Home /News /jobs /

WHAT ARE THE TOP UNIVERSITIES IN INDIA AND HOW TO GET A SEAT IN THEM CHECK HERE BA GH

Top Universities in India: ఇండియాలో టాప్- 10 వర్సిటీలు.. వీటిలో అడ్మిషన్ ప్రాసెస్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రానున్న విద్యా సంవత్సరంలో UG, PG అడ్మిషన్ కోసం ఎదురు చూస్తుంటే. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ద్వారా ర్యాంక్ పొందిన టాప్-10 యూనివర్సిటీల గురించి తెలుసుకోండి. దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒకటి. అందులో ప్రవేశాలు ఎలా పొందొచ్చో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
ఎంచుకొన్న కాలేజ్‌లో మాత్రమే తప్పకుండా సీటు సాధించడం సులభమైన పని కాదు. కళాశాలల జాబితా, వాటి నిర్దిష్ట అర్హత ప్రమాణాలు, సంక్లిష్టమైన అడ్మిషన్ ప్రక్రియ ద్వారా వెళ్లాలి. యూజీ అడ్మిషన్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CUCET) ప్రారంభంతో అడ్మిషన్ ప్రక్రియ సులువు అయినా.. ఉత్తమ కళాశాలను ఎంచుకోవడం ఇప్పటికీ పెద్ద సంక్లిష్టమైన ప్రక్రియ. రానున్న విద్యా సంవత్సరంలో UG, PG అడ్మిషన్ కోసం ఎదురు చూస్తుంటే. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ద్వారా ర్యాంక్ పొందిన టాప్-10 యూనివర్సిటీల గురించి తెలుసుకోండి.

ఐఐఎస్‌సీ బెంగళూరు (IISC BANGALORE)
దేశంలోని ప్రముఖ సైన్స్ కళాశాలల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు(IISC BANGALORE) ఒకటి. ఫ్లాగ్‌షిప్ రీసెర్చ్ కోర్సులకు ప్రసిద్ధి చెందింది. IISc వివిధ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్) కోర్సులను అందిస్తోంది. IIT JEE, KVPY, NEET వంటి సాధారణ ప్రవేశ పరీక్షలలో అభ్యర్థి పనితీరు ఆధారంగా ఈ కోర్సులకు అడ్మిషన్లు ఇస్తారు. IIT-JEE అడ్వాన్స్‌ ద్వారా ప్రవేశం పొందిన వారు మ్యాథ్స్, కంప్యూటింగ్‌లో BTech చేసే అవకాశం ఉంది.

JEE Main-2022: జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇలా..!



ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT)
రాష్ట్ర నిధులతో ఏర్పాటైన డీమ్డ్ యూనివర్సిటీ.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ICT), ముంబై. కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, ఫార్మసీ రంగాలలో శిక్షణ, పరిశోధనపై దృష్టి సారించే కోర్సులను అందిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ (CAP) ద్వారా కళాశాల UG కోర్సులకు అడ్మిషన్ ఇస్తారు. విద్యార్థులు అడ్మిషన్లకు అర్హత పొందాలంటే JEE మెయిన్ లేదా MHT-CET క్లియర్ చేయాలి.

Career and Course: ఇంట‌ర్ అర్హ‌త‌తో ఐటీ కోర్సు.. ఉద్యోగ అవ‌కాశాలు ట్రై చేయండి


జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ (JNU , NEW DELHI)
న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాలు, సైన్స్, భాషలు, ఇతర విషయాలలో వివిధ ప్రధాన కోర్సులను అందిస్తోంది. ఈ సంవత్సరం నుండి JNU అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన CUET ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది.

Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారికి 31 సెంటర్లలో ఫ్రీ కోచింగ్.. వివరాలిలా..



యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివిధ సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్ సబ్జెక్టులలో కోర్సులను అందిస్తుంది. CUET 2022 ద్వారా UG కోర్సులకు అడ్మిషన్ కల్పిస్తుంది.

IIM Admissions: గుడ్ న్యూస్... IIMలలో అడ్మిషన్ కు క్యాట్(CAT) అవసరం లేదు.. ఎలా అంటే..



తేజ్‌పూర్ యూనివర్సిటీ (Tejpur University)
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఉన్న తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం వివిధ అధ్యయన రంగాలలో కోర్సులను అందిస్తుంది. NIRF అగ్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. వర్సిటీ CUET ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది.

ఢిల్లీ యూనివర్సిటీ (UNIVERSITY OF DELHI)
UG అడ్మిషన్‌కు 12వ తరగతి మార్కుల కట్ ఆఫ్ ప్రమాణాల విధానాన్ని నిలిపివేస్తూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం UG, PG కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు CUETపై ఆధారపడనుంది.

Jobs In Google: గుడ్ న్యూస్.. గూగుల్ సంస్థలో 12 వేల ఉద్యోగాలు.. ఆ వివరాలిలా..


బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి (BHU, VARANASI)
బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) అందించే కోర్సులలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా అడ్మిషన్‌ దక్కుతుంది. మెడికల్ కోర్సులకు నీట్, ఇంజినీరింగ్ కోసం జేఈఈ, హ్యుమానిటీస్ కోర్సులకు సీయూఈటీ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. గతంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం
అంతరిక్ష శాస్త్రం, పరిశోధనలలో కోర్సులను అందిస్తూ, IIST JEE అడ్వాన్స్‌డ్, JEE మెయిన్, JEST, UGC NET, GATE మొదలైన జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది.

Two Degrees | UGC: ఒకేసారి రెండు డిగ్రీలకు అనుమతిపై విద్యావేత్తల ఆందోళన.. కారణం ఏంటంటే..



అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్
UG అడ్మిషన్ కోసం CUET 2022 లో పాల్గొనే విశ్వవిద్యాలయాలలో AMU కూడా ఉంది. అయితే ఇది BTech, PG, క్లాస్ 11, డిప్లొమా కోర్సులు, పాఠశాలల్లో ప్రవేశంతో సహా కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది.

నేషనల్ లా యూనివర్సిటీ (NATIONAL LAW UNIVERSITY)
నేషనల్ లా యూనివర్సిటీ, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) అనే సాధారణ ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తోంది. ఇంటిగ్రేటెడ్ UG కోర్సులను కూడా అందిస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Career and Courses, CUET 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు