హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Freshers: ఫ్రెషర్స్‌లో ఈ స్కిల్స్ ఉంటే జాబ్ గ్యారంటీ..మంచి ఉద్యోగం రావాలంటే ఇలా చేయండి

Freshers: ఫ్రెషర్స్‌లో ఈ స్కిల్స్ ఉంటే జాబ్ గ్యారంటీ..మంచి ఉద్యోగం రావాలంటే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Freshers Jobs: ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసే సమయంలో కంపెనీలు వారిలో ఎలాంటి స్కిల్స్ టెస్ట్ చేస్తాయనే అంశంపై ఒక సర్వే చేపట్టింది ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ టీమ్‌లీజ్. ‘కెరీర్ అవుట్‌లుక్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Freshers: ఉద్యోగ వేట (Job Search)లో ఉన్న ప్రెషర్స్‌ స్కిల్స్ (Freshers Skills) పెంపొందించుకోవడం చాలా అవసరం. అలాగే ప్రస్తుత ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న రంగాలు, నియామక సమయంలో సంస్థలు ప్రధానంగా దేని మీద దృష్టిసారిస్తున్నాయనే అంశాలపై కూడా అవగాహన ఉండాలి. వీటితో పాటు మంచి నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉంటే.. ఫ్రెషర్స్ త్వరగా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెషర్స్‌ను రిక్రూట్ (Freshers Recruitment)  చేసే సమయంలో కంపెనీలు వారిలో ఎలాంటి స్కిల్స్ టెస్ట్ చేస్తాయనే అంశంపై ఒక సర్వే చేపట్టింది ప్రముఖ ఎడ్‌టెక్ (EdTech) కంపెనీ టీమ్‌లీజ్. ‘కెరీర్ అవుట్‌లుక్ (Career Outlook)’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం.

Software Jobs: వార్షిక ప్యాకేజీ రూ.60 లక్షలు.. ఈ కోర్సులు నేర్చుకుంటే ఈ ప్యాకేజీతో ఉద్యోగం పొందొచ్చు..

భారతదేశంలోని దాదాపు 59 శాతం కంపెనీలు ఫ్రెషర్లను వివిధ జాబ్ రోల్స్‌కు నియమించుకోవాలని భావిస్తున్నాయని కెరీర్ అవుట్‌లుక్ సర్వే తేల్చింది. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎస్ఈవో (SEO), బ్లాక్‌చెయిన్, బిజినెస్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఫ్రెషర్లకు గణనీయమైన డిమాండ్ ఉందని రిపోర్టు పేర్కొంది.

* ఐటీ, ఇ-కామర్స్ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు

ఫ్రెషర్లకు అత్యంత స్థిరమైన మార్కెట్‌లలో ఇండియా ఒకటని, 2022 జూన్ నుంచి టాలెంట్ ఉన్న ఫ్రెషర్స్‌కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని సర్వే వెల్లడించింది. ఐటీ, ఇ-కామర్స్ రంగాలు దేశవ్యాప్తంగా ఫ్రెషర్స్ నియామకానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయని, ప్రధానంగా బెంగుళూరు, ముంబై, ఢిల్లీ , చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని సర్వే‌లో తేలింది. అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, మాలిక్యులర్ బయాలజిస్ట్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చర్, ఎమ్‌ఎల్ ఇంజనీర్ వంటి వాటి డొమైన్లలో కూడా ఫ్రెషర్స్‌కు అత్యధిక డిమాండ్ ఉన్న రోల్స్ ఉన్నాయని సర్వే పేర్కొంది.

WIPRO: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జీతాల పెంపు.. ఎంత శాతం పెరుగుతాయంటే..

* కీ రోల్‌గా టెక్నాలజీ -లెడ్ స్కిల్స్‌..

ప్రస్తుత నియామక ట్రెండ్స్‌పై టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, బిజినెస్ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్ వంటి డొమైన్‌లలో నైపుణ్యాలు ఉన్నవారికి అద్భుతమైన డిమాండ్‌ ఉందన్నారు. హై-డిమాండ్ స్కిల్స్, ఉద్యోగాలపై స్పష్టతతో, ఇప్పుడు డైనమిక్ జాబ్ మార్కెట్‌ను ఫ్రెషర్స్ వ్యూహాత్మకంగా నావిగేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రిక్రూటర్లు కూడా ఇలాంటి స్కిల్స్‌ను టెస్ట్ చేస్తాయని తెలిపారు. టెక్నాలజీ -లెడ్ స్కిల్స్ అనేవి ఫెషర్స్ డిమాండ్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

* సర్వే‌పై సంస్థ వివరణ..

ఫ్రెషర్లను నియమించుకునేటప్పుడు యాజమాన్య సంస్థలు ప్రధానంగా ఫోకస్ చేసే అంశాలు, ఉద్యోగ వేటలోని ఫ్రెషర్లకు మార్గనిర్దేశం చేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు టీమ్‌లీజ్ వెల్లడించింది. అందుకు తగ్గట్టు అధిక డిమాండ్ ఉన్న జాబ్ రోల్స్, వాటికి అవసరమైన అసోసియేటెడ్ స్కిల్స్‌ను హైలైట్ చేశామని పేర్కొంది.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: EDUCATION, Interview, JOBS

ఉత్తమ కథలు