Home /News /jobs /

WHAT ARE THE TESTS FOR INDIAN NAVY AGNIVEER SSR WHAT ARE THE RETURN EXAM PREPARATION TIPS LETS KNOW ABOUT THEM HERE VSP VB

Indian Navy Agniveer Jobs: అగ్నివీర్ నేవీ జాబ్స్.. అర్హత, ప్రిపరేషన్ విధానం ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  (P. Anand Mohan, News 18, Visakhapatnam)

  దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ(Army), నేవీ(Navy), ఎయిర్ ఫోర్స్(Airforce) లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో(Agnipath) భాగంగా అగ్నివీర్ లను(Agniveer) నియమించనుంది. ఇక రక్షణ శాఖలోని మూడు విభాగాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో అగ్నివీర్‌ స్కీం (Indian Navy Agniveer SSR) నోటిఫికేషన్ ను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. SSR పోస్ట్‌లకు 2800 ఖాళీలు ఉన్నాయి. ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR) పరీక్షను అక్టోబర్ 2022లో నిర్వహించబోతోంది.

  Agniveer Jobs: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి..? తెలుసుకోండి..


  ఇండియన్ నేవీలోని అగ్నివీర్ (SSR) పోస్టుల్లో సెలక్ట్ అయినవారు నేవీ లోని అత్యంత సాంకేతికత కలిగిన సంస్థలో భాగం అవుతారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లు మరియు ఫ్రిగేట్‌లు, రీప్లెనిష్‌మెంట్ షిప్‌లు, అత్యంత సాంకేతిక, ఆకర్షణీయమైన జలాంతర్గాములు మరియు ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటి శక్తివంతమైన, ఆధునిక నౌకల్లో సేవలందించవలసి ఉంటుంది. రాడార్లు, సోనార్లు లేదా కమ్యూనికేషన్లు లేదా క్షిపణులు, తుపాకులు, రాకెట్ల వంటి ఆయుధాలను కాల్చడం వంటి వివిధ పరికరాల కార్యకలాపాలు చేపట్టాల్సివస్తుంది. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి INS చిల్కాలో ప్రాథమిక శిక్షణ పొందుతారు. నేవీలోని వివిధ అవసరాలను బట్టి సేవలందించాల్సి ఉంటుంది.  ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR) నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయింది. పోస్టులకు సంబంధించిన కావాల్సిన అర్హతలను చూస్తే..  గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి గణితం, భౌతికశాస్త్రం మరియు వీటిలో కనీసం ఒక సబ్జెక్ట్‌తో 10 2 పరీక్షలో అర్హత సాధించాలి. అగ్నివీర్ (SSR) అభ్యర్థుల వయస్సు నమోదు రోజున 17½ - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అగ్నివీర్ 2022 బ్యాచ్‌కు మాత్రమే.. గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాల వరకు సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్‌లు, డొమిసైల్ సర్టిఫికేట్ మరియు NCC సర్టిఫికేట్ (ఉంటే) అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లను రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలలో చూపించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in నుండి కాల్ అప్ లెటర్స్ కమ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాల్ అప్ లెటర్ మరియు అడ్మిట్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపబడదు. అభ్యర్థులను సంప్రదించేటప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మోడ్ మాత్రమే ఉపయోగించబడుతుంది.

  CUET Preparation Tips: సీయూఈటీ పరీక్ష కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? మీ కోసం ఈ చిట్కాలు..


  ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR) ఎంపిక ప్రక్రియ ఐదు దశలలో ఉంటుంది. 1) షార్ట్‌లిస్టింగ్ 2)ఆన్ లైన్ రాత పరీక్ష 3) ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT) 4) మెడికల్ ఎగ్జామినేషన్‌ లలో ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇలా అన్నీ టెస్టుల్లో క్వాలిఫై అయితే.. నవంబర్ లో మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. అభ్యర్ధికి సంబంధించిన డాక్యుమెంట్స్, అర్హతలను చూసి మొదటి రౌండ్ షార్ట్ లిస్టింగ్ పూర్తవుతుంది. అనంతరం 2వ రౌండ్ లో ఆన్ లైన్ రాత పరీక్ష (Written exam) ఉంటుంది. ఎంపిక చేసిన సెంటర్ల లో కంప్యూటర్‌ను ఉపయోగించి నిర్వహించబడుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ నిర్వహించబడతాయి. పరీక్ష 60 నిమిషాల పాటు ఉంటుంది. అభ్యర్థులు ప్రతి విభాగాన్ని మరియు మొత్తం పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి. ఇంగ్లీష్ (English), మేధమేటిక్స్ (Mathematics), సైన్స్(Science), జనరల్ నాలెడ్జ్(General Knowledge) సబ్జెక్ట్ లలో రాత పరీక్ష ఉంటుంది. ఇండియన్ నేవీ అగ్నివీర్(SSR) 2022: ప్రిపరేషన్ టిప్స్ అండ్ స్ట్రాటజీ ఎలా వుండాలి?

  1)పరీక్ష ఆకృతి మరియు స్కోరింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ సిలబస్ మరియు పరీక్షా విధానాన్ని తెలుసుకోవాలి. గతంలో నిర్వహించబడిన నేవీ ఎగ్జామ్ లలోని ప్రశ్నలు ఎలా వుంటాయో పరిశీలించండి. తద్వారా ప్రిపరేషన్ లో ఉపయోగపడుతుంది. 2)మెరుగైన ఫలితాల కోసం, అత్యధిక మార్కులు, వెయిటేజీలను పరిశీలించి ఆ టాపిక్స్ ను టైమ్ ఎక్కువ కేటాయించండి. టాపిక్స్ కు అనుగుణంగా వాటికి మరింత శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అవ్వండి. 3)మీ పరీక్ష సన్నద్ధత స్థాయిని పెంచడానికి, మునుపటి సంవత్సరం నుండి ప్రాక్టీస్ పరీక్షలు మరియు ప్రశ్నలను తీసుకోండి.4)ఎక్కువ కాలం విషయాలను గుర్తుంచు కోవడానికి, వారు ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్ లకు అటెండ్ అవ్వండి. తద్వారా రాత పరీక్షలో టైమ్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. 5) అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేవీ అగ్నివీర్ సిలబస్‌తో క్షుణ్ణంగా ఉండాలి, తద్వారా వ్రాత పరీక్షలో ఇండియన్ నేవీ అగ్నివీర్ కట్-ఆఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఇలా ఒక ప్లాన్ ప్రకారం, ప్రిపరేషన్ టిప్స్, ఎగ్జామ్ రాసే సమయంలో తీసుకోవాల్సిన టిప్స్ ను పాటిస్తే.. ఇండియన్ నేవీ అగ్నివీర్ పరీక్షలో సులభంగా గట్టెక్కవచ్చు. ఎక్కువ మార్కులు సాధించి మిగిలిన రౌండ్లకు క్వాలిఫై కావచ్చు.

  పైన చెప్పిన టిప్స్ ఉపయోగించి, ఆన్ లైన్ రాత పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన వారికి తరువాత శారీరక పరీక్ష (PFT) ఉంటుంది. అగ్నివీర్ కు సెలక్ట్ కావాలంటే.. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)లో అర్హత సాధించడం తప్పనిసరి. పురుష అభ్యర్ధులకు (male) అయితే 157 సెంమీ,  ఆడ(Female) అయితే 152 సెం.మీ లు ఉండాలి. పురుష అభ్యర్ధులు 6.30 నిమిషాలలో1.6 కి.మీ పరుగు పూర్తి చేయాలి. 20 స్క్వాట్‌లు (ఉతక్ బైఠక్),12 పుష్-అప్‌లు చేయాలి. ఆడ అభ్యర్ధులయితే (female)అయితే 8 నిమిషాలలో1.6 కి.మీ పరుగు పూర్తి చేయాలి. 15స్క్వాట్‌లు (ఉతక్ బైఠక్), 10 పుష్-అప్‌లు చేయాలి. ఫిజికల్ పూర్తయిన వారికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. అగ్నివీర్ (SSR)లకు వర్తించే ప్రస్తుత నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు ఉంటాయి. డాక్టర్లు కోరితే, గరిష్టంగా 21 రోజుల వ్యవధిలో మెడికల్ టెస్ట్ లకు అటెండ్ కావాల్సి ఉంటుంది. అభ్యర్థి మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండాలి. ఎలాంటి వ్యాధి/వైకల్యం లేకుండా ఉండాలి. యుద్దం లేనప్పుడు, యుద్ధ పరిస్థితుల్లోనూ.. ఇలా అన్ని పరిస్థితుల్లో విధులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థి మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. కంటి చూపు (ద్ళశ్య ప్రమాణాలు) (eye vision) అద్దాలు లేకుండా బెటర్ ఐ 6/6, వర్స్ ఐ  6/9 ఉండాలి. అద్దాలతో అయితే బెటర్ ఐ 6/6, వర్స్ ఐ 6/6 ఉండాలి.

  TSLPRB SI Questions Analysis: పూర్తయిన TS SI ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల స్థాయి ఎలా ఉందంటే..

  ఇలా ఇలా ఐదు రకాల పరీక్షలు పూర్తి చేసిన వారికి .. వాటిలో వచ్చిన ఫలితాలను ప్రకటిస్తారు. షార్ట్‌లిస్ట్ లో ఎంపిక చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ లో ప్రొవిజన్ సెలక్ట్ లిస్ట్ (PSL) రౌండ్‌కు పిలుస్తారు. ఇక్కడ సెలక్ట్ చేసిన వారితో ఈ ఏడాది డిసెంబర్ చివరి వారం లో ప్రకటించి, డిసెంబరు చివరి నాటికి మొదటి బ్యాచ్ నమోదును సిద్దం చేసి  (Indian Navy Agniveer SSR) శిక్షణ ప్రారంభిస్తారు. సో.. అభ్యర్ధులందరికీ ఆల్ ది బెస్ట్.
  Published by:Veera Babu
  First published:

  Tags: Agniveer, Career and Courses, Indian Navy, JOBS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు