COVID-19 Online Courses | కోవిడ్ 19 అంటే ఏంటీ? కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? అసలు మహమ్మారి అంటే ఏంటీ? ఇలాంటి అంశాలపై కొన్ని కోర్సులు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కోట్లాది మందికి సోకి లక్షలాది మంది ఉసురుతీసింది. ఇంకా విధ్వంసం కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారితో పోరాడుతూనే ఉంది. ఈ తరుణంలో కొన్ని తప్పుడు సమాచారాలు, ఊహాగానాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఏది కరెక్టో.. ఏది తప్పో గుర్తించేందుకు వైరస్ గురించిన అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. కరోనా పుట్టుక, దాని స్వభావాలు, లక్షణాలు, చికిత్స, వ్యాక్సినేషన్ ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలి. మరి ఎలాగంటారా.. అందుకోసం ఏకంగా ఆన్​లైన్ కోర్సులే ఉన్నాయి. వైరస్​పై అపోహలు తొలగిపోయేలా వైద్య నిపుణులు ఆ కోర్సులను బోధిస్తున్నారు. సరైన సమాచారాన్ని అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మరి ఆ కోర్సులేంటి.. ఏఏ అంశాలున్నాయి.. ఎవరు నిర్వహిస్తున్నారు.. చూసేయండి.

కొవిడ్​-19 కాలంలో సోషల్​ కేర్​: ఐసొలేషన్​, భౌతిక దూరం - ది టావిస్టాక్ అండ్ పోర్ట్​మన్​ ఎన్​హెచ్​ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్​


ఇది ఒక నెల కోర్సు. కరోనా వైరస్​ను ఎలా కట్టడి చేయాలన్న విషయాలను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. సెల్ఫె ఐసొలేషన్​, భౌతిక దూరం ఎలా ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే కరోనాకు సంబంధించిన మరిన్ని వివరాలు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు సోషల్ కేర్ ప్రొఫెషనల్స్​కే కాకుండా ఇళ్లలో కేర్ టేకర్లుగా ఉన్న వారు కూడా నేర్చుకోవచ్చు.

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

PM e-Vidya: ఉచితంగా ఆన్​లైన్ ఎడ్యుకేషన్​... అన్ని తరగతులకు వర్తింపు

ఫిజిక్స్ ఆఫ్ కొవిడ్​-19 ట్రాన్స్​మిషన్- ఎంఐటీ ఓపెన్ కోర్స్​వేర్​

ఇది ఆరు వారాల కోర్సు. కరోనా వైరస్ గురించిన సైంటిఫిక్ అంశాలన్నీ ఇందులో నేర్చుకోవచ్చు. అలాగే కరోనా వ్యాప్తి ప్రమాదం తగ్గించేందుకు ఏం చేయాలో కూడా తెలుసుకోవచ్చు. సైన్స్​, టెక్నికల్​, ఇంజినీరింగ్​, మ్యాథ్స్​లో అండర్ గ్రాడ్యుయెట్​ స్థాయిలో ఉన్న వారికి అర్థమయ్యేలా ఈ కోర్సులో టెక్నికల్ అంశాలు ఉంటాయి. గ్రాడ్యుయెట్​ స్టూడెంట్స్​తో పాటు ప్రొఫెషనల్స్​ కూడా ఈ కోర్సు చేయవచ్చు.

ఇంట్రడక్షన్ టూ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్​ అండ్ కంట్రోల్​ (ఐపీసీ)- డబ్ల్యూహెచ్​వో


రోగుల సంరక్షణ సంబంధిత సేవలు అందించాలనుకున్న వారికి ఈ ఐసీపీ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుంది, ఎలా కట్టడి చేయాలి, ఇన్ఫెక్షన్​ను ఎలా గుర్తించాలి, ప్రమాదాలేంటి, రోగులను ఎలా సంరక్షించాలన్న విషయాలు ఈ కోర్సు ముగిసేలోగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి కేవలం ఒక్క గంట మాత్రమే. ఇది పూర్తి చేసిన వారు ఓ సర్టిఫికేట్​ను కూడా పొందుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) అందిస్తున్న ఈ కోర్సునైనా ప్రతీఒక్కరు నేర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

కొవిడ్-19 ఇన్ఫోడెమిక్​ మేనేజ్​మెంట్​ : డబ్ల్యూహెచ్​వో


ఈ కోర్సు వ్యవధి రెండు గంటలు. దేశాలు, సమూహాలు ప్రజల ఆరోగ్య నిర్వహణలో ఎలా స్పందిస్తున్నాయి, సామాజిక జాగ్రత్తలు ఎలా తీసుకుంటాన్నాయనే పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే నిపుణుల నుంచి సూచనలు కూడా పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Covid-19, Online classes, Online Education

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు