Railway Jobs: రైల్వే జాబ్ అలర్ట్... మరో నోటిఫికేషన్ వచ్చేసింది... రూ.92,300 వరకు వేతనం

Railway Jobs: రైల్వే జాబ్ అలర్ట్... మరో నోటిఫికేషన్ వచ్చేసింది... రూ.92,300 వరకు వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs | పశ్చిమ రైల్వే పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు, నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి.

  • Share this:
    రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వెస్టర్న్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 21 పోస్టుల్ని ప్రకటించింది. పలు రకాల క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఆగస్ట్ 4న ప్రారంభం అవుతుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrc-wr.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసే పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో రాణించినవారే అప్లై చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    Western Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 21
    అథ్లెటిక్స్- 7
    హ్యాండ్ బాల్- 3
    హాకీ- 3
    బాస్కెట్ బాల్- 3
    క్రికెట్- 1
    డైవింగ్- 1
    రెజ్లింగ్- 1
    వాటర్ పోలో- 1
    టేబుల్ టెన్నిస్- 1

    Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

    UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... రూ.1,42,000 వేతనం

    Western Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 4 ఉదయం 10 గంటల నుంచి
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 3 రాత్రి 10 గంటల వరకు
    విద్యార్హతలు- లెవెల్ 4, లెవెల్ 5 ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
    ఇతర అర్హతలు- అభ్యర్థులు 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 28 మధ్య సంబంధిత క్రీడల్లో రాణించి ఉండాలి.
    వయస్సు- 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1997 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు.
    దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మహిళలకు రూ.250.
    వేతనం- లెవెల్ 4 పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, లెవెల్ 5 పోస్టులకు రూ.29,200 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,300 వేతనం, లెవెల్ 2 పోస్టులకు రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.62,200 వేతనం, లెవెల్ 3 పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.

    TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి

    IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

    Western Railway Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


    అభ్యర్థులు ముందుగా https://www.rrc-wr.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో స్పోర్ట్స్ కోటా జాబ్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
    Apply Online పైన క్లిక్ చేసి అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    అభ్యర్థి తన ఆధార్ కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
    ఆధార్ నెంబర్ లేకపోతే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    విద్యార్హతల సర్టిఫికెట్స్, క్రీడల్లో రాణించిన సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: