హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: భారతీయ రైల్వే ఉద్యోగాలు... రూ.92,300 వరకు వేతనం... అప్లై చేయండిలా

Railway Jobs: భారతీయ రైల్వే ఉద్యోగాలు... రూ.92,300 వరకు వేతనం... అప్లై చేయండిలా

Railway Jobs: భారతీయ రైల్వే ఉద్యోగాలు... రూ.92,300 వరకు వేతనం... అప్లై చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: భారతీయ రైల్వే ఉద్యోగాలు... రూ.92,300 వరకు వేతనం... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Western Railway Recruitment 2021 | వెస్టర్న్ రైల్వే పలు ఉద్యోగాలను (Railway Jobs) భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి అలర్ట్. వెస్టర్న్ రైల్వే (Western Railway) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. స్పోర్ట్స్ కోటాలో 21 గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. జాబ్ నోటిఫికేషన్‌లో (Job Notification) సూచించిన క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అథ్లెటిక్స్, హాకీ, బాస్కెట్ బాల్, క్రికెట్, డైవింగ్, రెజ్లింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్ లాంటి క్రీడల్లో రాణించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 సెప్టెంబర్ 3 రాత్రి 10 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. అంటే అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే అవకాశం ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు విధానం తెలుసుకోండి.

మొత్తం ఖాళీలు21
అథ్లెటిక్స్7
హ్యాండ్ బాల్3
హాకీ3
బాస్కెట్ బాల్3
క్రికెట్1
డైవింగ్1
రెజ్లింగ్1
వాటర్ పోలో1
టేబుల్ టెన్నిస్1UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Western Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 4

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 3 రాత్రి 10 గంటలు

విద్యార్హతలు- లెవెల్ 4, లెవెల్ 5 ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

క్రీడార్హతలు- అభ్యర్థులు 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 28 మధ్య సంబంధిత క్రీడల్లో రాణించి ఉండాలి.

వయస్సు- అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1997 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మహిళలకు రూ.250.

వేతనం- లెవెల్ 4 పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, లెవెల్ 5 పోస్టులకు రూ.29,200 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,300 వేతనం, లెవెల్ 2 పోస్టులకు రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.62,200 వేతనం, లెవెల్ 3 పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.

APEPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 398 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

Western Railway Recruitment 2021: అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ముందుగా https://www.rrc-wr.com/ వెబ్‌సైట్‌లో స్పోర్ట్స్ కోటా జాబ్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.

Step 2- Apply Online పైన క్లిక్ చేసి అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 3- అభ్యర్థి తన ఆధార్ కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ లేకపోతే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 4- విద్యార్హతల సర్టిఫికెట్స్, క్రీడల్లో రాణించిన సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 5- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

Step 6- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway jobs

ఉత్తమ కథలు