WESTERN RAILWAY BEGINS APPLICATION PROCESS FOR 3591 APPRENTICE POSTS KNOW HOW TO APPLY SS
Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
(ప్రతీకాత్మక చిత్రం)
Western Railway Recruitment 2021 | పశ్చిమ రైల్వే మొత్తం 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్లు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. పశ్చిమ రైల్వే 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 24 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది పశ్చిమ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ లో చూడొచ్చు.
Western Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
Western Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 మే 25 ఉదయం 11 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 24 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్ల లోపు
దరఖాస్తు ఫీజు- రూ.100
అభ్యర్థులు పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ లో ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Engagement of Apprentices లింక్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Click here to Apply Online పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click here to Register పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత పేజీలో ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.