వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్(Western Coal Field Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.westerncoal.in ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7 నుండి ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, వైర్‌మ్యాన్, సర్వేయర్, మెకానిక్ డీజిల్, డ్రాఫ్ట్స్‌మన్, టర్నర్ తదితర 900 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు 900. విభాగాల వారీగా ఇలా..
ఎలక్ట్రీషియన్: 228 పోస్టులు
ఫిట్టర్: 221 స్థానాలు
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 216 పోస్టులు
సెక్యూరిటీ గార్డ్: 60 పోస్టులు
వెల్డర్: 59 పోస్టులు
మెకానిక్ డీజిల్: 37 పోస్టులు
వైర్‌మ్యాన్: 24 పోస్ట్‌లు
మెషినిస్ట్: 13 పోస్టులు
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్): 12 పోస్టులు
టర్నర్: 11 పోస్ట్‌లు
సర్వేయర్: 9 పోస్టులు
పంప్ ఆపరేటర్ & మెకానిక్: 5 పోస్టులు
మేసన్ (బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్): 5 పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్‌లలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు నవంబర్ 11, 2022 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుండి రూ.8,050 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది. ఫ్రెషర్లకు రూ.6,000 స్టైఫండ్ ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
విద్యార్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా నవంబర్ 22, 2022 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7 నుంచి ప్రారంభమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS