హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Exam: ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్ ఎగ్జామ్​పై ఆరోగ్య, విద్యా శాఖల అభిప్రాయం ఇదేనా..

NEET Exam: ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్ ఎగ్జామ్​పై ఆరోగ్య, విద్యా శాఖల అభిప్రాయం ఇదేనా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏడాదిలో రెండు సార్లు నీట్‌ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని, ఒత్తిడిని తగ్గించొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నీట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే అంశంపై చర్చలను పునఃప్రారంభించడానికి విద్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సిద్ధమయ్యాయి.

ఇంకా చదవండి ...

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష (NEET Exam)లో ఉత్తీర్ణత సాధించకలేకపోతామేమో అన్న భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం చూస్తూనే ఉన్నాం. కొందరు ఫెయిల్ అయ్యామని లేదా మంచి ర్యాంకు రాలేదని తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి వైద్యవిద్య ప్రవేశ పరీక్ష (NEET)ను యేటా రెండుసార్లు నిర్వహించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఏడాదికి ఒక్కసారి, ఒక్క రోజులో నిర్వహించే నీట్ ఎగ్జామ్‌లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారి మెడికల్ భవిష్యత్తును నిర్ణయించడం సరైంది కాదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఏడాదిలో రెండు సార్లు నీట్‌ (Neet twice a year) నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని, ఒత్తిడిని తగ్గించొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నీట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే అంశంపై చర్చలను పునఃప్రారంభించడానికి విద్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు (Ministries of Education and Health) సిద్ధమయ్యాయి. గతేడాది విద్యాశాఖ మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నేతృత్వంలో ఈ అంశంపై తొలిసారిగా చర్చించారు. అయితే ఈ విషయంపై ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. ఈసారి ఈ విషయంపై అందరూ ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమిళనాడు ప్రభుత్వం కమిటీ.

నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో నీట్ సామాజిక, ఆర్థిక ప్రభావాలను అంచనా వేయడానికి తమిళనాడు ప్రభుత్వం (Government of Tamil Nadu) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ పరీక్ష కోచింగ్ సంస్కృతికి దారితీసిందని ఈ కమిటీ తెలిపింది. కోచింగ్ తీసుకున్న ధనిక పిల్లలు మాత్రమే నీట్ పరీక్ష (NEET Exam)లో ఉత్తీర్ణత సాధించగలుగుతున్నారని తమిళనాడు కమిటీ పేర్కొంది. 12వ తరగతి మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ కోర్సు (MBBS Course)లో జాయిన్ అయిన విద్యార్థుల కంటే.. నీట్ ద్వారా ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులే పూర్ (poor) గా పెర్ఫార్మ్ చేస్తున్నారని తమిళనాడు కమిటీ (committee) కనుగొంది. పన్నెండో తరగతి మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ విద్యార్థులు నీట్ ఉత్తీర్ణుల కంటే ఉత్తమ ప్రతిభను (The best talent) చూపుతున్నారని ఆ కమిటీ తెలిపింది.

నీట్ 2021 పరీక్షపై తీవ్ర విమర్శలు..

అయితే ఎగ్జామ్ యేటా రెండు సార్లు నిర్వహించడానికి సపోర్ట్ లభిస్తోంది. కానీ కొన్ని సవాళ్లను అధిగమిస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలుస్తోంది. ప్రతి ఏటా 15 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పెన్-పేపర్ ఆధారిత ఎగ్జామ్ రాస్తుంటారు. దీనిని ఒక్కసారి నిర్వహించడానికే నిర్వాహకుల తలప్రాణం తోకకి వస్తుంది. ఇక కరోనా సమయంలో (Corona Time) ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. నీట్ 2021 పరీక్షపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్వశ్చన్ పేపర్ లీక్ (question paper leak) అయిందని, ఒకరి బదులు మరొకరు వచ్చి ఎగ్జామ్ రాశారని, క్వశ్చన్ లలో తప్పులు ఉన్నాయని అనేక వివాదాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చుట్టుముట్టాయి.

పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి..

ఈ పరీక్ష కోర్టు మెట్లను కూడా ఎక్కాల్సి వచ్చింది. అయితే ఇలాంటివి జరగకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను నిష్పక్షపాతంగా, ప్రామాణికంగా నిర్వహించడానికి నానా తిప్పలు పడుతోంది. అదే ప్రతి ఏటా రెండు సార్లు పరీక్ష కండక్ట్ చేయాల్సి వస్తే.. స్కామ్స్ (Scams) అరికట్టడం కష్టమేననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తదుపరి చర్చ ఎప్పుడు..

ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొనేందుకు చర్చలో భాగమైన మంత్రులను (Ministers) మారుస్తున్నారు. నాయకత్వ మార్పుకు ముందే రెండు మంత్రిత్వ శాఖల మధ్య జరిగే చర్చలు కొత్త దృక్పథాన్ని తీసుకురావచ్చు. అయితే తదుపరి చర్చ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏడాదికి రెండుసార్లు మెడికల్ ప్రవేశ పరీక్ష (Medical entrance test) నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని గతంలో వార్తలు వచ్చాయి, అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సమావేశం తర్వాత జాతీయ వైద్య కమిషన్ (NMC) ఏర్పాటుతో వైద్య విద్య కోసం ఏర్పడిన అపెక్స్ బాడీ కూడా మారిపోయింది.

First published:

Tags: Exams, NEET, NEET 2021

ఉత్తమ కథలు